వర రాగ లయజ్ఞులు దామనుచు
Wikisource నుండి
| త్యాగరాజు కృతులు |
చెంచుకాంభోజి రాగం - దేశాది తాళం
- పల్లవి
వర రాగ లయజ్ఞులు దామనుచు - వదరెదరయా
- అనుపల్లవి
స్వర జాతి మూర్ఛన భేదములు
స్వాంతమందు దెలియక యుండిన
- చరణము
దేహోద్భవంబగు నాదములు -
దివ్యమౌ ప్రణవాకార మను
దేహం బెఱుగని మానవులు,
త్యాగరాజనుత ! యేచెదరు, రామ !