పుట:Venoba-Bhudanavudyamamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17


"కమ్యునిష్టులు నాసోదరులు. వారిలో కొందరు నామిత్రులుగలరు. కమ్యునిస్టు కావడము నేరముకాదు. కమ్యునిష్టులుఅన్న పేద ప్రజల సేవకలు." అనిఅన్నారు. కాని వారవలంభించే విధానములు హిందూదేశమున కనువగునవి కావని వినోబాజీ విశ్వసించిరి. "కాని కమ్యునిష్టులు హింసా విధానంతోసు, హత్యాకాండములతోను కార్యసాధనకు ప్రయత్నించుచున్నారు. ఈవక్రమార్గమువలననే వారిపనులు నిరుపయోగమవుచున్నవి. ప్రముఖ కమ్యునిష్టుసోదరులైన" శ్రీ డి వెంకటేశ్వరరావు గారు వుత్తరములు. వారు నన్ను కలసిన, వారిమార్గము సరిఅయినది కాదని నచ్చచెప్పగలను నలగొండ హైద్రాబాదు జైలులలోనున్న కమ్యునిష్టుసోదరులను కలసి, సంభాషించితిని. శాంతి మార్గముననుసరించుటయే వుత్తమ ప్రజాసేవ అని ప్రజలు గుర్తించుట అత్యవసరము,” అని అన్నారు.

మరొక సమయములో వినోబాజీ వుపన్యసించుచూ, యీప్రజా ప్రభుత్వములో ధనవంతులను హత్యచేయనగత్యములేదని, ఓటు అధికారముగల ప్రజలు, శ్రీ మంతులను పిస్తోలుతో కాల్చనవసరములేదని, కమ్యునిష్టులు స్వచ్ఛమై శాంతిమార్గమునవలంభించిన వారికి తమ సహకారము లభించుటయేగాక వుత్తమ మానవులందరి సహకారము లభించగలదని తెల్పిరి. బైరాలో వుపస్యసించుచూ, కమ్యునిష్టులు తమ హింసామార్గమును విడనాడిన, వారితో తాముపనిచేయుచు, కమ్యునిజం వ్యాప్తికి కృషి చేయి గలమని తెల్పిరి. వినోబాజీ విధానము కేవలము ప్రేమ మార్గము పైననే ఆధారపడివున్నది. పరమేశ్వరునియందు పూర్తివిశ్వాసముంచి, వారి ఆశీర్వచనములతో ఏ అధికారము లేకుండ, శాంతిదూతయై, ప్రేమసిద్దాంతములతో ప్రజలనుచేరిన మహత్తర యుగపురుషులు, హృదయ పరివర్తనయందు, మానవునిలో ఆంతర్భూత మైవున్న సద్గుణములయందు గాఢమైన విశ్వాశము గల యోగిపుంగవులు ఈవుత్తమోత్తమ కార్యనిర్వహణ, సేవాదృష్టిని గోల్పోయిన కాంగ్రెసువారిచేగాని, అధికార తృష్ణలోనున్న సోషలిస్టుల వలనగాని జరుగజాలనిధి. అందరిమేలును వాంఛించే సర్వోదయ సమాజుకు దీనిని నిర్వహించవలసివున్నది. భూదానముతో పాటు స్వయంపోషకు, గ్రామపరిశ్రమలగురించికూడ వినోబాజీ ప్రవచిస్తూవుండేవారులు. జనాభా వృద్ధి పొందుచుండుటచే, భూమిలభ్యమవుట కష్టసాధ్యమవుచున్నది. కాన భావులను, కాలువలను అధికముగా నిర్మించుకొనవలెను. రైతుకి