అడిదము సూరకవి/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి


ఏడవ ప్రకరణము -

కవి కాశ్రయుఁడైన పొణ్గుపాటి వేంకటమంత్రి .

18 వ శతాబ్దమధ్యమున శృంగవరపుకోట జమీని బరి పాలించు చుండిన శ్రీముఖీ కాశీపతి రాజుగారికి నీపొల్గుపాటి వేం కటమంత్రి మంత్రిగానుండెను. ఇతఁడు గోలుకొండ వ్యాపారి శాఖలోఁ జేరిన బాహ్మణుఁడు. శ్రీవత్సగోత్రుడు. నీరరాజు మాత్యపుత్రుడు. ఈ మహనీయుని వితరణాది గుణము 'లెంత యుత్కృష్టములో కాని, యతనిని నుతించినట్లు తనయేలికలగు విజయనగర పురాధీశులనుగాని మఱి యితర రాజులను గాని సూరకవి పొగడియుండ లేదు. ఇతని పై సూరకవి చెప్పిన వద్య ములు 'పెక్కులుగలవు. వానిలోఁ గొన్నిటినిమాత్ర మే యిచట వాయు చున్నాఁడను.

 క. వర దానాచారంబుల
గరిమగనివనీ వకులును గర్మరులును భూ .
సురమణి' యని నిన్నందురు
విరచితవృష ! పొణ్గుపాటి • వేంకటమంత్రీ.

క. లేడు భువివానం దడయని
వాడున్నీ యింట భుక్తి • వడయనిద్విజుడు

బోడిమి మిజు గనిన్నున్
వేఁడనికవి పొణ్గుపోటి • వేంకటమంత్రీ.

క. చుక్కలవ లెఁ గర్పూరపు
ముక్క వలె నీదుకీర్తిన్ ముల్లోకములన్
గ్రిక్కిరిసి పిక్కటిల్లెను
వెక్క సముగఁ బొణ్గు పొటీ వేంకటమంత్రీ.

క. సగిదత్తురె గుణసంపద
వెఱంక మా పొణ్గుపాటి , వేంకటపతికా
గురుచక్రవర్తులు బదా
ర్గురు రాజులు ముప్పదిద్ధ • రునియోగివరుల్.

మీఁది పద్యములయందుఁ గల వర్ణనమతిశయోక్త్య లంకార భూయిష్టమైనట్లుగఁ గానఁ బడుచున్నను నీమంత్రి పుంగవున కీప్రాంతమునఁగల కీర్తి మాత్ర మద్దానిని స్వభావోక్తి యని యే చాటుచున్నది.


తనకు సూరకవి యాశ్రితుఁడై నను వేంకట మంత్రి మాత్రమాతని యెడలఁ బోష్యపోషక భావముచూపక యతనిఁదన నెచ్చెలిగ యోజించి తన బంధువుల కంటె నెక్కుడుగ గౌరవిం చుచువచ్చెను. సంవత్సరమునకు మూఁడు నాలుగుమాసములు శృంగవరపుకోటలో మంత్రిగారి యింటనే 'యుండు చుండెడి వాడు. ఆయాసమయముల యందు వేంకటమంత్రి గారి సన్నిధిని నిష్టగోష్ఠిగను లోకాభిరామముగను జరుగు ప్రసంగముల సందర్భముననే సూరకవి . పొణుపాటి 'వేంకటమంతి) " అను మకుటముతో - నే పద్య ములను జెప్పియున్నాడు. ఈ పద్యములనే యిటీవల వారెవరో 'యేర్చికూర్చి వానికి - వేంకటమంత్రి శతక మని పేరెడిగాని వాస్తవముగ నయ్యవి కవిచేఁ బ్రస్తావన గఁ జెప్పఁబడిన వేగాని శతకరూపముస రచింపఁబడినవి కావు. ఇందులకుఁ దార్కాణముగఁ గొన్ని పద్యములతో సంబంధించియున్న వింతకథలను నిచట వ్రాయు చున్నాఁడను.


1 ఒక సమయము శృంగవరపుకోట జమీదారులగు శ్రీముఖి కాశీపతిరావు గారి గృహామున నేదియో యొక శుభ కార్యము వైభవముతో జరుగుచుండ సమీపగ్రామములలో నున్న బాహ్మణులు సంభావసలఁ గైకొనుటకు-- శృంగవరపుకోటవచ్చి యుండిరి. సంభోసనలిచ్చుటకుఁ బూర్వము బాహ్మణులందరు దొడ్డిపెట్టిరి. ప్రమాదవశమున సూరకవి కూడ దొడ్డి పెటఁబడి రెండు యామములు మించు వఱకచ్చటనే యుం డవలసి వచ్చెరు. తాను సూరకవి యని పలుమాఱు బంట్రౌతులకు జెప్పి విడు పడన్నను వారితనిని విడువరయిరి. సంభావనల నందుకొను బ్రాహ్మణులతోఁ బాటు. కొంత సేపునకును సూరకవి సంభావన లిచ్చుచున్న వేంకటమంత్రి గారి యెదుటబడ నతఁడు భావగారూ! మీ రేల దొడ్డి పెటఁబడిరి? ఇంతవజుకును భోజనములేక యుంటిరా ? అపరాధము క్షమింపుడుడు. ఆచటనున్న


బంట్రౌతులకుఁ దెలిసినది కాదు” అని జరిగినదానికి వగచు చుండ సూరకవి.

1. క. బలవంతుఁడు బలహీనుఁడు
పొలతురు విధితప్ప, నల్ల • పూసలుముత్యాల్
తొలఁగుఁగద మగఁడుపోయిన
వెలదుకకున్ బొణ్గుపాటి శ్రీ వేంకటమంతీ.

అనియొక పద్యమును జె ప్పెను.

2. మఱియొకప్పుడు వేంకట మంత్రిగారి యింట జరిగిన యొక బ్రాహ్మణ సమారాధన కొఱకు సమకూర్పఁబడిన వస్తుసం మృద్దిని వర్ణించుచు సూరకవి యొక పద్యమును జెప్పియ న్నాఁడు.

క. ఒక్క సముద్రము దక్కఁగఁ
దక్కినసంద్రములువీయు , దారమహిమచేఁ
జిక్కిఁగద ! విప్రభుక్తికి
వెక్కసముగఁ బొణ్గుపాటి , వేంకటమంత్రీ.

వడ్డనచేయు చున్న వేంకటమంత్రిగారి సోదరి యీ పద్యమును విని నూరకవితో ' భావగారూ ! (వెంకటమంత్రియు సూరకవియు నొకరి నొకరు (భావగారు' అని పిలుచుకొనుచుం డెడి వారఁట.) మీబోటి స్వయంపాక నియమముగల వారలకు, దక్కటి సముద్రము విడిచినారము ”అని చెప్ప సూరకవి యేని

యుఁబ్రత్యుత్తరముగఁ జెప్ప లేకపోయెను. అంతనచ్చట భోజనమును జేయు చున్న వారంద ఱామె సమయస్ఫూర్తిగఁ జేసిన పరియాచకమున కెంతయు సంతసించిరి.


ఇటులనే యీపద్యములలోఁ గొన్నిటికి "గాధలుకలవు. ఆ కారణముచేత నీ పద్యములు ప్రస్తావవశముగఁ జెప్పబడిన వని యూహించుట యుక్తమని నాకుఁదోఁచెడిని.

ఆఱవప్రకరణమునం దుదహరింపఁ బడిన

మ. కరుణాసాగర ! పొణ్గుపాటికుల వేం • కట్రామదాను న్వమం
ధరయందుంచక స్వర్గలోకమునకున్ దర్లించినావేమి ? త
త్పురిఁగల్పాదులు లేవె యాచకులకున్ • భూయాచక శ్రేణి కె.
వ్వరు(ది క్కేమిది) ? మొండి జగ్గఁడవుఁగా • వా ? నెట్టి నై పల్కితిన్ "

అను నీపద్యము వేంకటమంతి స్వర్గస్థుఁడై న పిదపఁగవి చేఁ జెప్పఁబడినది. ఇయ్యది యామంత్రివరుని యెడలఁ గవికిఁగల గౌరవాతిశయమును దేటపటచుటయే గాక యాతని వితరణాది సుగుణసంపదనుగూడ విశదపజచు చున్నది. కారణజన్ముఁడని చెప్పఁదగిన యీమంత్రి శిఖామణి క్రీ!! వె|| 1780 సంవత్సర ప్రాం తమునఁ గీర్తి శేషుఁడై యుండవచ్చును.