పుట:Womeninthesmrtis026349mbp.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాధ్యాయము

35

    శూద్రావేదీపతత్యత్రేరుతధ్యతసయస్యచ
    శౌనకస్యసుతోత్పత్యా తదపత్యతయాభృగో:
(మను 3-16)

ఈ శూద్ర భార్యనుగూర్చి యభిప్రాయ బేధములున్న నవియంగీకరించుచు యాజ్ఞవల్క్యు డిట్లు చెప్పుచున్నాడు.

    యదుత్యతే ద్విజాతీనాం శూద్రాద్దారోప సంగ్రహ:
    నైతన్మమమతం యస్మాత్తత్రాత్మా జాయతేస్వయం
(యాజ్ఞ 1-56)

(శూద్రకులమునుండి భార్యను తీసికొనవచ్చుదని చెప్పబడు నంశము నాకు సమ్మతము కాదు. ఏలన: భార్యయందు తానే పుట్టుచున్నాడు.)

మన ప్రస్తుతాంశము వర్ణములను గుఱించి కాక స్త్రీల వివాహమును గుఱించి మాత్రమే యగుటచే వర్ణాన్తర వివాహ విషయక చర్చ నింతటితో ముగింపవచ్చును.

వధూవర నిర్ణయములో గోత్రప్రవరలు చాల ముఖ్యముగ విచారింపబడవలసి యున్నవి.

    అసపిండాచయామాతురసగోత్రాచయాపితు:
    సాప్రశస్తాద్విజాతీనాం దారకర్మణిమైథునే
(మను3-5)

(తల్లికి సపిండురాలు గానట్టియు, తండ్రికి సగోత్రరాలు కానట్టియు స్త్రీ ద్విజునకు వివాహమునకు ప్రశస్తురాలు.)