అనుభవసారము/కఠినపదములు

వికీసోర్స్ నుండి

అనుభవసారము

కఠినపదములకు, సాంకేతిక పదములకు అర్థములు

1.

గురువు = దీక్షాగురువు. లింగము = పరబ్రహ్మము, శివుఁడు. జంగమము = చరలింగము; జీవికూపమునఁ జరించుశివుఁడు; శివభక్తుఁడు. పశువులు = జీవులు.


4.

పాశము = భవము; అణవిక, కార్మిక, మాయామలరూపకముగ జీవుల నంటియుండునది.


7.

ఏకఏవరుద్రో... = రుద్రుఁ డొకఁడే దేవుఁడు. రెండవవాఁడు లేఁడు. అణోరణీయాన్...= అణువుకంటెను జిన్నది. మహత్పదార్థముకంటెను గొప్పది. అవాగ్గోచర = వాక్కునకు మనస్సునకుఁగూడ నతీతమై కనరానిది.


3.

సర్వవేదేష్వతోభవత్ = సమస్తమునందుండియే (లింగమనఁగాఁ బరబ్రహ్మము) నుండియే యుద్భవించినదని సకలవేదములు చెప్పును. శ్వపచోపి... = లింగార్చనమునం దాసక్తుఁడైనచోఁ జండాలుఁడైనను మునిశ్రేష్ఠుఁడే. సరుద్రైవ.. = భూతలమున నతఁడే (శివభక్తుఁడే) రుద్రుఁడు. అతనియందే శివుఁడు సన్నిహితుఁడై యుండును. సచ పూజ్యో = నావలెనే యతఁడుగూడఁ బూజింపఁదగిన వాఁడు.


9.

రుద్రేణాత్తమశ్నంతి = శివున కర్పితమయి యాతనివలన భుజింపంబడినదే భుజింతురు, పాన మొనర్పఁబడినదే క్రోలుదురు.


11-9.

అతికిల్బిషం...= శివార్పితము కానిపదార్థము మిక్కిలి యపవిత్రమయినది.' లోభాన్నధారయేత్ = శివనిర్మాల్యమును లోభముచే ధరింపరాదు. ప్రసాద మేవభోక్తవ్యమ్ = శివప్రసాదమే భుజింపఁదగినది. మలహరుఁడు = శివుఁడు.


13-18.

గోడగము = (1)బూటకము. (2) నిస్సారము. (3) సల్లాపము; గోపతి = శివుఁడు.


14-24.

గురులింగము = లింగమున ( శివున) కభిన్నుఁ డైనదీక్షాగురుఁడు. హస్తజాతుఁడు = గురుఁడు హస్తమస్తకసంయోగ మొనర్చి చిత్కళాన్యాస మొనరించినంతనే భౌతికశరీరము లింగశరీరముగ మాఱుటచే ద్విజన్మ మొందినవాఁడు = శిష్యుఁడు.


26.

సంవిక్పదము = విజ్ఞానపదము.


15-27.

లింగమథనము = ఆంతరంగికముగ లింగాంగసామరస్య(శివజీవైక్య)మున కయి కావించు కేళి. శరణులు = సతిపతినివలె ననన్య

బుద్ధితో శివుఁడే శరణమని దృఢనిశ్చయముతోఁ గొలుచుభక్తులు.


15-28.

పదడు = మన్ను.


31.

హంసక్షీరమివాంఛసి = హంస నీరమును క్షీరమునుండి వేఱుచేయు


16-35.

లెప్పంబు = లక్ష్యము.


24-70.

ఉరవడించు = తొందరపడునట్లు.


71.

ఉరువిడి = సంపద; రూపము.


72.

అలయమి = విసుగు నొందకుండుట.


25-75.

ఒడమి = ధనము. కొనియాడక = లక్ష్యము సేయక.


26.93.

నికము = నిక్కము. ఒడ్డరి యడ్డరి = కల్లబొల్లి.


27-33.

కెలని = ఎదిరి.


85.

పాలసుఁడు = నీచుఁడు


87.

పాదలి = అధముఁడు.


28.92.

బ్రాఁతులె = అరుదులే = పొందరానివే.


30-90.

ఎడమడుగు = వైషమ్యము.


101.

వేఁగు = అసాధ్యము.


31-104.

 క్రేఁపు = దూడ. మొదవు = గోవు.


32-111.

తను విడువక = శరీర మొసంగక


3-114.

వంటని = అలవడని. పెంట = అతిశయము; పెంపు. రెంటికి నెడతాకి చెడ్డరేవనిభంగిన్ = ఈజాతీయోక్తినిగూర్చి చాలఁ జర్చ లిదివఱలో జరిగినవి. రేవఁ డనుచాకలి యొకనది యొద్ద రెండురేవులు పెట్టి బట్ట లుదుకుచుండఁగా నొకనాఁడు నదికి వఱద వచ్చుట గాంచి, తనదగ్గఱ నున్నరేవునందలి చాకిబానలందలి బట్టలను ముందుగా దూరమునకు గొనిపోయి జాగ్రత్త సేయక వాని నీట విడిచి రెండవరేవునందలి బట్టలకయి యేఁగఁగా నీనడుమ వెల్లువ వచ్చి రెండురేవులలోని బట్టలు గూడ గొట్టుకొనిపోయె ననుట యిందలి యైతిహ్యము. కాని కొందఱు పండితులు "ఉంబేకః కారికాంవేత్తి, తంత్రంవేత్తి ప్రభాకరః, మండనస్తూభయంవేత్తి, నోభయం వేత్తి రేవణః" అనుశ్లోకమునం దుదాహృతుఁ డయిన రేవణుని గూర్చియే యీ సామెత యేర్పడిన దని తలంచుచున్నారు. ఉపలబ్ధములయిన యాంధ్రగ్రంథములలో దీనిని సోమనాథుఁడే యీయనుభవసారమున మునుముందు వాడినట్లు కనవచ్చుచున్నది. ఇందలి "ఎడతాకి" యను పదమును జాకివానికథకే స్ఫోరకముగా నున్నది. మనుచరిత్రము, గౌరన హరిశ్చంద్రోపాఖ్యానము, పినవీరన జైమినిభారతమునందును "రెంటికిం జెడినరేవఁడు" అని మాత్రమే ప్రయోగింపఁబడినది.

33.115.

కించు = నీచుఁడు.


31-121.

కొండాడు = విహరించు.


122.

తాఱు = తొలఁగు; మఱుఁగుపడు.


123.

భవి = భవముకలవాఁడు; అభక్తుఁడు.


35-127.

పొరుగన్ = నశింపఁగా.


129.

చెనయు = ఎదుర్కొను, కలహించు.


36-131.

ఉపాదేయము = గ్రహింపఁదగినది.


37-136.

తలఁకమి = జంకు లేకుండుట.


39-150.

అర్థిదోషం నపశ్యతి = (భక్తుఁడు), అర్థియందలి దోషములఁ దిలకింపఁడు.


41-153.

ఆర్యానాథుఁడు = శివుఁడు.


42-159.

కించిద్దళంవా చులుకోదకంవా = ఇంచుకపత్రి గాని, పుడిసెడుజలముగాని (శివున కర్పించిన). దేవేంద్రలక్ష్మీపదం తేదదాసి = మహేంద్రైశ్వర్య పదవిని వాని కొసంగుదువు.


43-163.

త్రైలింగార్చన = ఇష్ట ప్రాణభావలింగపూజ; (లేక) హరలింగ, గురులింగ, చరలింగపూజ.


44-172.

మమమాతా వంధ్యా = నాతల్లి గొడ్రాలు (అసంభవమనుట. ఆమె యట్టిదయినచోఁ దా నెట్లు పుట్టెను.)


174.

గ్రామోనాస్తి కుతస్సీమా = ఊరే లేనప్పుడు పొలిమేర యెక్కడిది? అస్తవ్యస్తులు = సరియగుదారిని జరింపనివారు.


43-177.

అపునర్భవ సుఖరాశి = (చావుపుట్టుకలు లేని) మోక్షసుఖాతిశయము.


45-181.

ఉమామాతా.... = పార్వతి తల్లి, రుద్రుఁడు తండ్రి, ఈశ్వరుఁడు కులకర్త.


47-184. మద్భక్తావిగతకల్మషా = నాభక్తులు పాపరహితులు.


48-191.

ముప్పదియాఱు = షట్త్రింశత్తత్త్వములు.


194.

 పరసమయప్రవిఫాలురు = పరమతీయుల సిద్ధాంతములను ఛేదించువారు.


50-209.

సుంకరిమాటలు = వ్యతిరేకపుఁ బల్కులు.


54-210.

ఇబ్బడి = రెండవ.


55-215.

గెలుపిచ్చి కీడు వడుట = ఎదుటిభక్తునకు గెలుపొసంగి తా నోటువడుట.


59-228.

ఎడకాఁడు = దూత.


60-232.

సంబవులు = పాదరక్షలు.


61-233.

నెళవు = మర్మము.


234.

భవభయాదులఁ దెలియున్ = భవభయములనుండి విముక్తుఁ డయి నిర్మలుఁడు (ప్రసన్నుఁడు) అగును.

————