పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కురవల కురవంజి

95


మన తెలుగు కొరవంజి నాటకాల్లో వర్ణిచబడ్డ ఎరుకలసాని ఎటువంటిదో, దాని చాకచక్యం ఎటువంటిదో, దాని మాటల చాతుర్యం ఎటువంటిదో గోకులపాటి కూర్మనాథ కవి రచించిన మృత్యుంజయ విలాసం ద్వారా తెలుసుకోవచ్చు.

కొరవంజే శివుడు:

పార్వతి శివుని గూర్చి తపస్సు చేస్తుందనీ, శివుడు సమాధిలో వుంటాడనీ, మన్మథుడు తపోభంగం చేసి దగ్దమై పోతాడనీ, పార్వతిని హిమవంతుడు తీసుకు పోతాడనీ, అప్పుడు శివుడు విరహ వేదనను భరించలేక, పార్వతిని చూడాలని తహ తహ లాడతాడనీ, అందుకోసం తాను కొరవంజి వేషం వేసుకుని పార్వతి దగ్గరకు వెళ్ళి ఎరుక చెపుతాడనీ, ఇలా వేషం ధరిస్తాడనీ వివరించబడింది.

ముక్కున బలు కెంపు ముక్కెర చెలగ
పెక్కు రత్నము పూస పేర్లు చెన్నొంద
సిరమున రత్న భాసిత పాత్ర బూని
యరుకతయై వచ్చె హిమశైలమునకు.

ఎరుకలసాని ప్రవేశం ఈ విధంగా సాగుతుంది.

ఎరుకసాని వచ్చె ఎరుకనుచు "అను "
ఎరుకలసాని వచ్చె నెరుకో ఎరుకో యెరుకో యనుచు "ఎరు "

మురిపెంపు నడకలతోడ, ముంగురు లల్లాడ సరసంపుమాటల - చతురతో - శిరమున నవరత్నఖచితమైన బుట్ట పెట్టి మెఱుపు వలెను మేను మెఱయగను వచ్చి తన గొప్ప చెప్పుకుంటుంది.

ఆటతాళం

సరసిజ భవురాణి, పరిణయమౌటమా యెరుకదు కాదటవే -
తరుణి మదికి నేదార్కాణగా జెప్పి తగు కోర్కెలందెదనే - యోదేవీ
"యెరుక గలవారు గల రెందరైన మా సరివత్తురే, రమణి

అని.