పుట:Womeninthesmrtis026349mbp.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

స్మృతికాలపుస్త్రీలు

అట్లే కేవల దాంపత్యప్రభావముచే గురుపత్ని గురువు వలెనే పూజ్యురాలగుచున్నది.

గురువత్ప్రతిపూజ్యాః స్యుస్సవర్గా గురుయోషిత:

(మను 2-120)

ధనవిషయమునను కర్మవిషయమునను భార్య కెట్టిస్థానము గలదను నంశము 'ధనము' 'కర్మకాండ' యను రెండధ్యాయములలో వివరింపబడును. ఇచట నొకముక్క చెప్పవలెను. ఆముష్మికసుఖసాధనమైన కర్మకాండయంతయు భార్యాధీనమే యై యున్నది. భార్య లేకుండనే యజ్ఞము చేయుటకును పురుషున కధికారములేదు. అతిథిపూజమున్నగు సత్కర్మలెన్నియో భార్యాధీనములై యున్నవి. (కర్మకాండ యను నధ్యాయమును జూడుడు.) అనగా సత్కర్మలన్నిటికిని ఫలమగు స్వర్గముకూడ భార్యాధీనమే యని తేలుచున్నది.

దారాధీనస్తథాస్వర్గ:

(మను 9-28)

(పురుషునకు స్వర్గమువచ్చుట భార్య యధీనమున నున్నది.)

భార్య లేనివానికి ధర్మమేకాక యర్థకామములుగూడ నుండవు. బ్రహ్మచారిగాని వానప్రస్థుడుగాని సన్యాసిగాని ధనము నుంచుకొనరాదు. అనుభవింపనురాదు. ఇంద్రియ జయము వారి ప్రధానసంపాద్యము. గృహస్థునకన్ననో