అంటువ్యాధులు/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

25

మూడవ ప్రకరణము

సూక్ష్మజీవుల జాతి భేదములు

పైని చెప్పినట్లెక్కడ శోధించినను కనబడు అపరిశుద్ధ ప్రదేశములలో నివసించు సూక్ష్మ జీవులెట్టి యాకారము గలవి? వాని యందలి భేదము లేవి? అవి యేమి తిని బ్రతుకును? ఈ విషయమును సంక్షేపముగా నాలోచింతము.

1. కొన్ని జాతుల సూక్ష్మజీవులు మన వలెనే ప్రాణ వాయువుండు చోట్లగానీ జీవింపనేరవు. ఇందు కొన్ని పులులు, సింహములవలె ప్రాణముండు భాగములను మాత్రము తిని బ్రతుకును. మఱి కొన్ని కాకులు కోళ్ళవలే ప్రాణము లేక క్రుళ్లిపోవు భాగములను కూడ తినును. తమ నడవడికలలో సామాన్యముగా నీపై రెండు జాతులును జంతువులను బోలి యుండుట చేత వీనికి సూక్ష్మ జంతువులు (ప్రొటోజావ్) అని పేరు. వీని యాహారము కేవల జంత్వాహారము (హోలొజొనిక్ నూట్రిషన్)

2. మఱికొన్ని జాతుల సూక్ష్మ జీవులు కుక్క గొడుగుల వంటివి. ఇవి క్రుళ్లుచుండు పదార్థములలో మాత్రంమే పెరుగును. సజీవములగు జంతువులను గాని వృక్షములను గాని యివి తిన జాలవు. వీని యాహారము పూతికాహారము (Sapro26

Phytic Nutrition) అనగా మురికి వీని తిండి. వీనికి శిలీంద్రములు (పంగి ) అని పేరు. శిలీంద్రమనగా కుక్కగొడు.

3. మఱికొన్ని జాతుల సూక్ష్మ జీవులు వృక్షముల వంటివి. ఇవి మన కంటి కగపడక పోయినను, ఆకు పచ్చ నుండక పోయినను, చెట్లవలె బొగ్గు పులుసు గాలిని బొగ్గు క్రిందను, ప్రాణ వాయువు క్రిందను విడదీసి, బొగ్గును తమ శరీర పుష్టి కొరకు పయోగించు కొని ప్రాణ వాయువును విడచి వేయును. వీని యాహారము కేవలం వృక్షాహారము.

కాని కొన్ని సూక్ష్మ జీవులు కొంత యాహారమును జంతువుల వలెను, కొంత యాహారమును వృక్షముల వలెను, మరి కొంత యాహారమును కుక్క గొడుగుల వలెను కూడి తినును. ఇట్టి వాని యాహారము మిశ్రమాహారమని చెప్ప వచ్చును. ఇట్టి వానికి బాక్టీరియములు అని పేరు.

సూక్ష్మ జీవులలో 1. సూక్ష్మజంతువులు (Protozoa) 2.శిలీంద్రములు (Fungi) 3. బాక్టీరయములు (Bacteria) అను నీ మూడు ముఖ్య విభాగములను గూర్చి కొంత వరకు మనము తెలిసి కొనవలెను.

1. సూక్ష్మజంతువులు (Protozoa)

సూక్ష్మజంతువులగా మిక్కిలి క్రింది తరగతి జంతువులు. సాధారణముగ ఇవి ఏకకణ ప్రాణులు. అనగా వీని శరీర మంతయు ఒక్కటె కణముగా నుండును. ఇందు చుట్టు నుండు 27

భాగము స్వచ్ఛముగను నిర్మలముగ నుండి మిలమిల లాడుచుండును. దీనికి మూల పదార్థము (Protoplasm) అని పేరు. 7 వ పటము చూడుము. మధ్య నుండు భాగము కొంచెము దళముగ నుండి కొంచె మన్యచ్ఛముగ నుండును. దీనికి జీవ సూక్ష్మ జంతువులు (Protozoa) స్థానము (Nacleus) అని పేరు. ఒకానికప్పుడు ఏక కణ ప్రాణులు

7 వ పటము
అమీబా:


పా: = పాదము, జీ.= జీవ స్థానము. అ. ప.= ఆహార పదార్థము అనేకములు గుంపులు గుంపులుగా కూడి గుత్తుల వలె ఒక చోట నంటి యుండి అన్నియు జేరి ఒక ప్రాణివలె జీవించును. ఈ 28

సూక్ష్మ జంతువులలో కొన్ని తమ మూల పదార్థములో ఒక భాగమును పాదము (Psudopodium) గా సాచి దాని సహాయముతో ఆహారము నిమిడ్చు కొనును. ఇట్టి జంతువునకు (అమిబా... Amoeba) వికారిణి అనగా ఆకారము నిరంతరము మార్చు కొనునది అని పేరు. 7 వ పటములోనిది యాహారమును పట్టుకొను విధమును చూడనగును. చలిజ్వరము (Malaria) అను జ్వరమును (Ameoebic Dysentery) అను నొక తరహా జిగట విరేచనములను గలిగించు సూక్ష్మ జంతువులను ఈ జాతి లోనివియే. మరికొన్ని సూక్ష్మ జంతువులు తోకలు కలిగి వాని సహాయముచే ఈదుచు ఆహారమును తినుచు పరుగెత్తు చుండును. 8 వ పటము చూడుము:

8 వ పటము:

సూక్ష్మ జంతువులు తోకలతో ఈదుతున్నవి
మృ.రో. = మృధు రోమములను తోకలు గలిగి వాని సాయముచే చలింపగ సూక్ష్మ జంతువు.

మృ. = మృధు రోమములు.

జీ.= జీవ స్థానము. ఇందు అనేక జీవ స్థానములు గలువు. 29

సూక్ష్మ జంతువులలో ననేకములు ఒక్కొక్కటి రెండేసిగా చీలి, రెండు నాలుగు, నాలుగు ఎనిమిది, ఎనిమిది పదహారు, ఇట్లు ముక్కలు ముక్కలయి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క జంతువుగా పరిణమించును. 9 వ పటము చూడుము.

ఒక అమీబా రెండుగా అగుట
ఒక అమీబా రెండు అమీబాలుగా విభాగమగునపుడు గలుగు మార్పులు. ఒక అమీబాను అనేక ఖండములుగా సోకి నప్పుడు ఏఖండము లందు జీవ స్థానపు ముక్కలుండునో అవి బ్రతికి పెద్ద అమీబాలగును. జీవ స్థానపు ముక్క ఏమాత్రమును లేని ఖండములు చచ్చును.

మరికొన్ని సూక్ష్మ జంతువులలో ఆడది మొగది అను వివక్షత గలిగి ఒక దానితో నొకటి సంయోగము నొందుటచే సంతాన వృద్ధియగును. చలి జ్వరపు పురుగులలో నిట్లే మగవి యను ఆడవియును కూడి సంధానమును పొందును. 10 వ పటమును చూడుము. 30

10 వ పటము....... చలి జ్వరము.


చలిజ్వరము పురుగులు1.ఆడ పురుగు, మగ పురుగు అను భేదములేని చలి జ్వరపు పురుగు. 2, 3. మగ పురుగు యొక్క వివిధావస్థలు. 4, 5. ఆడ పురుగుల వివిధావస్థలు. 6. సంయోగము చెందిన తరువాత నేర్పడు రూపము. దాని గర్భము నిండ చలి జ్వరపు పురుగులుద్భవించు చున్నవి. 7. గర్భవతియగు తల్లి పురుగు కడుపు పగిలి దాని నుండి వేనవేలు పిల్ల పురుగులు బయలు పడు చున్నవి. 31.

2. శిలీంధ్రములు (Fungi)

శిలీంద్రమనగా కుక్కగొడుగు. 11. వ పటము చూడుము. ఈ జాతిలోని సూక్ష్మ జీవులు వర్ణ రహితమయిన కణములచే నేర్పడునవి. ఇవి చెట్ల జాతిలో గాని, జంతువుల జాతిలో గాని చేరక మధ్యమ స్థితిలో నుండునవి. ఒక కణము యొక్క కొస

11. వ పటము.

శిలీద్రములు అనగా బూజు జాతి సూక్ష్మవులు.

బూజుజాతి సూక్ష్మజీవులు

A.B. కుక్క అగొడుగులు. బూజు పోగులు త్రాళ్ళవలెను వలల వలెను అల్లుకొనుటచే కుక్క గొడుగు లేర్పడును. 32

పొడుగుగా దారపు పోగుల వలె పెరుగుచు అనేక పోగులు వలవలె గాని త్రాడువలె గాని అల్లు కొనుటచే ఈ ప్రాణుల ఆకారము వృద్ధి యగుచుండు. 11. వ పటములో ఏ. చూడుము. వీని పోగులు జీవము లేనట్టి గానీ జీవించి యున్నట్టి గాని జంతువుల యొక్కయు వృక్షముల యొక్కయు పై పొరల గుండ దొలుచుకొని పోగలవు. ఇవి సాధారణముగ కుళ్లుచుండు పదార్థముల నుండి తమ ఆహారమును తీసి కొనును. నిలవ యుంచిన కొబ్బరి పెచ్చుల మీదను, తడిసిన చెప్పుల జోళ్ళమీదను, ఊరగాయ కుండల లోను, పట్టు చుండు బూజు ఈ జాతి లోనిదే. మన చెవులలో గూడ నిట్టి బూజు పెరుగుట గలదు. ఆడువి మగవి అను విచక్షణ లేకుండ ఈ పోగుల కొన యందు ఒక భాగం తెగి పోయి అట్లు తెగిపోయిన ముక్కలు గ్రుడ్లుగా నేర్పడుటచే నివి సంతాన వృద్ధి చెందును. 12. వ పటము చూడుము. మఱి కొన్నిటియందేదో యొక భాగమున ఒక మొటిమ పుట్టి ఆ మొటిమ తెగిపోయి వేరొక జంతువగును. కొన్ని జాతుల యందు ఆడు పోగులు మగ పోగులు వివక్షముగా నేర్పడి వాని రెంటి యెక్క సంయోగముచే సంతాన వృద్ధి యగును. సాధారణముగ తామర శోభియను చెప్పబడు చిడుములు ఈ జాతి సూక్ష్మ జీవుల వల కలిగినవి. 13. వ పటము చూడుము. 33

శిలీంద్రములు
శిలీంద్రములు.
12.వ. పటము.

పచ్చళ్ళమీద బట్టు బూజును కొంచమెత్తుకొని అనేక రెట్లధికముగ జూప బడినది. ఇందలి తెల్లని చుక్కలు విత్తనపు గుత్తులు.

13.వ. పటము.
తామర విత్తనములు
1.2. తల వెండ్రుకల కుదుళ్ళ మీద తామర (Ringworm) విత్తనములు. 3. తామర తీగెల యల్లికలు. 4. శోభి: విత్తనపు గుత్తులను తీగెలును జూడనగును. 34

3. బాక్టీరియములు (Bacteria)

మనకు తెలిసిన సూక్ష్మ జీవులలో బాక్టీరియములు మిక్కిలి అధిక సంఖ్య గలవి. ఇందు అనేక జాతులును ఉప జాతులును కలవు. ఇవి సాధారణముగ వృక్ష జాతి లోనివి. ఇవియే మిక్కిలి సూక్ష్మమయినట్టి వృక్షములని చెప్పవచ్చును. వీనిని ఒక అంగుళము పొడుగునకు 8 వేలు మొదలు 75 వేల వరకు ఇమడ్చవచ్చును. ఇవి చుక్కల వలెను కణికల వలెను గుండ్రముగా గాని, మర మేకుల వలే మెలిదిరిగి గాని యుండవచ్చును. మూడవ పటములో కనబరిచిన జలదారి నీటి లోని 1,2,3,4 అంకెలు గల చోట్ల చూడుము. ఇవి యొకటొకటి కొంత వరకు పెరిగిన వెంటనే రెండు ముక్కలుగా విరిగి ప్రతి ముక్కయు తిరిగి తల్లి సూక్ష్మ జీవి యగుటచే సంతానవృద్ధి యగును. క్రింది పటము చూడుము. చీమును పుట్టించు సూక్ష్మ జీవులు చుక్క వలె నుండును. పచ్చ శగను పుట్టించు సూక్ష్మ జీవులు

14.వ. పటము.
AntuVyadhulu.djvu

జీడి గింజలవలె నుండి జంటలు జంటలుగా నుండును. 15. వ పటము చూడుము. క్షయను బుట్టించు సూక్ష్మ జీవులు కొంచెము వంగిన కణికలవలె నుండును. దొమ్మను పుట్టించు 35

సూక్ష్మజీవులు రూళ్ళ కర్ర ముక్కల వలె నుండును. కలరాను, కొఱుకు వ్యాధిని పుట్టించు సూక్ష్మ జీవులు మరమేకుల వలె మెలి దిరిగి యుండును. ఈ బాక్టీరియములలో అనేక జాతులను గూర్చియు ఇతర విషయములను గూర్చియు ఇచ్చట వివరింప నెడము చాలదు.

16.వ. పటము.
AntuVyadhulu.djvu

బాక్టీరియము లనేకములు తోకలు కలిగి చురుకుగ చలించు చుండును 16.వ పటము చూడుము. మరి కొన్ని తోకలు లేక యంతగా కదల లేక యుండును. ఈ కవచము యెక్క
సహాయము చే నెంత యండకును వేడికిని లెక్క చేయక చిరకాలము నిద్రావస్థలో నున్నట్టులుండి తరుణము వచ్చి నపుడు తమ కవచమును విడిచి చురుకుగల బాక్టీరియములగును. ధాన్యపు గింజలు అయిదారు నెలల వరకు కళ్ళములందలి నెర సందులలో పడి యుండి వర్ష కాలము రాగానే మొలచుటకు సిద్ధముగ నున్నట్లే ఇవియును వానికి తగిన స్థలమును ఆహారాదులను దొరకినప్పుడు తిరిగి మొలచును. ఇట్లే పశువుల దొమ్మ, కలరా మొదలగు సూక్ష్మ జీవుల గ్రుడ్లును తమ వృద్ధికి 36

తగు కాలము వచ్చు వరకు పడి యుండి వర్షాకాలము రాగా తగిన తరుణము దొరికినదని మొలకరించి అతి వేగముగ వృద్ధి జెందును. 17. వ పటము చూడుము.

దొమ్మ సూక్ష్మజీవుల గ్రుడ్లు మొలకరింపక పూర్వముండు రూపము.

క్రింది పటమునందు సూక్ష్మ జీవుల గ్రుడ్లెట్లు మొకలరించి వృద్ధి యగునో చూప బడి యున్నది.

18.వ. పటము
eggs of సూక్ష్మజీవులు
 • పగలు 11 గంటల కొక సూక్ష్మ జీవి గ్రుడ్డొక చుక్కవలె నున్నది.
 • 12 గంటలకీ గ్రుడ్డు కొంచెముబ్బి యున్నది.
 • 3.30 గంటలకు దీని ఉండి చిన్న మొటిమ యొకటి పుట్టి యున్నది.
 • 6.గంటల కీమొటిమ పెద్దదై ప్రత్యేక సూక్ష్మ జీవులుగా నేర్పడుటకు సిద్ధముగా నున్నది.
 • 8.30 గంటలకు దీనినుండి అయిదు సూక్ష్మ జీవుల యాకార మేర్పడి యున్నది.
 • రాత్రి 12 గంటలకు 17 సూక్ష్మ జీవులు పూర్ణముగ నేర్పడి యున్నవి. త్రవలో నియన్నియు విడిపోయి తిరిగి పిల్లలను పెట్టుటను ప్రారంభించును.

37

సూక్ష్మజీవులు చేయు ఉపకారము

అనేక సూక్ష్మ జీవులు కలిగించు హానిని గూర్చి ఇచ్చట వాని పేరులను బట్టియే మనము తెలిసికొను చున్నను అందు

AntuVyadhulu.djvu

జనుము చిక్కుడు మొదలగు చెట్ల వేరులలో యుండి భూమికి సారమిచ్చు సూక్ష్మజీవుల యిండ్లు ఉండలుగానున్నావి.

కొన్ని జాతులవి మనకు చేయు ఉపకారము గూడ కలదని మరవ గూడదు. దినదినమును చచ్చుచున్న అసంఖ్యాకములగు జంతువుల యొక్కయు వృక్షముల యొక్కయు కళేబరములు 38

20.వ పటము
సూక్ష్మజీవులు19.వ పటములోని కొన్ని యుండలలో నుండు సూక్ష్మ జీవులు స్పష్టముగ చూపబడినవి. ఇవి గాలి నుండి నత్ర జనిని పీల్చి భూమికిచ్చి దానిని సారవంతముగ జేయును.

కుప్పలు కుప్పలుగా పడి యుండి ఈ ప్రపంచక మంతయు నావరించి కంపెత్తకుండ నీ సూక్ష్మ జీవులు వానిని సశింప జేయుటయే గాక వాని వలన భూమిని సార వంతముగ చేయుచు మన కుపకారులగు చున్నవి. కొన్ని సూక్ష్మ జీవులు చిక్కుడు జనుము మొదలగు మొక్కల వేరుల నాశ్రయించి యుండి భూమిని సారవంతము జేయును. 19, 20. వ. పటములు చూడుము. సూక్ష్మ జీవులు లేక యుండిన మనపాలు మజ్జిగ కాదు. మనకు వెన్న రాదు. మినప రొట్టె పులియదు. మన కడుపులో కూడ అనేక జాతుల సూక్ష్మజీవుల పెరుగుచు మనకు పనికి మాలిన 39

పదార్థములను తిని బ్రతుకు చుండును. ఈ పాకీ వాండ్ర సహాయము లేక పోయిన మన మొక్కొక్కప్పుడు కడుపుబ్బి చావ వలసి వచ్చును.

సూక్ష్మజీవుల కనుకూలమగు స్థితిగతులు

ఇవి వ్వాపింప జాలని స్థలము లేదు. గాలి యందు సముద్రము మీద, కొండల మీద, నీటి యందు, మంచు నందు, ఆకాశము నందు వీని యన్నిటి యందును ఈ సూక్ష్మ జీవులను కనిపెట్టి యున్నారు. ఈ సూక్ష్మ జీవులలో కొన్ని ప్రాణవాయువున్న చోట్ల గాని జీవింప జాలవు. మరి కొన్ని ప్రాణ వాయువు లేని చోట్ల గాని జీవింప జాలవు. కొన్ని ప్రాణ వాయువుండినను లేకున్నను జీవింప గలవు. టిటనస్. (Titanus) అను ధనుర్వాయువును కలుగ జేయు సూక్ష్మ జీవి ప్రాణ వాయువు ఉండు చోట జీవింప జాలదు. ఆంధ్రాక్స్. (Antrax) అను దొమ్మ వ్వాధిని పుట్టించు సూక్ష్మజీవి ప్రాణ వాయువుండిన గాని జీవింప జాలదు.

సూక్ష్మ జీవులు నివసించు ప్రదేశమునందుండు అహార పదార్థము ద్రవ రూపముగ వాని నావరించి యుండు పొర గుండ వాని శరీరములో ప్రవేశించి వాని పోషించును. బాక్టీరియములలో కొన్ని జంతువుల వలెనే బొగ్గు పులుసు గాలిని విడిచి వేయును. మరి కొన్ని ఆకు పచ్చని రంగు కలిగి వృక్షముల వలె బొగ్గు పులుసు గాలిని పీల్చుకొని ప్రాణ వాయువును విడిచి వేయును. కొన్ని బాక్టీరియములు పై రెండు పటములలొ 40

చూపినట్లు కొన్ని మొక్కల వేళ్ళను ఆశ్రయించి యుండి గాలి నుండి నత్ర జనిని తీసుకొనును. అనేక బాక్టీరియములు పులిసిన ద్రావకములలో చచ్చును. కాని పైని చెప్పిన శిలీంద్ర జాతి లోని సూక్ష్మ జీవులు వీనికి ప్రతిగా పులిసిన పదార్థములలో హెచ్చుగ పెరుగును. కలరా సూక్ష్మ జీవి పుల్లని చల్లలో చచ్చును. పాలను చల్ల జేయు సూక్ష్మ జీవులు చల్ల పులిసిన కొలదిని హెచ్చుగ వృద్ధి జెందును. వీనిని మధు శిలీంద్రములందము, 21. వ. పటము చూడుము. మినప పిండి, బియ్యపు పిండి మొదలు పదార్థములు పులియుటకు సహా కారులగు సూక్ష్మ జీవులు శిలీంద్రముల జాతిలోనివే.

21 వ. పటము.
మధుశిలీంద్రములు

మధుశిలీంద్రములు (Yeast) మినప పిండిని పులియ బెట్టు నట్టియు: కల్లును, చెరకు పానకమును సారాయి జేయు నట్టియు శిలీంద్రములు.

అ. ఇందు ఇవి 250 రెట్లు చూపబడినవి. 41

ఈ మధుశిలీంధములు చక్కెరను సారాయిగను బొగ్గు పులుసు గాలిగను మార్చును. బాక్టీరియములు కూడా తాము నివసించు పదార్థములలో ననేక మార్పులను కలుగ జేయును. ఇట్లె చీము పుట్టించు సూక్ష్మ జీవులు తమ చుట్టు ప్రక్కల నుండు కండ మొదలగు పదార్థములను కరగించి ద్రవరూపముగ జేసి వేయును. మరి కొన్ని సూక్ష్మ జీవులు కొన్ని విష పదార్థములను వెలిపరుచును. ఈ విష పదార్థము లు కొన్ని సూక్ష్మ జీవుల నుండి పుట్టినవి పుట్టిన చోటనే నిలిచి యుండును. మరి కొన్నిటి నుండి పుట్టు విషపదార్థములు శరీరము నందలి ద్రవ పదార్థముల గుండ గాని, నరముల గుండ గానీ వ్వాపించును. ఇట్లే క్షయ జాతి సూక్ష్మ జీవుల విషము చాల భాగము పుట్టిన చోటనే యుండును. టిటనస్ (Titanus) ధానూర్వాయు సూక్ష్మ జీవులు మొదలగు వాని విషము శరీరము మెల్లడలకు వ్వాపించును. కొన్ని సూక్ష్మ జీవులు ప్రాణ వాయువే వైపున నుండిన ఆవైపునకు చలించును. మరి కొన్ని సూక్ష్మ జీవువులకు గాలి తగిలిన తోడనే చలనము పోవును. సామాన్యముగ అనేక సూక్ష్మ జీవులు కొంత వేడిని భరించి ఆ వేడియందు మిక్కిలి శీఘ్రముగ వృద్ధి బొందును. అంత కంటె హెచ్చగు వేడిమి యుండిన యెడల చురుగు తనము తగ్గి క్రమముగ నశించును. కాన ఎంత వేడిమి తమ వృద్ధికి మిక్కిలి అనుకూలముగ నుండునో అంతటి శరీరపు వేడిమి గల జంతువులలోనే ఆయా జాతి సూక్ష్మ 42

జీవులు పెరిగి వ్యాధిని పుట్టించును గాని తమకు తగిన శరీరపు వేడిమి లేని జంతువులలో నవి బ్రతుక జాలవు. అనగా మనుష్యులలో వ్యాది గలిగించు కొన్ని సూక్ష్మ జీవులు చేపలు, కప్పలు, మిదలగు నీటి జంతువులలో ఎట్టి వ్వాధిని గలిగింప నేరము. మానవులకు వచ్చు కలరా వ్యాధి మన ఇండ్లలో నుండు కుక్కలకును, పిల్లులకును రాదు. కొన్ని వ్యాధులను గలిగించు సూక్ష్మ జీవులు ఎంత ఎండనైనను వేడినైనను భరించి సంవత్సరముల తరబడి బ్రతుకును. సూక్ష్మ జీవుల అయుద్రాయము ఆయా జాతిని బట్టి యుండును. దొమ్మ అంథ్రాక్సు (Anthrax) సూక్ష్మ జీవుల గ్రుడ్లు సీలు చేసిన గొట్టములలో 22 సంవత్సరముల వరకు బ్రతి యుండెనని పాన్ టర్ (Pasteur) అను నతడు కనిపెట్టెను. క్షయ వ్వాధిని కలిగించు సూక్ష్మ జీవులు ఎండి పోయిన కఫములో 95 దినములు బ్రతియుండి యటు పిమ్మట ఇతరులకు ఆ వ్వాధి నంటింప గలిగి యుండెనని రుజువు పడినది. ఇట్టుగాక కలరా మొదలగు కొన్ని వ్యాధులను గలిగించు మరి కొన్ని సూక్ష్మ జీవులు ఒకటి రెండు గంటల వేడికే తాళ జాలక చచ్చి పోవును. అనేక సూక్ష్మ జీవులను గుచ్చెత్తిన మిశ్రమ కషాయములో తమకు అనుకూలమగు స్థితి గతులు గల కొన్నెయే బ్రతికి మరికొన్ని చచ్చి పోవును. కొన్ని సూక్ష్మ జీవుల నుండి పుట్టు పదార్థములు మరికొన్ని సూక్ష్మ జీవులకు విషములయి వానిని నశింప జేయును. టయిఫాయిడ్ (Typhoid) 43

జ్వరమును కలుగ జేయు సూక్ష్మ జీవులు జిగట విరేచనములను గలిగించు (B.Coil:) కోలై సూక్ష్మజీవులతో కలిపి పెంచినపుడు టయిఫాయిడ్ సూక్ష్మ జీవులు చచ్చును. కాని టయిఫాయిడ్ సూక్ష్మ జీవులు కురుపుల యందు చీము పుట్టించు సూక్ష్మ జీవులతో కలిసి చక్కగ పెంపొందును.

సూక్ష్మ జీవు లన్నియు పొడిచే ననగా ఆరబెట్టుటచే గాని వేడిచే గాని, మందులచే గాని, తమ కిష్టము లేని జంతువుల శరీరములో ప్రవేశింప జేయుట గాని తమ బలమును పోగొట్టు కొనును. ఇట్లే కొన్ని వ్వాధులకు విరుగుడు పదార్థములను తయారు చేయునపుడు సూక్ష్మ జీవుల బలమును తగ్గింతురని ముందు తెలిసి కొన గలరు. వెఱ్ఱి కుక్కల యొక్క వెన్నెముకలోని పెద్ద నరమును తీసి ముక్కలు చేసి కొన్ని ముక్కలను ఒక దినమును, కొన్ని ముక్కలను రెండు దినములను, కొన్ని ముక్కలను మూడు దినములును ఇట్లే నాలుగు అయిదు ఆరు మొదలు పదునైదు దినముల వరకు కొన్ని ముక్కలను వేరు వేరుగ అర బెట్టి ఆముక్కల నుండి రకరకములగు బలము గల టీకా రసములను తయారు చేయుదురు. ఇందు పదునైదు దినములు ఆరబెట్టిన ముక్కతో చేయ బడిన రసము మిక్కిలి బలహీన మయినది. ఎంత తక్కువ ఆరబెట్టిన ముక్కలతో చేయబడిన రసము అంత బలమయినది. 44

సాధారణముగ అన్ని జాతుల సూక్ష్మ జీవులును చీకటిలో చక్కగ పెరుగును. మిక్కిలి ప్రకాశమయిన వెలుగురు వలన వాని వృద్ధి తగ్గి అవి క్రమక్రమముగ నశించును. సూక్ష్మ జీవుల కంటె వాని గ్రుడ్లు ఎండ వేడి తడి, వెలుతురు మొదలగు వానిచే సులభముగ హాని చెందవు. మసలు చున్న నీళ్ళలో తల్లి సూక్ష్మ జీవులు చచ్చినను, వాని గ్రుడ్లు కొన్ని 130 డిగ్రీల వేడి వచ్చు వరకు బ్రతికియండును. పశువులకు గాళ్ళు కలిగించు సూక్ష్మ జీవులు పచ్చిక బైళ్ల లోని పచ్చ గడ్డి చాటుననుండు నీడలో అనేక సంవత్సరములు జీవింప గలవు.

సామాన్యముగ మనుషుల కంటి వాధులను పరిశీలించి చూడగ సూక్ష్మ జంతువులు, శిలీంద్రములు, బాక్టీరియములు, ఈ మూటిలో బాక్టీరియములు ఎక్కవ వ్యాధిని కలుగ జేయునని ఈ క్రింది పట్టీని గమనించిన తెలియ గలదు.

అ. సూక్ష్మ జంతువులచే గలుగు వాధులు. 1. నాలుగు విధములగు చలి జ్వరములు..(malaria) 2. అమీబిక్ డిసెంటరి (Amoebic Dysentery) ఒక విధమయిన రక్త గ్రహిణి.

(ఆ): శిలీంద్రముచే గలుగు వ్వాధులు. (Fungi)

 • (1) ఒక విధమైన నోటి పూత {Thrushi)
 • (2) ఒక విధమైన సర్పి (Herpes)
 • (3) తామర (Ringworm) 45
 • (4)ఆక్టినోమైకోసిస్ అను నొక విధమైన పుండు. (Actubintcisus )
 • (5)ఒక విధమైన కాలి పుండు (Masdura FooT )
 • (6)శోభి (Tenia Versicolor )
 • (ఇ) బాక్టీరియములచే గలుగు వ్వాధులు.
 • (1)క్షయ(Tuberculosis )
 • (2)న్యుమోనియా (Pneumonia )
 • (3)పచ్చసెగ (Conorrhoea )
 • (4)టయిఫాయిడ్ జ్వరము(Typhoid )
 • (5)కలరా(Chollera )
 • (6)ధనువ్వాయువు. టిటనస్(Titanus )
 • (7)ఇన్ ప్లుయంజా జ్వరము(Influenza )
 • (8)ప్లేఘ్... మహామారి(Plague )
 • (9)సెరిబ్రోస్పయినల్ ఫీవర్ (కొత్త జ్వరము) (Cerebrospinal Fever )
 • (10)చీము.. నూతి జ్వరము(Suppuration)
 • (11)సర్పి(Erysispelas )
 • (12)అడ్డగర్రలు పుట్టించు పుండు( Soft Chancre)
 • (13)కుష్టువ్వాధి(Leprosy )
 • (14)కొరుకు లేక సవాయి మేహము(Syphillis)

46

 • (15) దొమ్మ (Antrax) ఇది పశువ్యాధి మానవులకు కూడ అంట వచ్చును.
 • (16) నోటిగాళ్లు,. కాలి గాళ్లు (Foot and mouth disease )

పైని వివరించినవి గాక ఇంకను అసంఖ్యాకములగు వ్యాధులు బాక్టీరియములచే గలుగును. ఇంతవరకు మనకు తెలియనివి పెక్కు సూక్ష్మ జీవులింకను గలవు.

AntuVyadhulu.djvu