పుట:Womeninthesmrtis026349mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

స్మృతికాలపుస్త్రీలు

(కుమాళ్లనిమ్ము ధనమునిమ్ము)

పుత్రేణ లోకాన్ జయతి పౌత్రేణానంత్యమశ్ను తే

అథ పుత్రిస్య పౌత్రేణ బ్ర్ధ్నస్యాప్నోతి విష్టవం

(మను 9-137)

(పుత్రునిచేత లోకములను జయించుచున్నాడు. పౌత్రునిచే నావంశ్యము నొందుచున్నాడు. పుత్రుని పౌత్రునిచే సూర్యమండలము పొందుచున్నాడు.)

అంతియే కాదు, పుత్రులనుకనక కేవలము స్త్రీలనే కనుచున్న భార్యను పదేండ్లుచూచి పదునొకండవయేట మఱొక భార్యను చేసికొనవలెనని మనుస్మృతి స్పష్టముగ చెప్పుచున్నది.

(పునర్వివాహమను నధ్యాయము చూడుడు)

ఆడపిల్ల మఱొకని గోత్రములోనికి పోవుటయు మఱొకని సొత్తగుటయు ('దాంపత్యము' చూడుడు) మున్నగు నెన్నియో హేతువులవలన స్త్రీపురుష సంతతులపట్ల నీదృక్పథ భేదము బయలు దేరినది. అయినను పుత్రులు లేనపుడాస్థానము నాక్రమించుటకు కుమార్తె యర్హురాలనుట సహజముగనే యున్నది కాని స్వయముగ తనకు జన్మించిన కుమార్తెవలన గాక యామెకు జన్మించిన కుమారునివలన నే పురుషుడు తరించునని స్మృతులు చెప్పుచుండుటచే నవి స్త్రీ సంతతికంటె పురుషసంతతియొక్క ప్రాధాన్యము నెంత హెచ్చుగ నంగీకరించినవో స్పష్టమగుచున్నది.