పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6-ప్రకరణము

క్రిశ్చియన్కాలేజి సంస్కృత ప్రధానపండితోద్యోగము

ఈ పైవాదములు శాస్త్రులవారికీర్తికి ప్రథమ సోపానము. ఎల్లవారును ధర్మసందేహములయందు వారి సలహాను పొందసాగిరి. ఇదియే వారికి క్రైస్తవకళాశాలలోని సంస్కృత ప్రథానపండితపదవికి కారణము నైనది. వారే ఇట్లుచెప్పి యున్నారు. *[1]"ఇందుంగడపట పేర్కొన్న పదమందుండగా (ముత్యాలపేట ఆంగ్లోవర్నాక్యులర్ స్కూలు హెడ్మేస్టరుగా) 1883 సం. స్త్రీ పునర్వివాహ దుర్వాదనిర్వాపణమును ధర్మ శాస్త్ర విషయకనిబంధన గ్రంథమును రచించి ప్రకటించితిని. బహుగ్రంథ పరామర్శపూర్వకముగా నిద్రాహారాదుల నొప్పరికించి దానిని రచించినఫలము ఇరుదెఱంగులయినది. నాకు దారిద్ర్యానారోగ్యాది క్లేశములును, తద్గ్రంథముచే నిరస్తవాదులైన మతద్రోహులకు బిరుదాంకములును లబ్ధమైనవి. ఆనిర్వాపణ గ్రంథమునకు ఇప్పటికిని ఎవరివలనను ఉత్తరము పుట్టలేదు. అయినను 'తపస్సు ఫలింపకపోయినను తనువు తేలికపడిన' దనురీతిగా ఆవాదగ్రంథము వలనను తత్కాలమందు మహాజన సంఘముమ్రోల నా కావించిన ఖండనోపన్యాసముల వలనను, నన్ను మదరాసులోని ప్రముఖులెల్ల రెఱుంగుటయు, డాక్టరు అపర్టు, మిల్లరు, లోనగు హౌణులకు నేను పరిచిత గీర్వాణ భాషుడనుగా గోచరీభూతుడ నగుటయు సంభవించినది. శ్రీ

  1. * ఆంధ్ర సారస్వతసభలోని యుపన్యాసము 1919 క్రీ.శ.