పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

లేపిరి. ఆయన మధ్వమతస్థుడు. లేచి 'శాస్త్రులవారూ, ఒక ప్రశ్న' అనెను.

'ఏమి?'

'మనం తద్దినాలు ఎందుకుపెట్టవలెను? మనంపెట్టే తద్దినాలు పెద్దలకు అందుతున్నవని ఏమినిశ్చయము? అందకపోతే పెట్టడమెందుకు?

వెంటనే శాస్త్రులవారు ఏమాత్రము తడవుకొనక గంభీరముగా, సభయంతయు చూచుచు 'ఎవరయ్యా మధ్వమతానికి ముద్ర కర్త?' అని యడిగిరి.

'అయ్యా నేనండీ' అని యొకాయన లేచెను.

శాస్త్రులవారు: ఈప్రశ్న అడిగే ఆయన్ను తక్షణం వెలివెయ్యండి. ఈయన అబ్బకు తద్దినం పెడుతున్నాడా కనుక్కోండి. పెట్టేవాడయితే ఈ ప్రశ్న వెయ్యడు. పెట్టకపోతే వెలివెయ్యండి.

ఆమాధ్వుడు: అయ్యా తెలివిలేక ప్రశ్న వేశానండీ.

శాస్త్రులవారు: అయితే కూర్చో.

మరల శాస్త్రులవారు ఉపన్యాస మారంభినారు ఈ మాఱు అంతరాయము కలుగలేదు.

మఱియొకచోట ఉపన్యసించునపుడు ఒకానొకరు సభలో నుండి మాటికిముందు ఏదో యొకప్రశ్న యడుగుచునేయుండిరి. ఒకానొక శ్లోకమునకు అర్థముచెప్పుసందర్భమున తద్విపరీతార్థముగా కూడచెప్పవచ్చునని శాస్త్రులవారిని ఆక్షేపించినారు