పుట:Womeninthesmrtis026349mbp.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

స్మృతికాలపుస్త్రీలు

ఇక పురుషుని వివాహవయస్సునుగూడ నించుక పరికింతము. పురుషుడు సుమారిరువదియైదవయేట వివాహము చేసికొనవలెనని స్మృతుల యభిప్రాయమైనట్లు తోచుచున్నది. ఎట్లన: ఆయుస్సులోని రెండవభాగము గృహస్థాశ్రమములో నడుపవలెనని చెప్పబడినది.

ద్వితీయమాయుషోభాగం కృతదారోగృహేవనేత్.

(మ 5-169)

'శతమానంభవతి' మున్నగు ప్రాచీనాభిప్రాయములను బట్టి నూరేండ్లు మానవుని యాయుఃప్రమాణమగుచో నందు నాల్గాశ్రమములకు (బ్రహ్మచారీగృహస్థోభిక్షు వైఖానసః.గౌ.) నాల్గుభాగములగుచో నొక్కొకభాగమున కిరువదియైదేండ్లు వచ్చును. ఈ యూహ సరియైనదే యనుటకు మఱొక యాధారము చూపవచ్చును. అదియేదన: ఈ లెక్క ననుసరించియే బదవయేట వానప్రస్థములో చేరవలసియుండును. వివాహమైన కొలదికాలమునకే కుమారుడు కల్గుచో నాకుమారునకు పాతికేండ్లువచ్చి యాతనికి వివాహమై కుమారుడు కల్గునప్పటికి తనకేబదేండ్లువచ్చును. అంత నాయువుయొక్క మూడవభాగమువచ్చును. అదియే వానప్రస్థములో ప్రవేశింపవలసిన కాలము గదా! అప్పటికి మనుమడు కల్గియుండవలెనని స్మృతులలో నున్నది.