పుట:Womeninthesmrtis026349mbp.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాధ్యాయము

89

భార్యాగమనాది ధర్మావిరుద్ధకామానుభవాధికారము గలదు. ఇది యంతయు భార్య యున్నంతమాత్రముననే జరుగదు. ఆమె వశవర్తినియై యుండుట యవసరము. ధర్మకార్యములలో పాల్గొనుట కామె నిరాకరించి గృహనిర్వహణము చక్కగ చేయక, భర్తకు భోగములకు వీలుగల్గింపనిచో పురుషుడు ధర్మార్థకామములనెడు త్రివర్గమునుండి భ్రష్టుడగు చున్నాడు.

    గృహాశ్రమ నమంనాస్తి యది భార్యా వశానుగా
    తయా ధర్మార్థ కామానాం త్రివర్గఫలమన్ను తే
(దక్ష1-1,2)

(భార్య వశురాలైనచో గృహాశ్రమముతో సమానమైన యాశ్రమము లేదు. పురుషు డామె మూలమున ధర్మార్థ కామముల ఫలము నొందుచున్నాడు.)

కావుననే యాజ్ఞవల్క్యుడు గూడ

యత్రానుకూల్యం దంపత్యో స్త్రివర్గస్తత్రవర్తతే

(యాజ్ఞ 1-5)

(దంపతుల కానుకూల్య ముండుచోట ధర్మార్థకామము లుండును.)

ప్రథమాధ్యాయములో తెలుపబడినట్లు పురుషునకు నరకనివారణమును పుణ్యలోకప్రాప్తిని గల్గించు పుత్రుని గూడ భార్యయే యిచ్చుచున్న దనుటచే నామె ప్రాముఖ్యము స్పష్ట