పుట:Womeninthesmrtis026349mbp.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పలేదు. అట్లే నా యాశయములకు భిన్నములగు స్మృతివాక్యములను వేనిని బుద్ధిపూర్వకముగ వదలివేయలేదు. కాన నేను చెప్పినయర్థములలోని లోపములనుగాని నేను వదలివైచిన ముఖ్యములగు స్మృతివాక్యములను గాని యెవరైనను నా దృష్టిపథమునకు తెచ్చుచో నా లోపములను తగువిధమున సవరించుకొందును.

గ్రంథము ముద్రణములోనున్న కాలములో గూడ నదివఱలో నాదృష్టినుండి తప్పిపోయిన కొన్ని స్మృతివాక్యములు నాకు కన్పట్టుచుండినందువలనను కొన్ని వాక్యములకు నూతనార్థములు స్ఫురించుచుండినందువలనను రెండవప్రూపులో గూడ చాల సవరణలు చేయుచువచ్చితిని. అన్నిటికిని నోపికపట్టి గ్రంథమును చక్కగ ముద్రించిన శ్రీ సరస్వతీ పవర్ ప్రెస్సు వారికి కృతజ్ఞుడను. గ్రంథము పూర్తిగా ముద్రింపబడిన పిమ్మట గూడ కొలది సవరణలను జేయవలసిన యావశ్యకత నాకు గన్పట్టినది. కాన నొక సవరణలపట్టికను గ్రంథా స్తమున వేసితిని. మూలగ్రంథముద్రణము పూర్తియగువఱకును సిద్ధాన్తమును చేసికొనకుండ నన్ను కలవరపఱచిన సమావేశన స్త్రీ పునర్వివాహ విషయకములగు కొన్ని యంశములను గూడ నిందు చేర్చితిని.