Jump to content

అంటువ్యాధులు/పదునారవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

182

పదునారవ ప్రకరణము

గాలిమూలమున వ్యాపించు వ్యాధులు

ఇవి మశూచకము, పొంగు, ఆటలమ్మ, కోరింత్గ దగ్గు, గవదలు, డెంగ్యూ జ్వరము, న్యూమొనియా మొదలగునవి. ఇందు కొన్ని వ్వాధులను కలిగించు సూక్ష్మ జీవులులను ఇంకను మనము కండ్లతో చూడలేదు. మశూచక రోగి యొక్క పొక్కుల పైనుండు పక్కులలో ఈ సూక్ష్మ జీవులుండి అవి ఎండి ధూళియై గాలిలో కొట్టు కొని పోవుచు చాల దూరము వరకు వ్వాపించునని ఇప్పటి సిద్ధాంతము. రోగిని ప్రత్యేక పరచుటను గూర్చియు టీకాలు వేసి రక్షణ శక్తిని గలిగించుటను గూర్చియు ఇదివరలో వ్రాసిన దానిని గమనించ వలయును. అపరి శుభ్రత, జన సమ్మర్దము ఇవి ఈ వ్యాధుల వ్యాపకమునకు మిక్కిలి సహ కారులని జ్ఞప్తియుంచుకొని వానిని రెంటిని చేరనీయ కుండు ప్రయత్నము ఎడతెగక చేయు చుండ వలెను.

మశూచకము

ఒకరినుండి మరియొకరికి వ్యాపించు వ్వాధులలో మశూచకము మిక్కిలి ఉద్రేకమైనది. దీని యంత త్వరగా వ్యాపించు అంటు వ్వాధి మరొకటి లేదు. ఇతర జ్వరముల వలె దీనినొక జ్వరముగా నెంచ వలయును. కాని ఈ జ్వరము నందు మూడవ 183

దినము మొదలుకొని రోగి చర్మము అంతయు నొక విధముగా కంది, పొక్కులెక్కి తుదగా పొక్కులలో చీపు పుట్టి పెద్ద పెద్ద కుండలును పుండ్లును ఏర్పడును. ఈ పుండ్ల వలన శాస్వతముగ నుండు మచ్చలను, ఒకానొకప్పుడు వికార రూపమును గలుగును. ఒక సారి మశూచకము వచ్చిన వారికి తిరిగి రాదు. మన దేశమునందు అనాది నుండి ఈ వ్యాధి యున్నట్లు కనబడుచున్నది. ఇంగ్లాండు దేశమునకు 1241 సంవత్సరము నందును ఈ వ్యాధి ప్రవేశించి నట్లు నిదర్శనములు గలవు.

మశూచకము నంటించు సూక్ష్మ జీవి ఇదియని ఇప్పటికిని నిశ్చయముగా తెలియక పోయినను, అది ఏదియో పొక్కులలోని చీమునందు ఉన్నదని రూఢిగా చెప్పవచ్చును. ఏలయన, ఈ చీమునెత్తి మరొకనికి అంటించిన యడల వారికి మశూచకము వచ్చుటయే ఇందులకు ప్రబల నిదర్శనము. ఇది యితరులకంతు విధమును జూడగా ఈ వ్వాధి ఏదో విధమున అనగా గాలి మూలమున గాని, తట్టలు సానానులు మొదలగు వాని సంపర్కము మూలమున గాని, అంటు చున్నట్లు తెలియ గలదు. రోగి యొక్క ఊపిరి తిత్తులలో నుండియు చర్మము నుండియు, బహుశః ఉమ్మి, మల మూత్రాదులు మొదలగు వాని నుండియు గూడ దీని సంపర్కము ఇతరులకు అంట వచ్చును. కాబట్టి రోగికి ఉపచారము చేయు నౌకరుల మూలమున గాని రోగి నివ 184

సించి యుండు ఇంటిలోనికి రోగి యున్నప్పుడు గాని, రోగి విడిచిన తరువాత గాని ఇతరులు ప్రవేశించుట చేతను, ఈ వ్యాధి వ్యాపింప వచ్చును. వ్యాధి ప్రారంభించినది మొదలు, పక్కులన్నియు పూర్ణముగా ఊడిపోయి ఆరోగ్యము కలుగు వరకు ఒక రోగి నుండి ఇతరులకు ఈ వ్యాధి అంట వచ్చును. కాని కుండలలో చీము పట్టు దినముల యందు ఈ వ్యాధి మిక్కిలి ఉధృతముగ వ్యాపించ గలదని తెలియు చున్నది. తక్కిన అంటు వ్వాధుల యొక్క మైల కంటె ఈ వ్యాధిని బుట్టించు మైల రోగి నుండి విస్తార దూరము వ్వాపింప గలుగుటచే దీని వ్వాపకమును నిలుపుటకు మిక్కిలి కష్టముగా నున్నది. ఒక గ్రామమున కంతకును అంటించుటకు మరియొక ఊరినుండి ఒక్క మనిషి ఈ వ్యాధిని దీసికొని వచ్చిన చాలు. ఈ విత్తనము పది పదునైదు దినములలోనే చుట్టుపట్ల నున్న ముప్పది నలుబది కుటుంబములకు వ్వాపింప గలదు. ఇది కొంపలంటు కొను నిప్పు కంటె వేగముగ నింటింటికి వ్యాపించు నని చెప్పవచ్చును.

నివారించు పద్ధతులు

రోగిని వెంనే ప్రత్యేక పరచుట చేతను, రోగి యుండు స్థలమును వెంటనే శుద్ధి చేయుట చేతను, ఈ వ్యాధి యొక్క వ్వాపకము కొంత వరకు నిలుప వచ్చును గాని దీని వ్యాపకము గాలితో సమానమైన వేగము గలదగుట చేత ఇంతటితో నిలుచునని చెప్పుటకు వీలు లేదు. మశూచికము రాకుండ టీకాలు 185

వేయుటకు ప్ర్రారంభించిన తరువాత దీని వ్యాపకము యొక్క ఉధృతము మనకంతగా దెలియుకున్నది. ఇప్పుడు టీకాల మూలమున మశూచకపు వ్యాపకము కొంత వరకు నిలుచు చున్నను, అచ్చటచ్చట ఈ వ్యాధి ఇంకను హెచ్చుగ వ్యాపించు చున్నట్లు విను చున్నాము. ఒకానొక కాలమునందు ఒకానొక ఊరిలో నిది యమితముగ వ్యాపించుటయు మరియొక యూరిలో అదే కాలము నందు గాని, వేరొక కాలము నందు గాని ఒకరిద్దరు రోగులకు మశూచకము వచ్చి అంతటితో నీ వ్యాధి నిలచి పోవుటయు గలదు. ఇట్టి వ్యాపకమునకు కారణము కనుగొన వలయుననిన మిక్కిలి జాగ్రత్తతో పరిశోధింప వలసి యున్నది. ఒక్కొక్క ప్రదేశమునందు టీకాల వలని లాభము ప్రజలనుకొని నంతగా నుండక పోవచ్చును. టీకాలు చక్కగా పొక్కినవా లేదా అను విషయము ఆయా గ్రామముల అంతట ఈ వ్యాధి వ్యాపకము యొక్క ఉధృతమును తెలిసి కొనుటలో ముఖ్యమైన అంశము. కాబట్టి ఒక చోట మశూచకము వచ్చిన వెంటనే అనుమాన స్పదమగు జనులందరకు తిరిగి టీకాలు వేయ వలయును.

దేశము యొక్క కాలమాన స్థితికిని, మశూచకపు వ్యాపకమునకును ఎదో ఒక సంబంధము కలదని గూడ తోచు చున్నది. ఒకానొక కాలమందు ఇది మిక్కిలి ఎక్కువగా నుండును. మరి యొక కాలమందు తగ్గి యుండును. కాని అనేక 186

చోట్ల ఈ వ్యాపకము మానవుల రాక పోకలను బట్టియే ఉండునని తోచుచున్నది. మశూచకము వచ్చిన వాని చుట్టు అదృష్ట వశమున టీకాలు వేయించు కొనిన వారే యుండి రోగి యొక్క వ్యాధి మశూచకమని మొదటి దినమే తెలిసి యుండి, రోగిని వెంటనే ప్రత్యేక పరచి రోగిని చూచుటకు ఇతరులు ఎవ్వరును పోకుండ నుండిన ఎడల ఆ వ్యాధి అంతటితో దిగిపోయి వుండ వచ్చును. అధికారులు ఈ రోగి విషయమై వెంటనే తెలిసికొని రోగితో సంబంధించిన వారల కందరుకును చుట్టు పట్లనుండు ఇండ్ల వారి కందరుకును వెంటనే టీకాలు వేసి, రోగిని గ్రామము వెలుపల నుండు ప్రత్యేక స్థలమున ఉంచిన యెడల ఇంకను యుక్తము. కాని ఈ విషయములను గూర్చి బొత్తిగ అజ్ఞానములో మునిగి యున్న మన దేశమునందు ఇట్టి స్థితి ఇంతలో వచ్చునని తలచుటకు వీలులేదు. రోగికి వ్యాధి అంటిన మొదటి దినములలో ఏదో కొద్దిగా జ్వరము తగిలినదని తలచి అమ్మవార ని తెలియక పూర్వము, మామూలుగా దిరుగుచు తన పనులు జేసికొను చుండుట వలనను, ఊరంతయు దిరుగు చుండు అద్దె బండ్లలోను, రైలు బండ్లు లోను తిరుగుటచే ఆ బండ్ల మూలమునను, నాటకములకును సభలకును బోవు చుండుట చేతను ఈ వ్యాధి రోగి మూలమున ఎట్లు వ్యాపింప గలదో తెలియగలదు. అమ్మారని తెలిసిన తరువాత, రోగి ఇంటిలో పరుండి యున్న తరువాత గూడ ఆ యింటిలోని పిల్లలు బడికి 187

పోవుట చేతను, పెద్దలు తమతమ పనుల మీద ఊరంతయు దిరుగుట చేతను, తల్లులు ఒక క్షణమున రోగికి ఉపచారములు చేయుచు, మరిక క్షణమున నా బట్టలతోడనే చెరువునకు వెళ్ళి నీరు తెచ్చుట చేతను లేక దుకాణమున కూర్చుండి పండ్లు అమ్ముట చేతను, చాకలి వారు వీధి వెంట రోగి బట్టలను దీసికొని పోవుట చేతను, బంధుగులు రోగిని చూచుటకు వచ్చి పోవుచుండుట చేతను, ఈ వ్యాధి వ్యాపింప గలదు. దీని వ్యాపకమున కిన్ని మార్గములుండుట చేతనే ఒకానొకచో అదృష్ట వశమున ఒక్కనికే వ్యాధి వచ్చి పోవుటయు, మరొకచో ఒక్కని నుండి నూరుగురు వరకు కూడ వ్యాధి వ్యాపించుటయు సంభవించు చున్నది.

ఒకనికి అమ్మవారు సోకినదని అనుమానము కలిగిన వెంటనే ఆయింటి యందు పూచీగల వారెవ్వరో అధికారులకు తెలియ జేయవలయును. ఆ అధికారులు మిక్కిలి నేర్పును జాగరూతకయు గలవారై ఏయూరినుండి ఆమనిషి వచ్చినదియు, ఎవరెవరి ఇండ్లకు తిరిగినదియు, ఏ ఊరినుండి ఎవరెవరు ఆ యింటికి వచ్చుచు పోవు చున్నదియు చక్కగ కనిపెట్ట వలయును. వ్యాధి వచ్చిన వెంటనే తెలుపని వానికిని, తెలిసిన సమాచారమును గూడముగ నుంచిన వానికిని, అధికారులడినపుడు అబద్ధము చెప్పు వానికిని తగిన శిక్ష విధించుటకై శాసములుండవలెను. 188

ఒకచోట మశూచకము ఉన్నదని తెలిసిన వెంటనే అధికారులు రోగిని తగిన వైద్య శాలకు తీసికొని పోవలయును.

ఇల్లంతయు పదమూడవ ప్రకరణములో చెప్పి నట్లు శుద్ధి చేయ వలయును. రోగి యొక్క పరుపును, బట్టలను అవసరమైన యెడల నాశనము చేసి రోగికి తగిన పరిహార మియ్యవలయును.

చుట్టుపట్ల నున్న ప్రజల కందరకును టీకాలు వేయ వలయును. ఇతర గ్రామముల నుండి రోగిని చూడ వచ్చిన వారి విషయమై వెంటనే ఆయా గ్రామాధికారులకు తెలియ పరచి వారికిని వారి నంటి యుండు వారికిని టీకాలు వేయించ వలయును.

బడికి బోవు పిల్లలున్న యెడల తక్షణము వారిని నిలిపి ఆ బడిలోని పిల్లలందరుకును టీకాలు వేయ వలయును. ఆ సమయమున బడికి రాని పిల్లల పట్టీని తయారు చేసి వారి యిండ్లకు పోయి వారలకు ఇదివరకే అమ్మావారంటినదేమో తెలిసికొని వారలకును వారల నంటి యుండు వారలకును, అందరకును తిరిగి టీకాలు వేయ వలయును. ఆ యింటి నుండి మనుష్యులు నౌకరికి గాని, వ్యాపారములకు గాని ఏ ఏ స్థలములకు వెళ్ళుదురో చక్కగ కనిపెట్టి అచ్చటి వారల కందరకును తెలిపి తిరిగి టీకాలు వేయవలయును. రెండోవ సారి టీకాలు వేసికొనుట నిర్బందము గాదు కనుక, తిరిగి టీకాలు వేసికొనమని ఎవరైనను తిరుగ బడిన ఎడల అట్టి వారలను పదునాలుగు దినముల వరకు నౌకరికి రానీయ కుండ జేచి ప్రజలనుండి ప్రత్యేక పరచ 189

వలయును. రోగి యుండు ఇంటిని, రోగి యిండ్లకు వచ్చిన వారి యిండ్లను పదునాలుగు దినముల వరకు అధికారులు ప్రతి దినమును శోధించు చుండవలయును. మరి పదునాలుగు దినముల వరకు అప్పుడప్పుడు శోధించు చుండ వలయును. వ్వాధి వలన చనిపోయిన శవమునుండి ఈ వ్యాధి మిక్కిలి వ్యాపింప వచ్చును గాన అట్టి వానిని వీధుల వెంట దీసుకొని పోవుటకు పూర్వము, సుద్ధి చేయు మందు నీళ్లలో తడిపిన మందు గుడ్డలతో చక్కగ కప్పి తిన్నగ శ్మశానమునకు తీసికొని వెళ్ళి కాల్చవలెను.

మశూచకపు వైద్యశాల

మశూచకము పైద్య శాలలకును, తక్కిన వైద్యశాలలకును ముఖ్యమైన బేధములు కొన్ని కలవు.

స్థలము:- ఇండ్లకును, రోడ్లకును, ప్రజలు పలుమారు వచ్చుచు పోవు చుండు ఇతర స్థలములకును, ఈ వైద్య శాల మిక్కిలి దూరముగ నుండ వలయును. ఈ వైధ్యశాలలు ఇతర అంటు వ్యాధుల వైద్య శాలలతో కూడ సంపర్కము కలిగి యుండ కూడదు. ఇట్టి వైద్య శాల కట్టవలయుననిన మిక్కిలి విశాలమైన స్థలము కావలయును. ఏలయన దీని చుట్టు నాలుగు వందల గజములకు లోపల ఏ యిండ్లును ఉండకూడదు. ఇట్టి వైద్య శాలలో గాలియి, వెలుతురును, మిక్కిలి చక్కగ వచ్చు చుండవలయును. అనుమానము గల మశూచకపు రోగు 190

లను మశూచకపు రోగులతో సంబంధముగల ఇతరులును నివశింప జేయుటకై ఆదే ఆవరణములో ప్రత్యేకముగ, వైద్య శాలకు దూరముగ, ఇండ్లు కట్టి యుంచ వలయును.

ఈ వైద్య శాలలో నౌకరీ చేయు వారలందరును ఖాయముగ అక్కడుండు వారైనను సరే లేక పుడపుడు నౌకరికి వచ్చు వారలయినను సరే వారుచేయు నౌకరీ ఎట్టిదైనను వారలకందరకు ఆస్పత్రిలో ప్రవేశించక మునుపే తిరిగి టీకాలు వేయవలయును. ఆస్పత్రిలోనికి ఎప్పుడో మిక్కిలి అవసరము ఉన్నప్పుడు తప్ప చూచు వారలను రానీయకూడదు. మిక్కిలి తప్పని సరిగా ఎవరినైనను పోనీయ వలసిన ఉన్నయెడల అట్టి వారికి తిరిగి టీకాలు వేసి ఆస్పత్రిలోనికి పోక ముందే తడుపుటకు వీలైన ప్రత్యేకపు దుస్తులనిచ్చి వారు తిరిగి వచ్చిన వెంటనే మందు నీళ్లలో స్నానము చేయించి శుద్ధి చేసిన తమ దుస్తులను తొడుకు కొని నీయ వలెను. లేని యెడల చూచుటకు వచ్చు వారలను పదునాలుగు దినముల వరకు అదే ఆవరణములో ప్రత్యేకముగ శోధనలో నుంచి పిమ్మట పంపి వేయవలయును. రోగుల బంధువులకును, స్నేహితులకును కావలసిన సమాచారము లన్నిటిని చెప్పుటకు దూరముగ నొక స్థలమును ఏర్పరచి అక్కడకే వారు వచ్చి పోవు నట్లు ఏర్పాట్లు చేయ వలయును. కాని అయిన వారును, కాని వారును ఆస్పత్రి లోనికి పోకూడదు. 191

ఆస్పత్రిలో నుండు ఏ విధమైన సామానును బయటికి పోనీయ రాదు. రోగులు వ్రాయు ఉత్తరములను బహుశ్రద్ధగ ఎండబెట్టిగాని కాచి గాని శుద్ధి చేసి బయటికి గాని బయటకు పోనీయ వలెను.

ఆస్పత్రి విషయమై చెప్పిన నిబంధనలన్నియు ఇండ్లలో నుండు రోగుల విషయములో కూడ భహు జాగ్రత్తగా జరుపు చుండిన యడల ఈ వ్యాధి యొక్క వ్యాపకము ఇప్పటి కంటె అనేక రెట్లు తగ్గి పోవునని చెప్పవచ్చును.

తట్టమ్మవారు (పొంగు)

ఇది గొంతు నొప్పి, జలుబు, కొద్ది పాటి దగ్గు, మొదలగు లక్షణములు కలిగి శరీరమంతయు ఒకానొక విధమైన తట్టు వలె నుండు దద్దులతో కూడిన యొక విధమైన జ్వరమని చెప్పవచ్చును. కొందరికి ఈ వ్యాధితో పాటు కండ్ల కలక గూడ రావచ్చును.

వ్యాపకము

ఇది ప్రపంచకము నందన్ని భాగముల యందును కొద్దిగనో హెచ్చుగనో వ్యాపించి యున్నది. అప్పుడప్పుడు ఈ వ్యాధి వచ్చుచు పోవు చుండును దేశములలో కంటె దీని నెన్న డెరుగని దేశములో నిది ప్రవేశించిన యెడల మిక్కిలి ఉపద్రవము కలుగ చేయును. 1875 సంవత్సరములో ఫీజీ ద్వీపములలో ఇది ప్రవేశించి నపుడు దీని వ్యాపకము తీవ్రమై మూడు నెలలలో దేశమందలి ప్రజలలో నాలుగవ వంతును మ్రింగి వేసినది. 192

మన దేశమునందు ఈ వ్యాధి సర్వ కాలముల యందును ఆశ్రయించి యుండుటచే మనలనంతగా బాధించుట లేదు. ఇది ఏటేట వచ్చుచు పోవు చున్నను మరణములు మాత్రము మిక్కిలి అరుదు. మిక్కిలి ఎండ తీవ్రముగల ప్రదేశములలో ఎట్లో అతి శీతలములగు ప్రదేశములలో కూడ నట్లే ఈ వ్యాధి వ్యాపించు చుండుత చేత దేశముల యొక్క శీతోష్ణ స్థితికీని దీని యొక్క వ్యాపకమునకును సంబంధము లేనట్లు తోచు చున్నది. ఈ వ్యాధి నల్ల వార్లకును, తెల్ల వార్లకును కూడ ఒకటే విధముగ వ్యాపించును. స్త్రీ పురుష వివక్షత గాని పిన్న పెద్దల వివక్షత గాని దీనికి ఉన్నట్లు తోచదు. అయినను మన ఇండ్లలో సాధారణముగా పెద్ద వారల కంటె పిల్లలను ఇది అంటు చున్నట్లు కనబడును. ఎందు చేతననగా ప్రతి దేశమునందు అప్పడప్పుడు ఈ వ్యాధి వచ్చి పోవు చుండుట చేత పెద్దలందరకు ఈ వ్యాధి ఎప్పుడో ఒకప్పుడు సోకి యుండును. అందుచే ఈ వ్యాధి క్రొత్తగ వచ్చినపుడెల్ల అనేకమంది పిల్లలును ఇది వరకు రాక మిగిలి పోయిన కొందరు పెద్ద వార్లును ఈ వ్యాధికి లోబడుదురు. ఆరు మాసములకు లోపు వయసుగల పిల్లలకును నలుపది సంవత్సరముల వయసు మీరిని పెద్దలకును ఈ వ్యాథి అంటుట అరుదు.

ఈ వ్యాధి సామాన్యముగా మరియొక రోగి యొక్క సమీప సంపర్కముచే వచ్చును. ఇది ఒంటి మీద దద్దులు లేవక పూర్వమే ఇతరులకు అంటుకొను స్వభావము గల దగుట చేత
193

ఫలాన వ్యాధి యని తెలియక పోవుట చేత పిల్లలు బడిలో ఒండొరుల తాకుట వలనను ఇది పిల్లలలో మిక్కిలి వ్యాపించును. వ్యాధి వచ్చిన ప్రతి వారిని చక్కగ గాలియు వెలుతురును వచ్చు నట్టియు ఇంటిలో విస్తారము సంబంధము లేనట్టియు ఒక గదిలో రోగిని ప్రత్యేక పరచిన యెడల సామాన్యముగా ఈ వ్వాధి ఎతరులకంటదు. బట్టలు పుస్తకములు, ఆట బొమ్మలు, ఇతర సామానులు ఇవి రోగి నుండి తీసిన వెంటనే ఎండలో నుంచి గాని మరియొక విధముగా గాని శుద్ధి చేసిన యెడల ఎండ చేతను గాలి చేతను దీని సూక్ష్మ జీవి చచ్చునదగుట చేత ఈ వ్వాధి అంతగా వ్యాపింపదు. కాని ఒక్క గదిలో నివసించి నంత మాత్రము చేత ఈ వ్యాధి ఎంత సులభముగ అంటుకొనునో ఈ క్రింది ఉదాహరణము వలన తెలియ గలదు. ఒక బడిలోని ఇరువది ఇద్దరు పిల్లలు విహారార్థమొక ఊరికి పోయి అచ్చట ఒక యింట నొక రాత్రి నిద్రించిరి. మరుసటి వారములో ఆ 22 మంది పిల్లలలో 21 మందికి తట్టమ్మవారు వచ్చెను. కారణము విచారింపగా విహారార్థమై పోయి యున్న రాత్రి వారు పరుండి యున్న ఇంటిలోని పిల్లావాని కొకనికి ఆ తట్టమ్మ వారు సోకి యున్నట్టు తెలిసెను. ఇప్పుడు తట్టమ్మ వచ్చియుండని పిల్లవానికి ఇది వరకే ఒక సారి తట్టమ్మ వచ్చి పోయెననియు తెలిసెను.

నివారించు పద్ధతులు

1. వైద్యుడును ఇంటి యజమానియు వెంటనే గ్రామాధికారికి ప్రకటన చేయ వలెను. 194

2.బడి పిల్లలలో తట్టమ్మ వచ్చినపుడు ఉపాధ్యాయుడు వెంటనే అధికార్లకు తెలుప వలెను. ఈ వ్యాధి కల ఇంటిలో నుండు పిల్లల నెవ్వరిని బడికి రానీయ కూడదు. బడిలో అనేక మందికి ఈ వ్యాధి కనుపించిన యెడల వెంటనే బడి మూసి వేయవలెను. సెలవు దినములలో ఇంటికి పోయిన పిల్లలందరును తమ ఇంట అంటు వ్వాధి ఏదియును లేదని వైద్యుని వద్ద నుండి గాని ఇంటి యజమాని వద్ద నుండి గాని సర్టిపికేటు తీసుకొని రావలయును

3. రోగిని, వ్యాధి తెలిసిన వెంటనే ప్రత్యేక పరచుట కూర్చియు రోగి యుండు స్థలమును శుద్ధి జేయుట గూర్చియు 12, 13 ప్రకరణములలో వివరించిన విషయములను గనమింప వలెను. లేదా రోగిని వెంటనే ప్రత్యేకముగ అంటు వ్యాధుల కేర్పరుపబడిన ఆస్పత్రికి పంప వలయును. మన దేశమునందు ప్రజలకు ఈ వ్వాధి యన్న బొత్తిగ భయమేలేదు. పైన చెప్పిన కొద్ది పాటి నిబంధనలను గమనించిన యెడల ఈ వ్యాధి వ్యాపకమును చాల వరకు మాన్ప వచ్చును. రోగుల నుండి వచ్చు కఫము చీమిడి మొదలగు నవి రోగి చర్మము నుండి రాలు పొట్టి కంటె ఈ వ్వాధి యొక్క వ్యాపకమును హెచ్చు చేయునని తోచు చున్నది. తట్టి పోసిన 15 దినములైన తర్వాత గాని రోగిని చక్కగ స్నానము చేయించి తర్వాత గాని ఇతరులతో కలియ నీయ రాదు. అపుడైనను జలుబు గాని దగ్గు గాని ఏమియు నుండకూడదు. 195

ఆటలమ్మ

సామాన్యముగా పిల్లలకు ఏ విధమైన బాధయు లేకుండగనే మొదటి రోజునే శరీరము మీద అక్కడక్కడ ఎర్రని పొక్కులు పొక్కి వెంటనే నీటితో నిండి యున్న కుండలుగా మారి పోవునట్టి ఒక అంటు వ్యాధి. ఈ కుండలలోనీ నీరు క్రమక్రమంగా ఎండి పోయి చిన్న చిన్న పక్కు లేర్పడును. సామాన్యముగ జ్వరముండదు. కుండలలో చీము పట్టదు. ఎవ్వరును దీనిచే చావరు. పిల్లలాడుకొను చుండగనే ఈ వ్యాధి వచ్చి పోవును. కావుననే మనవారు దీనికి ఆటలమ్మ యని పేరు పెట్టిరి.

వ్యాపకము

రోగిని ఇతరులు తాకుట చేతను బహుశః ఇతర సంపర్కము చేతను గూడ ఇది వ్యాపించును. ఒక రోగి పక్కులలోని రసము నెత్తి ఇతరులకు టీకాలు వేసిన యెడల వార్లకు ఆటలమ్మ రాదని చెప్పుటకు వీలు లేదు.

నివారించు పద్ధతులు

ఈ వ్వాధి చంపునది కాక పోవుట చేత శానిటరీ అధికార్లకు దీనిని గూర్చి ప్రకటన చేయ నక్కర లేదని కొందరి అభిప్రాయము. ఆటలమ్మకును మశూచకములకును గల భేదము అందరకు సులభముగా తెలియక పోవచ్చును. కాబట్టి ఒకా నొక్కప్పుడు మశూచకపు వ్యాధిని ఆటలమ్మ అని ప్రజలు తలచి అధికార్లకు తెలియ జేయక వోవచ్చును. ఇట్టి 196

యు సందర్భములు కలుగ కుంటుటకు గాను ఆటలమ్మను గూడ ప్రకటన చేయు వ్యాధులలో చేర్చిన యెడల అధికారులు వచ్చి చూచుకొని అవసరమైన యెడల రోగిని ప్రత్యేక పరచి తగు జాగ్రత్తను పుచ్చుకొందురు. ఒక ఇంటిలో ఒక పిల్ల వానికి వచ్చిన ఆటలమ్మ ఇతర పిల్లలకు రాకుండ చేసికొన వలయు నన్న యెడల రోగిని ప్రత్యేక పరుచుటకు గూర్చియు శుద్ధి చేయుటను గూర్చియు పండ్రెండు పదమూడు ప్రకరణములలో వివరింప బడిన విషయమును చూడుము.

గవదలు

సామాన్యముగా పిల్లలకు మెడయొక్క పైభాగమున క్రింద దౌడ ఎముకకు లోతట్టునను చెవి సమీపనునను ఉబ్బి బిళ్ళలు కట్టి నొప్పి ఎత్తు ఒకానొక అంటు వ్యాధికి గవదలని పేరు. దీనికి గాలి బిళ్ళలనియు చెప్పుదురు. ఒక ఒకటి రెండు రోజులు వ్వత్యాసములో రెండు పైవులను వచ్చు స్వభావముకల దగుట చే వ్యాధిని గుర్తెరుగుట కంతగా కష్టముండదు. సామాన్యముగా గవదలు ఉబ్బక ముందే కొంచెము జ్యరము తలనొప్పి మొదలగు లక్షణములు కనిపించును.

వ్యాపించు విధము

ఈ వ్యాధి తరుచుగా నాలుగు సంవత్సరములు మొదలు పదునాలుగు సంవత్సరముల వయస్సుగల పిల్లలకు అంటును. కాని పశిబిడ్డలకు ముసలి వాండ్లకును తప్ప తక్కిన వారల 197

కందరకును రావచ్చును. ఇది రోగి యొక్క సమీప సంపర్కము లెక పోయినను, అనగా రోగిని తాకక పోయినను, ఒకరి నుండి మరియొకరికి అంటును. వాని చక్కగా గాలి ప్రసరింప నట్టియు తేమ గలిగి నట్టియు ఇండ్లలో దీని వ్యాపకము హెచ్చుగ నుండును. తట్టమ్మ వచ్చి పోయిన పిమ్మట గవదలు వచ్చుటయు ఒకానొకప్పుడు గలదు. ఒక సారి గవదలు వచ్చి పోయిన పిమ్మట తిరిగి సామాన్యముగా రాదు. ఈ వ్వాధి గవదలు ఉబ్బక పూర్వము కొన్ని దినములు ఉబ్బిన తర్వాత మూడు నాలుగు వారముల వరకును, అనగా ఉబ్బు పోయిన తర్వాత పది పండ్రెండు దినముల వరకును రోగి నుండి ఇతరులకు ఈ వ్యాధి అంట వచ్చును.

నివారించు పద్ధతులు

ఈ వ్వాధి నుండి సామాన్యంగా చావరు గనుక పరజలను శానిటరీ అధికారులును గూడ దీని విషయమై అంతగా లెక్క చేయరు. అయినను బడి పిల్లలలో ఈ వ్యాధి కనుపించిన యెడల వారలను వ్యాధి సోకిన దినము మొదలు ఇరువది నాలుగు దినముల వరకు బడికి రానీయ కూడదు.

కోరింత దగ్గు

కోడి పిల్లలను నులిమినట్లు నులిమి వేయుచు కో అను దీర్ఘస్వరముతో వచ్చు దగ్గుతో దీనిని అందరు సులభముగ గుర్తింప వచ్చును. గాలితో గాని ఋతువుతో గాని ఈ వ్వాధికి సంబంధమున్నట్టు కానరాదు. ఈ వ్యాధిని వ్యాపింప జేయు సూక్ష్మ జీవికి మానవ శరీరము గాక వేరెక్కడను నివాస స్థానము 198

ఉన్నట్టును తెలియదు. ఇది ప్రపంచమునందన్ని భాగముల యందును ఒక్కటే రీతిని చిరకాలమునుండి వ్యాపించుయున్నట్లు తోచు చున్నది. ఈ వ్యాధి యొక్క వ్యాపకమునకు అన్ని కాలములు సమానమైనప్పటికిన్ని ఇది వర్షకాలమునందును చలికాలమునందును రోగులను ఎక్కువగా బాధించును. మగ పిల్లలలో కంటే ఆడపిల్లలలో ఈ వ్యాధి హెచ్చుగ వ్యాపించునని తోచు చున్నది. ఎక్కడనో వయసు వచ్చిన వార్లకు కూడ వచ్చినను దీని వ్యాపకము పిల్లలోనే తరుచు, పెద్ద పిల్లలో కంటె పాలు గ్రాగు పిల్లలకు తక్కువగా ఉండునని చెప్పుదురు. రెండు మొదలు అయిదు సంవత్సరముల వయస్సు వచ్చు వరకు దీని వ్వాపకము హెచ్చుగ నుండును. తల్లి కడుపులో నున్నపుడే తల్లి నుండి పిండము ఈ వ్యాధిని సంపాదించుకొని పుట్టిన కొద్ది గంటలలో ఈ యొక్క లక్షణములన్నియు చూపుచు వ్యాధినొందిన బిడ్డలలో నిదర్శనములు గలవు. పిల్లలలో వలెనే పెద్ద వార్లలో గూడ మగ వాండ్లలో కంటే ఆడ వాండ్రలో ఈ వ్యాధి హెచ్చు. అందు ముఖ్యముగా గర్భిణీ స్త్రీలనిది హెచ్చుగ అంటు చున్నట్టు కనబడు చున్నది. పొంగు, ఆటలమ్మ, మొదలగు అంటు వ్వాధులున్న సమయముల లోనే కోరింత దగ్గు కూడ తరచు వ్యాపించు చుండుటకు కారణమింత వరకు తెలియలేదు.

నివారించు పద్ధతులు

ఈ వ్వాధిని కలిగించు సూక్ష్మ జీవి ఇంతవరకు నిశ్చయముగా తెలియ లేదు. ఇతర అంటు వ్యాధులందు వలెనే కొంత 199

దగ్గు గలవారిని కూడ ప్రత్యేక పరచి వ్యాధి గ్రస్తులుండు స్థలమును శుద్ధి చేయ వలయును. బడి పిల్లలలో ఈ వ్యాధి వచ్చిన యెడల వ్యాధి పూర్ణముగ నయమగు వరకు బడికి రానీయ కూడదు. ట్రాంబడ్ల లోనికిని, రైలు బండ్లలోనికిని, సభల లోనికిని వ్యాధి గ్రస్తులను రానీయ కూడదు. ఇంటి వారలును వైద్యులును వ్యాధిని అధికారులకు ప్రకటన చేయునట్లు చట్టము లేర్పడ వలెను. ఈ వ్యాధి అంటుటకు సమీప సంపర్కము అవశ్యముగ తోచు చున్నది గాన ఇరుగు పొరుగు ఇండ్ల పిల్లలను కోరింత దగ్గు గల పిల్లలతో ఆట్లాడ నీయ రాదు. కోరింత దగ్గు గల పిల్లలతో సంపర్కము గల పిల్లలను బడులలో చేర్చుకొనక పూర్వము పదునైదు దినముల వరకు శోధనలో వుంచ వలెను.

డెంగ్యూ జ్వరము

అకస్మాత్తుగ కీళ్లలోను, కండలలోను అమితమగు నొప్పితోను శరీర మంతయు ఒక విధమైన ఎర్రని దద్దుర్లతోను గూడిన మూడు నాలుగు నాళ్ళ జ్వరమునకు డెంగ్యూ జరమని పేరు. ఇది రోగిని బాధ పెట్టును గాని చంపదు. ఇది కొన్ని దేశములలో అప్పుడప్పుడు వచ్చు చుండును. కాని 1877 వ సంవత్సరము మొదలుకొని మూడు సారులు ఇది ప్రపంచమంతయు వ్వాపించినది. ఇన్ ప్లూయింజా జ్వరము తప్ప ఇంత వేగముగను ఒక్కొక్క ప్రదేశములో ఇంతమందికి ఒకటే సారి వ్యాపించు నట్టి జ్వరము మరొకటి లేదు. ఇది సామాన్యముగా ఉష్ణ ప్రదేశములలొ 200

వేసవి ప్రాంత మందు అధికముగ వ్యాపించును. చలి కాలము రాగానె తగ్గి పోవును. సముద్ర ప్రాంతములందును, పల్లపు భూముల యందును ఈ వ్యాధి మిట్ట ప్రదేశములలో కంటె హెచ్చుగ నుండును. మురికి వీధులును, జన సంఘములు గల పెద్ద పట్టణములలో ఇది మొట్టమొదట పుట్టి రహ దారీల వెంట అప్పుడప్పుడు పల్లెలకు చేరు చుండును. అన్ని వయసుల వారును స్త్రీలును, పురుషులును కూడ ఈ వ్యాధికి సమానులే. ఈ వ్యాధిని గలిగించు సూక్ష్మ జీవి ఇంకను నిశ్చయముగ తెలియ లేదు.

నివారించు పద్ధతులు

సాధ్యమైనను కాకున్నను, రోగిని ప్రత్యేక పరచుట, రోగి యుండు గదులను శుభ్రముగను వెచ్చగను చక్కని గాలి ప్రసరించునట్లు జేయుట, రోగి యుపయోగించిన బట్టలను వస్తువులను వెనుక ప్రకరణములలో చెప్పిన ప్రకారము శుద్ధి చేయుటకు ఇవియే ఈ వ్యాదిని వ్యాపింప జేయకుండుటకు ముఖ్య సాధనములు.

న్యూమోనియా (Pneumonia)

ఊపిరి తిత్తులు కఫ సంబంధమైన పదార్థములతో నిండి పోయి అకస్మాత్తుగ జ్వరము, ఊపిరాడక పోవుట మొదలగు లక్షణములతో సామాన్యముగ తొమ్మిది దినములుండు జ్వరమునకు న్యూమోనియా జ్వరమని పేరు. ఈ వ్యాధి జంట 201

చుక్కల వలె నుండు న్యూమో కాకస్ అను నొక విధమైన సూక్ష్మ జీవులచే కలుగు చున్నది. అధికమైన చలిగాలో గాని రాత్రులయందు మంచులో గాని వానలో గాని తిరిగిన వారికి వెంటనే ఇది అంటు కొనును. ఈ సూక్ష్మ జీవి ఆరోగ్యముగా నుండు వాని యుమ్మిలో గూడ సాధారణముగ కనబడుచుండును. ఏ కారణము చేతనైనను శరీరము యొక్క రక్షణ శక్తి తగ్గినపుడు ఈ సూక్ష్మ జీవి ఊపిరి తుత్తులలో ప్రవేశించి వ్యాధిని పుట్టించును. న్యూమోకాకస్ ఇన్ ప్లూయంజా, ప్లేగు టైఫాయిడ్ సూక్ష్మ జీవులు కూడ ఒకానొకప్పుడు ఒక విధమైన న్యూమొనియాను కలిగింప వచ్చును.

అప్పుడు ఊపిరి తిత్తులలో ఆయా సూక్ష్మ జీవులు ప్రత్యేకముగ గాని, న్యూమో కాకస్ తో చేరిగాని ఉండును. పల్లెటూరి వారికన్న పట్టణ వాసులు రెండింతలు అధికముగా బాధ పడుదురు.

పట్టణ వాసులకు న్యూమోనియా భయము పల్లెలలో వారి కంటే హెచ్చుగ నుండును. అన్ని వయసుల వారికిని సామాన్యముగ ఒకటే విధముగా నంటును. కాని బిడ్డలకు అంటి నపుడు మరణములు హెచ్చుగ నుండును. ఇంటిలో నుండు ఆడవారి కంటే బయట వెళ్ళి వ్యవహరించు మగవారికి ఈ వ్యాధి హెచ్చుగ అంటును. అధికాయాసములు, వీధులలోని దుమ్ము, చలిగాలి, తడి, ఇవన్నియు ఈ వ్యాధి యొక్క వ్యాపకములకు సహకారులగు చున్నవి. 202

నివారించు పద్ధతులు

ఇది వ్వాపించు విధము కొంతవరకు మనకు తెలిసి యున్నది. కనుక ఆ మార్గములలో పడకుండ ప్రయత్నించుటయే గాక దీనిని నివారించు ముఖ్య పద్ధతి .... నివసించు ఇండ్లు శుభ్రముగ నుంచుట, పట్టణము శుభ్రముగ నుంచు కొనుట, శరీరమును శుభ్రముగ నుంచు కొనుట, న్యూమోనియా రోగుల కఫము నెప్పటి కప్పుడు శుద్ధి చేసి కొనుట, ఇవియే నివారించు పద్ధతులు. గాలి మూలమున వ్యాపించు వ్యాధుల కన్నిటిని అవలంబించ వలయును. న్యూమోనియా రాకుండ నివారించుటకు టీకా రసమును ఇప్పడిప్పుడు కనిపెట్టుచున్నారు. వీని యుపయోగమును గూర్చి ఇంకను నిశ్చయముగ జెప్పుటకు వీలు లేదు.

ఇన్‌ఫ్లూయింజా

మనకు తెలిసిన అంటు వ్యాధులలో ప్రపంచ మంతయు ఒక్కసారి ముట్టించునది ఇన్ ప్లూయింజా జ్వరమని చెప్పవచ్చును. ఈ జ్వరము తనంతట తాను మనుష్యులను చంపదు. కాని తన వలన కలిగిన బలహీత స్థితి యందు ఇతర వ్యాధులను గలిగించి రోగిని లొంగదీయును. ఇదియును డెంగ్యూ జ్వరము వలెనే అకస్మాత్తుగ వచ్చును కాని జ్వరము దానంత తీవ్రముగా నుండదు. ఇన్ ప్లూయింజా యందు దగ్గు, పడిశము, చలి, ఈ లక్షణము అధికముగా నుండును. డెంగ్యూ జ్వరము 203

లోనున్న దద్దు ఇన్ ప్లూయింజాలో నుండదు. ఒక వేళ చెమట వలన కలిగిన పొక్కులుండినను అది దద్దుమాదిరి నుండదు.

వ్యాపించు విధము

బెర్లిన్ పట్టణ వాస్తవ్యుడగు షేపర్ అను నతడు ఇన్ ప్లూయింజా జ్వరమును కలిగించు సూక్ష్మ జీవిని కనిపెట్టెను. ఈ సూక్ష్మ జీవి యెండవలన అయిదు నిముషములలో చచ్చి పోవును. ఈ జ్వరము వచ్చినపుడు సామాన్యముగా ఇంటిలో ఒక్కని కూడ విడువదు. పిల్లలు, పెద్దలు అందరును దీనికి సమానమే. 1891 వ. సంవత్సరమున ఈ వ్యాధి చీనా దేశమున బుట్టి, పసిఫిక్ సముద్రము మీదుగా అమెరికాకు పోయి, అచ్చటనుండి ఐరోపాకు వ్యాపించెను. ఇట్లు ప్రపంచమునందంటను వ్యాపించిన దీని వ్యాపకమును గూర్చి మూడు సిద్ధాంతలులు కలవు. గాలిలో నుండు దుమ్ము నాశ్రయించి తుపానులును పెద్దగాలియు వచ్చి నపుడు ఈ జ్వరమును బుట్టించు సూక్ష్మ జీవులు ఒక దేశము నుండి మరియొక దేశమునకు వెళ్ళునని కొందరును, వ్యాధికి కారణముగాని సూక్ష్మ జీవులు కావని మరి కొందరును, మశూచికము పొంగు మొదలగు వ్యాధుల వలే ఒక రోగినుండి మరియొక రోగికి ఏదో ఒక విధమైన సంపర్కము మూలముననే వచ్చునని మరి కొందరును చెప్పుచున్నారు. సామాన్యముగా ఒక మనిషి నుండి మరియొక మనిషికి సమీప సంపర్కమున్నపుడే ఇది హెచ్చుగ వ్యాపించు చున్నట్లు తోచు చున్నది. కాని ఒక 204

మనిషి తానీ వ్యాధిని బొందకుండగనే ఒక రోగి నుండి మరియొకనికి అంటించ గలిగి నట్లు నిదర్శనములు గలవు. ఓడలలోని సామానుల మూలమున ఈ వ్యాధి యొక దేశమునుండి మరియొక దేసమునకు వ్వాపింప గలిగినట్లును నిదర్శనములు గలవు. ఋతువుగాని దేశము యొక్క సీతోష్ణస్థితి గాని నమ సమ్మర్థము గాని గాలి వెల్తురు మొదలగునవి కాని ఈ వ్యాధి యొక్క వ్యాపకముతో అంతా సంబంధము గలిగి యునట్లు తోచదు. క్రిక్కిరిసి యుండు పట్టణము లందెట్లో విశాలముగ నుండు నారామములయందట్లే ఈ జ్వరము వ్యాపించు చున్నది. మశూచకము, ఆటలమ్మ మొదలగు వ్యాధుల వ్యాపకమునకును దీని వ్యాపకమునకును గల బేధములలో ఇది ముఖ్యమైనది.

నివారించు పద్ధతులు

ఒక సారి వచ్చిన వానికి ఈ వ్యాధి తిరిగరాదని లేదు. బహుశః ఒక సారి దీని పాలనన బడిన వాడు అనేక సారులు బడునని తోచు చున్నది.

(1) ఇంటిలో నొకనికి వ్యాధి వచ్చిన వెంటనే రోగిని ప్రత్యేక పరచి రోగితో ఇతరుల సంపర్కము తగ్గించ వలెను.

(2) ఉమ్మి, చీమిడి, తెమడ మొదలగునవి ఇండ్లలో గాని పని యేయు స్థలములో గాని గోడల మీదను గుడ్డల మీదగాని పడి ఎండి పోనీయరాదు. సాధ్యమైనంత వరకు కాగితములలో గాని శుబ్రమైన పాత గుడ్డలలో గాని వీనిని చేర్చి తగుల బెట్ట 205

వలెను. లేని యెడల రోగి సంపర్కముగల ప్రతి పదార్థమును పండ్రెండు పదమూడు ప్రకరణములలో చూపిన ప్రకారము శుద్ధి చేయ వలెను. వ్వాధి తగిలిన వారలు పది దినములవరకు జన సంఘములతో కూడ రాదు. వ్యాధి బలమధికముగ నున్న యెడల ఒక్కొకచో మూడు వారముల వరకు రోగి ఇతరులతో కూడరాదు.

(3) ఈ వ్యాధి వ్యాపించి యుండు దినములలో ఇండ్లను ఫ్యాక్టరీలను మిక్కిలి శుభ్రముగ వుంచుకొన వలెను. తలుపు లన్నియు తెరచి గాలియు వెలుతురును చక్కగ ప్రసరించు నట్లు చూచుకొన వలెను.