పుట:Womeninthesmrtis026349mbp.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

స్మృతికాలపుస్త్రీలు

యామె చెడిపోవుట కొక హేతువనియు కాన సాధారణముగ భార్యాభర్త లొండొరులను వీడరాదనియు నాతడు చెఫ్ఫుచున్నాడు.

    తథానిత్యం యతేయాతాం స్త్రీపుంసౌతుకృతక్రియౌ
    యథానాభిచరేతాంతౌ వియుక్తావితరేతరం
(మను. 9-102)

(స్త్రీ పురుషు లెల్లపుడును కలసియుండి వారి కృత్యములను చేసికొను చుండవలెను. ఒకరినుండి యొకరు వియోగము చెంది వ్యభిచరింపకుండునట్లు కూడ యత్నింపవలెను.)

భర్తను విడచి యుండుటయు పొరుగిండ్ల వసించుటయు ముఖ్యముగ స్త్రీని పాడుచేయును.

    పానం దుర్జననంసర్గః పత్యాచవిరహోటనం
    స్వప్నోస్య గేహవాసశ్చ నారీసందోషణానిషట్
(మను. 9-13)

(మద్యపానము, దుర్జన సహవాసము, భర్తను విడచియుండుట, తిరుగుచుండుట, అతినిద్ర, యితరుని యింట నుండుట - యీ యాఱును స్త్రీని పాడుచేయును.)

ఏదైన కార్యములపై భర్త యెచటికైనను నివసింప వలసి వచ్చినచో భార్యకు తాను తిరిగి వచ్చువఱకు నన్న వస్త్రాదులకు లోటు లేకుండునట్లు చేసి పోవలెను. ఏమన: స్వతస్సిద్ధముగ మంచి స్త్రీయైనను గూడ నన్నవస్త్రములు లేనపుడు ధనమునకై పరపురుషుని పొందును.