లేకయా నిన్ను జుట్టుకొన్నారు
Wikisource నుండి
| త్యాగరాజు కృతులు |
అసావేరి రాగం - ఆది తాళం
- పల్లవి
లేకయా నిన్ను జుట్టుకొన్నారు ?
ఏకహృదయులై నిత్యానందము
- అనుపల్లవి
శ్రీకర ! కరుణాసాగర ! నిరుపమ
చిన్మయా ! శ్రిత చింతామణి ! నీయెడ
- చరణము 1
సౌందర్యములలో సుఖము సీతమ్మకు,
సౌమిత్రికి గనుల జాడల సుఖము
- చరణము 2
సుందర ముఖమున సుఖము భరతునికి,
సుజ్ఞాన రూపమున సుఖము రిపుఘ్నునికి
- చరణము 3
చరణ యుగమునందు సుఖమాంజనేయునికి
వరగుణ త్యాగరాజ వరదా ! నందము