సీతా కళ్యాణ వైభోగమే

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

శంకరాభరణము - ఖండలఘువు


పల్లవి

సీతా కళ్యాణ వైభోగమే

రామ కళ్యాణ వైభోగమే | | సీతా | |

అనుపల్లవి

పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర

రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర | | సీతా | |


చరణము 1

భక్తజన పరిపాల భరిత శరజాల

భుక్తి ముక్తిద లీల భూదేవ పాల | | సీతా | |


చరణము 2

పామరా సురభీమ పరిపూర్ణ కామ

శ్యామ జగదభిరామ సాకేతధామ | | సీతా | |


చరణము 3

సర్వలోకాధార సమరైకధీర

గర్వమానసదూర కనకాగధీర | | సీతా | |


చరణము 4

నిగమాగమ విహార నిరుపమ శరీర

నగధ విఘవిదార నత లోకాధార | | సీతా | |


చరణము 5

పరమేశనుత గీత భవజలధి పోత

తరణికుల సంజాత త్యాగరాజనుత | | సీతా | |