పుట:Womeninthesmrtis026349mbp.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ఆతడామెను పొందును' (అథైనాముపైతి 1-7-44) అని చెప్పియున్నాడు. ఇదియే రెండవ సమావేశనము. ఇచటి నుండి యనిషిద్ధ దినములలో భార్యను పొందుచుండవలెను. వివాహాంగమైన సమావేశనమునకు పిమ్మటనే ఋతుమతి విషయము ప్రస్తావింపబడుటచే వివాహములో సమావేశనమును విధించిన బోధాయనాదుల మతములోగూడ కన్యదృష్ట రజస్కకాదని తేలుచున్నది. వివాహము దృష్టరజస్కకే ఋత్వితరకాలములో జరుగుచో గూడనిటి ప్రస్తావన కవకాశమున్నది కాదాయనుటకు వీలులేదు. ఏలన నిట పేర్కొనబడిన రజోదర్శనము ప్రథమమే యనుటకు నిటనీయబడిన రజస్వలా నియమములే సాక్ష్యములు. (1-7-22 నుండి 36 వఱకు) ఈవిషయములు వివాహముకాని స్త్రీ రజస్వలయైనను పాటింపవలసినవే కాన వాని నిచటనే చెప్పుటచే వివాహమైనపిమ్మటనే రజస్వలయగుటయే బోధాయనుని దృష్టిలో క్రమమని తేలుచున్నది.

ఆపస్తంబుడు సమావేశనమును వివాహాంగముగ విధింపలేదని యిదివఱలో చూచియుంటిమి. సమావేశనము వివాహాంగమా కాదాయను నంశమున ఋషులలో నభిప్రాయ భేదమున్నట్లు గోభిలగృహ్యసూత్రము చెప్పుచున్నది.

          ఊర్థ్వంత్రిరాత్రాత్ సంభవ ఇత్యేకే
                                (గో. గృ. సూ. 2-5-7)