పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/707

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీర్ల పండుగలో మొహరం గీతాలు

మహమ్మదీయుల ప్రధాన పర్వ దినాలలో మొహరం ముఖ్యమైనది. హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోకతప్త హృదయాలతో జరుపుకునే కార్యక్రమమే పీర్ల పండుగ మొహరం.

ముస్లిం పంచాంగ రీత్యా అరేబియాలో సంవత్సరం యొక్క మొదటి తేదీ మొహరం. మొహరం పండుగనే పీర్ల పండుగ అని కూడ అంటారు. "పీర్ " అంటే మహాత్ములు, ధర్మనిర్దేశికులు అని అర్థం.

ధర్మయుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి గలిగిన రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి, ఊరేగించి, పూజించే వాటిని 'పీర్లు' అని పిలుస్తారు.

మహమ్మదీయులు, మత కలహాలు:

మహమ్మదు ప్రవక్త నిర్యాణం చెందిన తరువాత ఖలీఫాలయిన నలుగురులో మత కలహాల దృష్ట్యా హత్య గావింపబడినందున ఆయన పెద్ద కుమారుడు 'హసన్' ఖలీఫా కాగా విష ప్రయోగం వలన అతి త్వరిత కాలంలోనే పదవీ త్యాగం చేయవలసి వచ్చింది. ఆ తరువాత రెండవ కుమారుడైన హుస్సేన్ ఖలీఫా కావలసి వుండగా " ము అని యా" అనే పీఠాధిపతి కుమారుడైన యజీద్ తాను ఖలీఫానని ప్రకటించు కున్నాడు.

కూఫా నగర వాసులు "యజీద్ దౌష్ట్ర్యం నుంచి కాపాడమని హుస్సేన్ ను అందరం బలపరచగలమని కోరుతున్నట్లు బూటకపు వర్తమానం పంపటం జరిగింది.