అడిదము సూరకవి/ఆఱవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఆఱవ ప్రకరణము

దేశాటనము


సూరకవి సంవత్సరమునకు రమారమి "యైదాఱుమాసములు దేశాటనము చేయుచుండెడివాఁడు. ఇతఁడు ప్రతి సంవత్సరము వర్షాశనమునకై - పర్లాకిమిడి, పాలకొండ, బొబ్బిలి, చెముడు, శృంగవరపుకోట మొదలగు స్థలములకుఁ బోవు చుండెను. ఒక సమయమున నతఁడు పర్లాకిమిడికిఁబోయి యాసంస్థానము నఁగల రాజకీయోద్యోగుల సాహాయ్యమున రాజును దర్శింపఁ గోరఁ బండి తాదరము లేనియొక - ముఖ్యోద్యోగస్థుఁడు ' రాజు గారిని దన్నెంపన ఏసమయముకాదని సాకులు సెప్పి కవికినాశా భంగము కలుగఁ జేసెను. తనకుఁగలిగిన యనాదరణము కారణమున నాపట్టణమున నుంచుటకిష్టము లేని వాఁడై సూరకవి సమీప గామమునకు నడవిమార్గమునఁ బోవుచుండెను. ఆకాలమున నక్కడి యడవులలోని తోవలకు « జంతు ”లని పేరు. ఆ 'జంతు'లలో నొకటి యగు " రామజంతి'ని గవియిట్లు వర్ణించి యున్నాడు.

గీ. తరుశిఖర చుం బితామృతాం • ఢస్రవంతి
దళితనక్షత్ర పరి (వృఢ) • తపన కాంత
సమదవేష్టిత సకలభూ • (జానీ తాంతి)
ప్రకట మీంకృతవనదంతి. . "రామజంతి ”.


ఇది యిట్లుండ సూరకవిరాక రాజున కెట్లో తెలిసెను. అంత నాతఁడు జరిగినదాని కెంతయు వగచి సూరకవిని మరలఁ దస పట్టణమునకు రప్పింపనెంచి సవారీతోఁ దనమంత్రిని రామజంతి మార్గమున నంపెను. మంత్రి నిర్భంధము ను దాఁటఁజాలక సూరకవి పర్లాకిమిడికిఁ దిరుగ వచ్చి మహారాజుచే నుచిత రీతిని గౌరవింపఁబడి తగిన బహుమానమునందెను. ఆసమయమున గవి యామహారాజుగారి పై జెప్పిన పద్యములలో లభ్యమైన వానిని నిందుఁబొందు పఱచితిని.

<క. గోవింద ద్వాదశివలె .
వేవచ్చితి రాక రాక • నీనగరికి నో
పొవనగుణ నారాయణ
దేవుమహారాజ ! సాహి • తీనవభోజ..

క. నీవిచ్చుభత్య ఖర్చొక
భూవల్లభుఁడిచ్చు త్యాగ • మున కెనవచ్చుస్
బావనగుణ నారాయణ
దేవుమహారాజ ! సాహి • తీనవభోజూ.

క. వారిధికిని వారిధియే
మేరునగంబునకు సాటి ఆ మేరువగంబే
నారాయణ దేవుకు సరి
నారాయణ దేవు గాక • నరపతు లేదురా!

ఆకాలమున, పర్లాకిమిడి వారికిని విజయనగరము వారికిని బరస్పర వైరము కలిగియుండెడిది. అయినను విజయనగరాస్థాన కవీశ్వరుఁడగు సూరకవి తమపురమునకు వచ్చిన ఫుడెల్లను, పర్లాకిమిడి ప్రభువులగు నారాయణ దేవుగారు వాని నుచిత రీతిని గౌరవించి దవ్యరూపమగు బహుమాన మొసంగుచు వారి యాదార్యమును వెల్లడించుచుండిరి. మీఁది పద్యములానారాయణ దేవుమహారాజు సరసుఁడఁనియుఁబండి తావలంబకుఁడనియు బానశీలుఁడనియుఁ జాటుచున్నవి.

సూరకవిని నరాశన మొసంగి గౌరవించు మన్యపుసంస్థానములలోఁ బర్లాకిమిడి యొకటిగా నుండెను. "


ఒకానొకప్పుడు సూరకవి పాలకొండకుఁ బోయియుండెను. ఆకాలమున రామభద్ర రాజను పేరుగల యాతఁడువానిని బాలించ చుండెను. రాజు గారి దర్శనము చేయింపుఁడని మంత్రి లోనగు వారి, జాలదినము సూరకవి యాశ్రయించెను. ఏకాగణముననో సంస్థానముపందలి యున్నతోద్యోగస్థు లీతని విన్నపమును మన్నింపక , వీనియెడల సనాదరణఁజూపిరఁట. అంతసూరకవి మిగుల ఖిన్నుఁడును గుపితుఁడునునై యీక్రిందిప ద్యములను జెప్పెనని వాడుక.

శా. రాజు జారుఁడు మంత్రినియుఁడు నీరాష్ట్రంబులో పెద్దగా,
రోజుల్ కొండలు జీవహింసలను సం • కోచింప రెవ్వారికిన్
దాజీ మీయరు  ; పాలకొండపురిలో దాక్షిణ్యశూన్యత్వమీ
ఖాజీ పట్టణ మేల వచ్చితిని నా • పాపంబు సర్వేశ్వరా.


మ. నరసింగుండును వెంక పొతుడుసుగృ •ష్ణాపాత్రుడున్ నాయుఁడున్
శరభాపాత్రుడు పాలకొండధరణీ • సామాజ్యధారేయులై
ధరవర్థిల్లెడు రామభధ్రసృపునా • స్థానంబునన్ బంచముల్
చిరకాలంబుగ వీరివెంటఁదిరుగన్ • చీ ! ఛీ! మనం బొప్పునే.

ఇట్లాగ్రామ మందు రవంతయును సమ్మానంబుఁ గానకి వేఱొక గ్రామంబునకు 'బోవనుద్యుకుఁడై పండి తావలంబ కుఁడని ప్రసిద్ధిగన్న యాగ్రామవాసుని దేవాంగుని బత్తుల అయ్యన్నను జూడఁగోరి దగ్గఱ సాగుచుండుసంతకు బట్టలమ్ముకొనుటకై వెళ్లుచుండిన అయ్యన్న నే "అయ్యన్న గ్రామమున నున్నాఁడా ? లేక సంతకు వెళ్ళినాఁడా? నేనిప్పుడతని యింటికి వెళ్ళినచో నతనిఁజూడఁగలనా? ” అని ప్రశ్నించెను. పండిత పక్షపాతియు నుదారశీలుఁడును నగు, అయ్యన్నతన్నుఁ బశ్నిం చిన యతఁడు సూరకవియని తెలిసికొనిన వెంటనే సంతకుఁబోవుటమాని వేఱక త్రోవను దనయింటి కేఁగి సూరకవిరాకకు నిరీక్షించుచుండెను. సూరకవియు, అయ్యన్న యింటి కేఁగియతనివలన మంచి సమ్మానమును (అయ్యన్న తాను స్వయముగ నేసినట్టి విలువగల యొక పంచలచాపును దాని పొరలయందు పదునారు రూపాయలను నుంచి కవికీ బహుమానముగ నొసఁ గెను.) బొంది యానందించిన వాఁడై యాతని పై నీక్రిందిపద్య ములను 'జెప్పెను.

క, మూ డేబదు లెవరుండరు
మూఢులునది గాన లేరు - ముల్లోకములన్

కం

  వాడుక పడవలె మనుజుఁడు
వేడుకతో పొత్తులయ్య • వినఁగదవయ్య.

క. ఇచ్చెడివానికి రణమునఁ .
జొచ్చెడివానికిని గాని ఆ నురుచిర కీర్తుల్
వచ్చునె ? పందకి లోభికిఁ ..
బచ్చని విల్కానివయ్య , బత్తుల" అయ్యా.

గీ. చేరుఁబట్టు వేళ • జెలఁగి యేడ్చును బిడ్డ
యంతకంతనుఖము • నదియెయిచ్చు
నర్ధయడుగు వేళ • నదికష్టమనిపించు
ననఘచరిత ,బత్తు • లయ్యనార్య.

క. ఎత్తెఱుఁగ డూళ్లకంబఁడు -
సొత్తెడు దుప్పాడజగ్గు • శునకపుదాతల్
ఉత్తమకవుల నెఱింగిన
బత్తుల యయ్యన్న యీగి • పొటిని జేయర్ .

పాలకొండ "తాలూకా మిగుల ఫలవంతమైనది. తృణ కాష్టజల సమృద్ధిగలిగి సస్యపూరకములగు కేదారములచే నొప్పియుస్న యానాఁటిపాలకొండ జమీని గవి యిట్లు వర్ణించి యున్నాడు.

శా.క్షేమాకీర్ణ కీర్ణధామములున క్షీనేక్షు రంభాటవీ
స్తోమంబుల్ బహుళాలిధాన్య తతు లె • చ్చోటన్ నదీమాతృక
గ్రామం బుల్ బహుళాగ్రహరముల నే కంబుల్ ధరన్ జూడఁగా
క్షామం బన్నది లేదు శ్రీ రగిరిదే • శంబంధు నేందేనియున్


పాలకొండకు సమీపమున నున్న వీరఘట్టములోఁ బర్వ వీరఘట్టమునకుఁ తాలు, అను పేరుగలపండితమన్యుఁడగు నొబోవుట. క కోమటికవీశ్వరుఁడుండెడివాడు. అల్ప విద్యగలవాని కహంభావము మెండను లోకోక్తిసాకమగు నట్లుగ నీకోమటి కవి తన కాలములోనున్న కవీశ్వరుల నందఱను హేళనచేయుచు నవమానించు చుండెడివాఁడు. రాజాముకుదగ్గ జగనున్న యిల్లం నాయుడువలస కాపురస్థుఁడగు కొట బాలకవి యను నొక యుత్తమ కవీశ్వరు నీపర్వతాలు, అవమానముచేయ దానికా బాలకవియు నతని పక్షమువారగు వీరఘట్టాము కాపురస్థులు కొందఱు బ్రాహ్మణులును గలసి యెటులనై న నీవైశ్య కవీశ్వరునకు శృంగభంగము గావింప సెంచి నాడు పాల కొండవచ్చి యున్న సూరకవిని దమ గ్రామమునకు రప్పించి. తనశక్తియు నెదిరిశక్తి - గుర్తెఱుగని బర్వతాలు సూరకవి బాలకవిగార్లతోఁ బోటీకి నాశుకవిత్వ ప్రదర్శనము చేయ నొడంబడెను. గ్రామములోని పెద్దలు తగవరులుగాఁ గూర్చుం డిరి. నిర్ణీత కాలమగు మొకజాములో బాలకవి సూరకవిగార్ల తో సమముగఁబద్యములు చెప్పలేక పర్వతాలు తనయసమ్మతను నొప్పుకొని క్షమింపుఁడని సూరకవికిఁ బాదాక్రాతుఁడయ్యెను. ఆ సందర్భమున సూరకవి చెప్పిన పద్య మిట్లున్నది.

<poem>గీ. నరుని నొగల మీద • హరియున్న చందాన సూరకవివరేణ్యు • జోగగూడు

బాలకవియు • కుంఠవాగ్దాటికిఁ

ఓర్వతాలుగాఁడు • పారిపోయె.</poem>

తన్న వమాన పఱచిన కోమటికవికిఁ దగినట్టుగ గర్వపరి హారమైనఁదున కెంతయు సంతసించి యాకార్యమునందుఁ దనకు సాహాయ్యపడిన సూరకవిని శ్లాఘించుచు బాలకవి యీ కిందిపద్యమునుఁ జెప్పియున్నాడు.

<క. అంతాకవులము గామా
అంతింతో పదైమైన • నల్లగ లేమా
ధంతివి నీతో సమమా
కాంతా సుమబాణ! సూర • కవి నెరజాణా.

వీరఘట్టముకు దగ్గఱగనున్న 'వట్టిగెడ్డ ' పయి నేలకోసూర కవి యొక పద్యమును జెప్పియున్నాడు. ఆపద్యమునందలి యొక పాదము మాత్రము మనకు లభించినది.

"వట్టి గెడ్డకు పదివేల వందనములు”

ఒకప్పుడు సూరకవి బొబ్బిలివెళ్లి యుండెను. ఆ కాలమున బొబ్బిలికి విజయనగరము వారికిని బొబ్బిలివారికిని బద్దద్వేషముగా నుండినను సూరకవి తమపట్టణమునకు వచ్చినాఁడని వినినతోడనే. బొబ్బిలి రాజుగా రతనికిఁ దగిన సదు పాయములనెల్ల జరుపవలయునని. తన యుద్యోగస్థులలో నొకరిని నియమించిరి. సూరకవి యిట్లు గౌరవింపఁబడి మరుచటి దినము రాజును దర్శిప నాస్థానమునకుం బోయెను, కొండొక సేపు..


రాజు గారు కవితో లోకాభిరామముగ సంభాషించి ప్రసంగంశమున విజయనగర ప్రభువులను గూర్చి మిక్కిలి లాఘవముగ మాటలాడ సూరకవి యట్టి దానికిఁ గొంచెమైనను సహింపకరా 'జుగారికి విరసముగఁ బత్యు త్తరమిచ్చి తనప్రభువుల యెడలఁదన గలవిశ్వాసమును వెల్లడించెను. అంతరాజు గారికి మిగులఁగోపము రాఁగ సూరకవి సభయందు నిష్టము లేని వాఁడై వెడలి పోయెనను నీ మొదలగు వింతలు జరిగినట్టుగ నొకవాడుక కలదు. దీని యదార్థమును స్థిరపఱుప గవికృతములగు చాటుపద్యము లేవియుఁగానరావు. కాని యొక విషయము మాత్రము మిక్కిలిగ వ్యాపించి యున్నది. ఆనాఁడు సూరకవి సభవిడిచి బసకువచ్చి భోజనాది కృత్యములు నిర్వర్తించుకొని రాత్రి రెండు యామముల కాలము నిద్రించి వేకువజామున బయలు దేఱి షీకారుగంజి అడవిగుండా స్వస్థలమునకు బోవుచుండెను. "అప్పుడచ్చట సాయుధపాణులగు కొందఱు బోయవారును కవిని జంపుటకు సంసిద్దులుకాగా వారికి భయోత్పాతమగు నట్లు సూరకవి కిరుపక్కల. ధనుష్పాణులగు రామలక్ష్మణులును వారి చెంగట సుగ్రీవాంజనేయులును నిలిచినట్టుగ వారికిఁ గన్పట్టవారందఱు స్మృతిదోలంగిన వారై కొంత తడవూఱకుండి ' తెలివివచ్చిన పిదపఁబట్టణ మునకుఁ బోయి యావార్త పురజనులకు నెఱిఁగింప వారెల్లరాశ్చర్యమగ్ను లయిరఁట ! ఈవిషయమును స్థిరపఱుప సూరకవికృత' మని వాడుకలోనున్న పద్యమిట్లున్నది."

<మ. హనుమంతుం డెచటన్ దివాకరసుతుం *(డాచెంత) సౌమిత్రియున
(దను సేవింపఁగ) జానకీ విభుఁడు (వా - త్సల్యంబుతో నిల్చి) యిం
(పున నన్నెప్పుడు) గాచుచుండగనునీ • బోయాధముల్ కిన్కచే
ననుఁజం వంగలవారే ? రావుకులజు • న్మా ! రంగరా (యోత్తమా.!)


ఇట్లు బోయల బారి నుండి తప్పించుకొని • మఱునాటికి జాముపొద్దు వేళకు మరడామునకు సమీపముననున్న యొకతోటలో బసచేసి వంట చేసికొని భోజనము చేయుటకు నొక యరటాకు నిమ్మని యచ్చటనున్న కూరాకుల మల్లిగాని నడుగవాఁ డాకు నీయక కవిని నిరాకరించెను. అంత సూరకవి కుపితుఁడై * కూరాకుల మల్లిగాడు కూలే నూతన్ " అని తిట్టెను. సూరకవితిట్టు కమసాలిసుత్తి పెట్టు”అను దానికి నిదర్శనముగ నేతము తోడుచున్న మల్లిగాఁడు నూతిలోఁ గూలెనఁట ! ఇది జరిగియి ప్పటికి రమారమి నూటయేఁబది సంవత్సరములైనను నిప్పటికిని మరడామునకు దగ్గఱనున్న యొక గచ్చునూతికి "సూరన్న గారి నుయ్యి ”అని యాప్రాంతమున వాడుక గలిగియున్నట్లు నామిత్రులలో నొకరగు శ్రీ బుద్దరాజు వేంకటపతి రాజు గారు చెప్పు


  • ఈసందర్భమున నే కవిగారు . ఆర్తిజనరక్షోంపాయ ఆంజనేయ" అను మగుటముతో నూరుపద్యములు చెప్పినట్టు పొడుకకలదు. వానిలో నేను బది పద్యములు గల యొక ప్రాచీన తాళ గ్రంథము తమయొద్ద నున్నదని నా మిత్రులలో నొకరగు మగ్గాల గున్నయ్యశాస్త్రీ, బి. ఎ. గారు చెప్పినారు. కారణాంతరములచే నయ్యది సమయమునకు వారు నాకుబంపఁ జాలి నారు కారు. అడిడమువారి చాటువులు' అను "పేరునేను ప్రచురింపబోవు పుస్తకమునందా పద్యములనుజేర్చగల వా

డను

చున్నారు. ఈనూతికి సమీపమున నే నాఁడు సూరకవి బసచేసి యుండెనని తోచెడిని. 'లేనిచో నీనూతికి " సూరన్న గారి నుయ్యి "అను వాడుక కలుగ నేరదు. ఆ వైపునున్న పాచి పెంట, చెముడు, శంబరపురము మొదలగు మన్యవు జమీలకు వెళ్ళినప్పుడు చెప్పిన పద్యములుగా ? గన్పడు వానిలోఁ గొన్నిటిని మాత్రమిందుఁ బొందుపఱచు చున్నాను.

  • క. ఆర్బుదములు నిర్బుదములు

బర్బర దేశాధిపతులు + పడిగాపులు నీ
దర్బారునఁ బడియుందురు
దోర్బల సంపన్న ! మన్నె • దొరయెరకన్నా.

  • ఈ పద్యమును ఆంధ్రమున్నె దొరల పై జెప్పినట్టుగ గనఁబడు చున్నది ఔచిత్యమును బాటింపమికి దీనిని దార్కాణముగ నీయవచ్చును. ఇందు! జెప్పఁబడిన యెరకన్న శ్రీమంతుఁడును గృషీవలుఁడునునగు నొక మన్నె దొర గాని కవిగారు వర్ణించినట్టుగ బ్రహ్మాండ నాయకుఁడు, మాత్రము గాఁడు.


మ్యానాధిక్యములను బాటింపమికి నింకొక తార్కాణమును జూపు చున్నాను. తనకు మంచిగంటమును జేసియిచ్చిన యొక కమసాలిని నూరకవి గారిట్లు "వర్ణిం చియున్నారు..

క. ముల్లోకంబుల నాలుగ
వల్లెపరశురాము కీర్తి • ప్రబలివెలుగున్ -
మల్లిన్ సుమవల్లిన్
జాబిల్లిన్ , అలపాలవెల్లి • భీష్మునితల్లిన్

క ధీరాగణిశివరాము .
క్ష్మారమణుండేలు చెముడు • శంబర పురమా
పోరామారొంపల్లా -
పొరాద్రా మంగరాజు • పాలెముపట్టా.

సీ. చుట్టాలసునుగూడు • పెట్టని పెనులోభి
బొజ్జతా బెంచిన • పుణ్యమేమీ
కార్యమించుక సేయఁ - గా లేని నీచుండు -
రాజసన్నిధినున్న " లాభ మేమి
పదిమంది మెచ్చని ఆ పాపకర్మునకు సం
పదవి వీగిన ఆ భాగ్యమేమి
ఆశ్రితుఁబోవని , యధముండు పల్లకీ
కుక్కెక్కి తిరిగిన ఆ గొప్పయేమి

మాటచెల్లినయెడల సమస్తబందు
భూను గాశ్రితజనములఁ బ్రోవవ లేని
హని జన్మం బుకాల్పనా , వసుధలోన
టెంకిలి పురీనివాస ర , విప్రకాశ
శ్రీమదాకాళ కేశ యు , మామ హేళ.

సమస్యాపూణము.

ఉ. సారతరప్రబంధముల • సంఖ్యముగా నొనరించునట్టి
యీ "సూరకవీంద్రు నింజునిగి • చూతమటంచును. మాటిమాటికిన్ఈ
రసమెత్తి దుషకృ తుల • నిచ్చిన వారలనోరు మొత్తు డీ
మీరును బారుమీరు మఱి • మీరును మీరును మీరలందఱున్

.

(ఈపద్యమును బొబ్బిలిలోఁ జెప్పినట్టు వాడుక కలదు.) సూరకవి తఱుచు తన బంధువులను జూడఁబో పుచుండెడి నాఁడు. ఒకప్పుడితఁడు చీపురుపల్లి నుండి బయలు దేఱి తన బంధువులు బుఱఱా వారింట జరుగు నొకశుభకార్యమును జూడ, అదపాకకుఁబోవు చుండెను. (ఈగ్రామము చీపురుపల్లెకు నేడెనిమిది. మైళ్ళదూరమున నున్నది.) ఆనాఁడే సూరకవిగారింటికి సమీపమున నివసించు పాపయను పేరుగలయొక సాలిది కూడ నదపాక పోవుచుండెను. దారిలో నది సూరకవిని గలియ నతఁడు “ పాపా ! యెటు వెళ్లెదవే ? ”అని యడిగెను. “బాబూ! 'అత్త వారింటికి నదపొక "ఏళ్లుచున్నాను. ” అని పాప ప్రత్యుత్తరమిచ్చెను. సర్వకాల సర్వావస్థల యందును బద్యములల్లుటయే వేళ్ంబముగాఁగల మన కవిగారు పాప చెప్పిన మాటలనే యొక కందపద్య పాదములో ( అదపాకా అత్తవారు ? ఔనే పాపా ! యని తిరుగఁ జెప్పిరి. అంత పాప సూరన్న బాబూ! నీకుదండము. నామీఁద నొకపద్యమును గూర్పుము.' అని గోరెను. సూరకవి యాసొలిదాని కోరికను జెల్లింప నెంచి,

<* క. అదపాక మామిడాకులు -
పొదుపుగ దొరవి స్తరంటఁ - బొడిచినవాడే
మద మొప్ప విక్రమార్కుఁడు;
అదపాకా అత్తవారు! • ఔనేపాపా.

  • అమాయకురాలగు సాలిదాని గోర్కె చెల్లించఁ జెప్పిన పద్యమనివాడుకకుఁ దగినట్టుగ నే యున్నది. అదపాక మామిడాకులు విస్తరికుట్టుటకుఁదగిన వెడల్పు లేనివి. కవి గారియనుభవము. నిచట వెల్లడించియున్నారని చెప్పనగును.

అని పద్యమును బూర్తిచేసి యాపాపను సంతోష పెట్టి నట్లు వాడుక..

చీపురుపల్లెనుండి స్వగ్రామమగు భూపాలరాజురేగ నెళ్లినపుడెల్ల సూరకవి తన బంధువులగు రెల్లివలస పొణంగిపల్లి వారిని, భోగాపురము దేవగుప్తాపువారిని జూడఁబోయెడివాడు. , ఆకాలమున దేవగుప్తాపు రామయ్య గారు భోగావు మునఁ గణికము చేయుచు వ్యవసాయమువలనఁ దనకుఁ గావలసిన వానిని బండించుకొని హాయిగఁ గాలక్షేపము చేయుచుండెడి వాడు.. అతఁడు బాంధవ్యమున మనకవిగారికీమఱదియైన కారణమునఁ బరియాచకముగ నారామయమంత్రి నిట్లునణిర్ణించి యొక పద్య మునుజెప్పెను.

రెయిలు సదుపాయము లేని యాదినములలో సూరకవి వ్యయశ్రయాసములకు వెనుదీయక కాశీయాత్రకుఁ బోయెను, దివ్య క్షేత్రమగు వారాణసీపురమును బవిత్రమగుగంగా స్రవం తినిదర్శించి తనజన్మము సార్థకమైన దానిని గాఁ జేసికొను నాసక్తి యటుండ, సంస్కృత విద్యా ప్రచారమునకు నిలయమై ప్రసిద్ధి గాంచిన కాశీపురమును నవ ద్వీపమును జూచి యాయాస్థలముల యందున్న 'పండితో త్తములను దర్శింప వలయున నెడి యుత్సా హము తన్నుఁ బురిగోల్ప నితఁడు త్తర - దేశయాత గావించెను. కాశీ నుండి స్వదేశమునకుఁ దిరుగవచ్చుచు మార్గములో నున్న దివ్య క్షేత్రమగు శ్రీజగన్నాధమునకు వచ్చియున్నప్పుడే తనకుఁ బరమ మిత్రుడును బోషకుఁడును నగు పొణుపాటి వేంకటమం త్రి స్వర్గస్థుఁ డయ్యెనని విని మిగుల ఖిన్నఁడై యిట్లోక పద్యమును జెప్పి యున్నాడు.

మ. కరుణాసాగర ! పొగ్గా పొటికుల వేం • కటామదాసుస్ వసుం .
ధరయందుంచక' స్వర్గలోకమునకున్ • దగ్గించినావేమి ? త .
తురిఁ గల్పాదులు లేవే యాచనలకున్ ? • భూయాచక శ్రేణి కె .
వ్వరు (దిక్కేమిది) మొండిజగ్గడవు (కా వా వెఱిపల్కితిన్.)

..

ఈ తీరున సంవత్సరమున కై దాఱుమాసములగ ఁ బైగ సూరకవి దేశాటనముచేయుచుఁ గొదువదినము లుచీపురు పల్లెలో నుండుచు, దేశాటనమువలన సంపాదించిన ధనముచే జీవయాత్రగడ పుచు శ్రీరామలింగేశ్వరుని సన్నిధానమున గంథ రచనచేయుచు నుండెడి వాఁడు.