పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశమందును గొప్ప గీర్వాణపండితు లని ఖ్యాతిగలిగినది. ఈ ఖ్యాతిచే శాస్త్రులవారికి పలువురు పండితులు ఉన్నతపదవుల యందుండువారు మిత్రులయిరి. వారిలో శ్రీయుత, ప్రొఫెసర్ శేషగిరిశాస్త్రులవా రొకరు.

1883 సం. విధవావివాహగ్రంథమును శాస్త్రులవారు ప్రకటించి పెక్కువేలప్రతులను వెల లేకయే పంచిపెట్టిరి. ఈ సంవత్సరమే శాస్త్రులవారు అలంకారసారసంగ్రహ మని యొక చిన్నపుస్తకమును 'చంద్రాలోకాద్యనేక గ్రంథముల సారాంశమును' రచించి ప్రకటించిరి. 1880 లోనో అంతకు కొంతముందో 'జనవినోదిని' యను పత్రికకు సంపాదకులై దాదాపు పదేండ్లు వ్రాయుచుండిరి. ఈకాలమున ప్రతాపు కథను, తమతండ్రిగారి వలన వినినదానిని పెంచి అందే నాలుగుసంచికలలో ప్రకటించిరి. కథాసరిత్సాగరమును అనువదించుట కారంభించి కొన్ని ప్రకరణములు జనవినోదినియందు ప్రకటించిరి.

1886 సం. ముననే శాస్త్రులవారి యేకైకపుత్త్రులును మా తండ్రిగారునునగు వేంకటరమణయ్యగారు జనించిరి. వీరింగూర్చి మున్ముందు వ్రాయుదును.


_________