పుట:Womeninthesmrtis026349mbp.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

స్మృతికాలపుస్త్రీలు

     పితృవేశ్మని కన్యాతు యం పుత్రంజనయేద్రహః
     తంకానీనం వదేన్నామ్నావోఢుః కన్యాసముద్భవం
(మను. 9-172)

(కన్యకు తండ్రియింట పుట్టిన పుత్రుడామెను వివాహ మాడినవాని కానీన పుత్రుడని చెప్పబడుచున్నాడు.)

    యాగర్భిణీసంస్క్రియతే జ్ఞాతా౽జ్ఞాతాపివాసతీ
    వోఢుస్సగర్భోభవతి నహోఢఇతి చోచ్యతే.
(మను. 9-178)

(గర్భిణిగా నున్న దానిని వివాహమాడువాని కాగర్భిణికి పుట్టినవాడు సహోఢుడను పుత్రుడగును.)

    యావత్యావా పరిత్యక్తా విధవావాస్వయేచ్ఛయా
    ఉత్పాదయేత్పు నర్భూత్వాసపౌనర్భవ ఉచ్యతే.
(మను. 9-176)

(పతిపరిత్యక్తగాని వితంతువుగాని మఱొకని పొంది కనిన పుత్రుడు పౌనర్భవుడు.)

ఇట్టిపుత్రులవలన పరలోకమున నేమియు లాభముండదని మనువు చెప్పుచున్నాడు.

    యాదృశం ఫలమాప్నోతికుప్ల వైస్సంతరన్ జలం
    తాదృశం ఫలమాప్నోతి కుపుత్రైస్సంతరం స్తమః
(మను. 9-161)

(సముద్రమును పనికిమాలిన దోనెతో దాటయత్నించుటవలన నెట్టిఫలముండునో పైన పేర్కొనబడిన కుపుత్రుల