పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

         భవసద్మంబును నైనకావ్య మిలనా పద్మోద్భవస్థాయియై
         కవిసంస్ఫూర్తియు దాతృకీర్తియుదగం గల్పించునెల్లప్పుడున్.

ఈవ్రాతంబట్టి చూడగా,- మనవారు శ్రవ్యకావ్యముమాత్రమె సప్తసంతానములలో చేరినదనియు, ఆముష్మికాభ్యుదయప్రదమనియు, దృశ్యకావ్య మట్టిది కాదనియు, తలంచిరని యొక రహస్యము వెలువడుచున్నది." (పుట 54)

"మఱియు పూర్వులు రూపకరచన సేయనే లేదనుట సరిగాదు. శ్రీనాథుడు వీథినాటకము రచించెనని ప్రసిద్ధము గదా. అతడు బూతులుచేర్పక యుండిన నప్పటినుండియే నాటకము లల్లుకొనియుండును." (పుట 55)

1880 సం. ప్రాంత్యమున తెనుగున కొందఱు సంస్కృతనాటకములను అనువదింపసాగిరి. సంస్కృతనాటకములను మొదట తెలిగించినవారు నడుమవచ్చిన ఇంగ్లీషు అనువాదముల మర్యాద నవలంబించి తమ యనువాదములయందు సంస్కృత మూలములందలి ప్రాకృతాది భాషాభేదములను నిర్వహింపక అంతటను వ్యాకృతాంధ్రమే పెట్టిరి. దీనిచే రసము చెడినది. నాటకముయొక్క ప్రయోజన మంతరించినది. 1891 సం. వేంకటరాయశాస్త్రులవారు నాగానందనాటకము నాంధ్రీకరించిరి. ఈ యాంధ్రీకరణ ప్రకటన మాంధ్రనాటక వాఙ్మయమునందు నూతనయుగ ప్రారంభమును సూచించు చున్నది.