హైందవ స్వరాజ్యము/పదునాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునాల్గవ ప్రకరణము.


భారతభూమి స్వతంత్ర మెట్లగును.


చదువరి: నాగరికమునుగురించి మీరు చెప్పిన యభిప్రాయము లర్థమయినవి. నేను వానిని గురించి మననము చేసికొందును. అంతయు నొక్క పర్యాయముగా మ్రింగజాలను. ఇట్టి యభిప్రాయములుగల వారు భారతభూమిని స్వతంత్రము చేయుట కేమి మార్గము చెప్పుదురోయని యెదురు చూచుచున్నాను.


సంపా: నాయభిప్రాయము లొక్కపెట్టున అంగీకృతము లగునని నేను నమ్మువాడను కాను. మీబోటి చదువరులకు నివేదించుటమాత్రము నాధన్మము. కాలము తక్కుంగల పనిని నెరవేర్చును. భారత భూమిని స్వతంత్ర మొసర్చు స్థితిగతులిదివరకే వివరించినాము. ఆవివరణమంతయు నేరుగా చేసినది కాదు కావున ఇప్పుడట్లు చేసిచూపెదను. రోగకారణమును నశింపచేసిన రోగము నశించుననుట లోకములో అందరకును విశదమయిన సిద్ధాంతమే. అట్లే భారతభూమి దాస్యమునకు కారణమేదో ఆ కారణమును తొలగించిన యెడల దాస్యమును తొలగుననుట నిజము.
80

హైందవ స్వరాజ్యము.


చదువరి: భారతనాగరకమే లోకములో నుత్తమమయిన యెడల భారత భూమికి దాస్య మెట్లు కలిగినది !.


చదువరి: ఈనాగరకము ఉత్తమమనుట నిర్వివాదాంశము. అయిన ఒక్కటి . గ్నాపకముంచుకొనవలెను. అన్ని నాగరకము లును వ్యవహారమున పరీక్షితము లగుచున్నవి. ఏది అచలమో అదియన్నిటిని గెలిచి స్థిరపడగలదు. హైందవ పుత్రులు చలించు టను జేసి భారత నాగరకము ఇక్కట్టుల బడిన ది. ఎన్ని మహాత రంగములు వచ్చినను కొట్టుకొనిపోవక నిలచుట చేతనే దీనిశ క్తి యిట్టిదని బయల్పడుచున్నది. అంతేకాక భారతభూమి యంత యుగూడ ఇంకను నీ వ్యవహార పరీక్షలోనికి రాలేదు. పాశ్చాత్యనా గరకము సోకినవారు మాత్రము దానికి దాసులైనారు.మానవు డెప్పుడును మహాప్రపంచమును తన జేనడే యని తలంచుట స్వ భావసిద్ధము.మనము దాసులైనప్పుడు లోకమంతయు దాస్యము నందినట్లే మనకు దోచును. మన మధోగతిలో నుండుటనుబట్టి భారతభూమి యంతయు అ దేగతిలో నున్నట్లుమనము తలపోయు చున్నాము. నిజమరయగా అట్టి స్థితి లేదు. పై సంగతులన్నియు మరువని యెడల మనము స్వతంత్రులమయిన యెడల భారతభూ మియు స్వతంత్రయగును. ఈ భావమే స్వరాజ్య శబ్దమునకు నిర్వ చనమును స్థాపించుచున్నది. మనలను మనము పరిపాలించుకొను యోగ్యత కలిగినప్పుడు మనకు స్వరాజ్యము తప్పక వచ్చినదే. కాబట్టి అవి మనకు నిజముగా కరతలామలకము. ఈస్వరాజ్య ము కలపోలినదని యనుకొని ఊరక కూర్చొనుట పొసగదు. నేను చెప్పునట్టరూపముగల స్వరాజ్యమును ఒక్కవర్యాయము మనముసంపాదించిన యెడల అందరును దానిని సంపాదించునట్టు మనము ఎల్లప్పుడును ప్రోత్సహింపగలము. దాని స్వభావమే యిట్టిది. అయిస ఆస్వరాజ్యమును ఒక్కొక్కడును ఆత్మాను భవము చేత సంసాదింపవలసియున్నాడు. నీటమునిగి పోనుండు నాడు అడినే మరియొక నిని ఎప్పుడును తరింప జేయ లేడు. మనము దాసులుగా నున్నంతకాలము ఇతరుల దాస్యమును పోనాడుట కాలోచించుట వట్టిదంభము. ఈ కారణముల నాలో చించిన యెడల మనము ఇంగ్లీషువారిని వెడలగొట్టు నాదర్శము పెట్టుకొనుట అవసరమే కాదు. ఇంగ్లీషువారు భారతీయులగుదు రేని వారికిని ఇందు తావుగలదు. వారి నాగరకము నుంచుకొని వారిక్కడ నుండదలంతు లేనివారి కిక్కడ తావు లేదు. అట్టిపరి స్థితులను సృష్టించుశక్తి మనలో నున్నది.


చదువరి: ఇంగ్లీషు వారు భారతీయు లెన్నటికిని కాజాలరు.

సంపా: అట్లనరాదు. ఇంగ్లీషు వారిలో మానుషత్వము లేదన వచ్చునా ? వారు తమరీతిని మానుదురా లేదా యనుట ప్రస్తుత మున కవసరముకాదు, మన యిల్లు మనము చక్కగా పెట్టు

గొనినయెడల అందులో నివసింపగలవా రే నివసింతురు.తక్కుం
82

హైదవ స్వరాజ్యము'.


గలవారు తమకు తామే వెడలి పోదురు. ఇట్టిది మసయనుభవ ములో జరుగుచునే యున్నది.


చమవరి: చరిత్రలో ఇట్టి దెక్కడను జగ లేదు.


సంపా: చరిత్రలో జరగనిది జరగనే జరగదనుట మాన వుని గౌరమును సంశయించుటయగును. మనకు సకారణమని తోచుదానిని ప్రయత్నించుట మసధర్మము, అన్ని దేశముల పరి స్థితులును ఒక్కటేకాదు. భారత భూమిస్థితి చిత్రముగా ప్రత్యే ము. దాని శక్తి అనంతము, కాబట్టి యితర దేశచరిత్రలతో ఈ భూమిని పోల్చనక్కర లేదు. ఇత నాగరకములు నశించినవి కాని భారత నాగరకము కాలుదున్ని నిలచిదను సంసంగతి యిది వరలో నె చెప్పియున్నాను.


చదువరి: ఇవి నాకర్థముకాలేదు. ముష్టిబ లముచేత ఇంగ్లీ ష్హువారిని పెడలగొట్టవలెనుట నిర్వివాదాంశముగా నున్నది. వారు 'దేశములో నున్నంత కాలము మనకు శాంతికలుగదు. మన కవీశ్వరులలో నొక్కడు దాసులు స్వాతంత్ర్యములను గురించి కలనైనకనరాదనుచున్నాడు. ఇంగ్లీషు వారిచ్చట నుం డుటచేత మనము దినదిసము బలహీనుల మగుచున్నాము. మన ప్రతిభ యంతయు పోయినది. మన ప్రజను చూచిన భయాక్రాం తుల వలె కన్పించుచున్నాడు. ఇంగ్లీషువారు దేశములో మహా కష్టమువలె నున్నారు. ఈ మహారీష్టమను అన్ని యుపాయముల ను తొలగింపపలెను,

83

భారతమామి స్వతంత్ర మెట్లగును.


సంపా: మీ ఉద్రేకములో ఇంత సేపు మనము చేసిన విమర్శ యంతయు మరచిపోయినారు. మనము ఇంగ్లీషు వారిని తెచ్చు కొనినాము. మన మే నిలుపుకొనుచున్నాము. వారు ఇక్కడ ఉండుటకు ముఖ్యకారణము మనమువారి నాగరకమును అవలం బించుటయే యనునదిమీరేల మరచెదరు? వారియెడ మూకుగల ద్వేషము వారి నాగరకమునెడకు మరల్చవలసి యున్నది. వాదముకొరకు యుద్ధము చేసియే ఇంగ్లీషు వారిని వెళ్ల గొట్టవలెనని యొప్పుకొందము. అది యెట్లు జరుగవలె?


చదుషరి: ఇటలీ చేసినట్లే మనము చేయవలెను. బెజెనీ గారి బాల్డీలకు సాధ్యమయినది మనకు సాధ్యము కాకపోదు, వారు మహాపురుషులు కారని మీ కనబోరుగదా !