పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/708

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

676

జానపదకళారూపాలు

హుటాహుటిని హుసేన్ కూఫాకు రాగా ఆయనకు సహరించే వారు ఎవ్వరూ కనిపించ లేదు. జరిగిన మోసం గమనించిన హుసేన్ యూషిటీస్ నదీ తీరాన "కర్బలా" మైదానంలో విడిది చేసి వుండాగా "యజీద్ సైన్యం ఆయనపై పడింది. శత్రు బలం నాలుగు వేలకు పైగా వుండగా ఆయన బలం కేవలం ఇద్దరు అశ్వికులు, నలబై మంది కాల్బలం కావడం వల్ల నిరాశ చెందిన హుసేన్ తన అనుచరులను వెళ్ళి పోయి ప్రాణాలు కాపాడుకోమని తన కొరకు బలి కావద్దని కోరారు. కాని వారు ఆ సంకట స్థితిలో హుసేన్ ను వదలి వెళ్ళడానికి సమ్మతించ లేదు.

అమరవీరుడు హుస్సేన్:

ఆ ధర్మ యుద్దంలో హుసేన్ అనుచరులు అంతమొందగా, ఆయన, ఆయన కుమారుడు నిరాశ్రులై రణరంగంలో నిలిచారు. చివరకు కుమారుడు కూడా ఒకడు దురాగతుని బాణఘాతానికి ఆహుతి కావడం జరిగింది. కుమారుని శవాన్ని నేలపై నుంచి, ఆ విషాదం భరించే నిగ్రహశక్తిని తనకు ప్రసాదించమని హుసేన్ భగవంతుని వేడుకుని, దప్పికగొని నీరు త్రాగడానికి ముందుకు వంగగా బాణం వచ్చి ఆయన నోట గుచ్చుకుని ప్రాణాలను బలి గొన్నది. ఆ యుద్దంలో హుస్సేన్ ధారుణ మరణాన్ని స్మృతికి తెచ్చుకుని సంతాపాన్ని ప్రకటించేందుకు నిర్దేశితమైన ముస్లిం పర్వదినంగా మొహరం నిలిచి పోయిందని రంజని గారు ఆంధ్రజ్యోతిలో వివరించారు.

ఖురాన్ నిర్వచనం:

మొహరం నెలలో పదవ రోజు "సహదత్" ను సంతాపదినంగా పాటించ వలసిందిగా "ఖురాన్ " నిర్వచింది. ఆ రోజున "పీర్లు" అనే హస్తాకృతులను ఊరేగించి, ఊరియందుగల బావి దగ్గరో, నదుల దగ్గరో వాటిని శుభ్రపరచి నిర్ణీత