పుట:Womeninthesmrtis026349mbp.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

స్మృతికాలపుస్త్రీలు

ఏడు పురుషముల వఱకును సపిండత యుండును గాన మాతృవంశమున నేడుతరములలో జన్మ గల్గిన కన్యను వివాహమాడ రాదని తేలుచున్నది.

మాతృవంశమున నైదు తరముల నియమము చాలునని కొన్ని స్మృతులు చెప్పుచున్నవి.

మాతృబంధుభ్యశ్చ పంచమాత్

(గౌ.ధ.సూ. 4-5)

(అయిదు తరములలోని మాతృ బంధువులయింటి కన్యను వివాహ మాడరాదు.)

పితృవంశమున నేడు తరముల వఱకును సంబంధము లేని కన్యను చేసికొనవలెనను నియమము కూడ కలదు.

పంచమాత్సప్త పిండాదూర్థ్వం మాతృతః పితృత స్తథా

(యాజ్ఞ 1-54)

పంచమీం మాతృబంధుభ్యః సప్తమీం పితృబంధుభ్యః

(వసి.8-2)

మాతృతః పంచమీం పితృతః సప్తమీం

(లిఖిత 4-1)

మేనత్త మేనమామ బిడ్డలను వివాహ మాడరాదని దీనివలన తేలుచునేయున్నను మనువీ యంశమునీ విధముగ స్పష్టముగ వక్కాణించు చున్నాడు.

    పైతృష్వసేయీం భగినీం స్వస్రీయాం మాతురేవచ
    మాతుశ్చభ్రాతుస్తనయాం గత్వాచాంద్రాయణంచరేత్