పుట:Womeninthesmrtis026349mbp.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకాదశాధ్యాయము

195

నిరంతరము బలాత్కారముగ స్త్రీలను కాపాడుట యసంభవమని మను వెఱుగును. వారి కేవో కొన్ని వ్యాపారములు కల్పించినచో కొంత రక్షణ యగునని యాతని తలంపు.

     నకశ్చిద్యోషితశ్శక్తః ప్రసహ్య పరిరక్షితుం
     ఏతైరుపాయ యోగైస్తు శక్యాస్తాః పరిరక్షితుం
     అర్థస్య సంగ్రహేచైనాం వ్యయే చైవనియోజయేత్
     శౌచేధర్మే౽న్నపంక్త్యాంచ పారీణహ్యస్యచేక్షణే
     అరక్షితా గృహేరుద్ధాః పురుషైరాప్తకారిభిః
     ఆత్మానమాత్మనాయాస్తు రక్షేయుస్తాస్సు రక్షితాః
(మను. 9-10, 11, 12)

(ఎవడును స్త్రీని బలవంతముగ రక్షింపజాలడు. ఈయుపాయములచే వారిని రక్షింపవచ్చును. ధనము గాపాడుట, వ్యయముచేయుట, గృహపారిశుద్ధ్యము గాపాడుట, ధర్మముల జేయుట, భోజనవిషయము చూచుట, గృహోపకరణములు కాపాడుట - అను వానిలో నామెను నియోగింపవలెను. పురుషులచే గృహములో నిర్భంధింపబడిన వారు రక్షింపబడని వారే. ఎవరు తమ్ముతామే కాపాడుకొనుచున్నారో వారే బాగుగ రక్షింపబడిన వారగుచున్నారు.)

ఆత్మరక్షణమే శ్రేష్ఠమని మను విట్లు చెప్పుచున్నను పురుషు డామెను గాపాడుటలోని యావశ్యకమును గూడ గుర్తించుచున్నాడు. భర్త భార్యను విడచియుండుటయే