పుట:Womeninthesmrtis026349mbp.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాధ్యాయము

5

(స్త్రీథనము, అను ప్రకరణము చూడనగును) కాని యపుత్రకుని ధనము నామెయే కాని మఱొకరు పొందజాలరని చెప్పుచున్నది.

తస్యాత్మనితిష్ఠన్త్యాం కథమన్యోధనం హరేత్
                                    (మను 9-130)

(ఆతని రూపమే యైయున్న, యాతనికుమార్తె యుండగా మఱొకడెట్లు ధనము హరించును?)

సపుత్రకుని ధనములో కుమార్తెకు భాగమేలేదను సంశమునకై 'స్త్రీధన'మను ప్రకరణము చూడవచ్చును.

పుత్రులు లేనపుడే కుమార్తెకును నామె పుత్రునకును నిట్టి ప్రాముఖ్యము కలదుగాని పుత్రులున్నచో లేదను నంశము ప్రధానమైనది. నారదుడు కూడ

పుత్రాభా వేతుదుహితాతుల్య సంతాన కారణాత్
పుత్రశ్చ దుహితాచో భౌపితుస్సంతాన కారకౌ

(కుమారుడు లేనపుడు కూతురాతనివలెనే సంతాన కారకురాలు గాన నాతని స్థానముననుండును. పుత్రుడును కుమార్తెయు కూడ తండ్రి సంతానకారకులే కదా!)

కావుననే స్మృతులలో పుత్రప్రాప్తియే ముఖ్యముగ ప్రశంసింపబడినది.

పుత్రాన్దేహి ధనం దేహి
                                              (యాజ్ఞ 1-201)