పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

స్వీయ చరిత్రము.



లెప్పుడు ముగియునో నేనెఱుఁగను. ఆయన లేకుండ నేనేమియు చేయఁజాలనుగనుక, మీరెట్లయినను మెయి 20 వ తేది తరువాత కొంతకాల మిక్కడ నుండునట్లేర్పాటు చేసికొనవలెను. అయినను మీయానుకూల్యమునుబట్టి మీరిక్కడకు ముందుగానే రావచ్చును. రఘునాధరావుగారిక్కడ లేకపోవలచి వచ్చినదని చింతిల్లుచున్నానుకాని యాయన స్థానాంతరగమన మనివార్యమయినట్టు కనఁబడుచున్నది." [1]

ఈ పక్షమునకు మిత్రుఁడయి విశాఘపట్టణములో మిక్కిలి ప్రబలుఁడుగానుండిన యొక సంపన్నగృహస్థునిమీఁద నొకమిత్రునిప్రేరణచేత గోగులపాటి శ్రీరాములుగా రనాలోచితముగఁ దెచ్చిన యొక యభియోగములో సంధిచేయవలెనన్న తలంపుతో ముందుగానే నచ్చటికిపోయి మాటాడవలసి వారితో మాటాడి, తరువాత ప్రథమవివాహ దంపతులను వెంటఁబెట్టుకొని భార్యాసహితముగా నొక వంటబ్రాహ్మణునితోడ బైలుదేఱి, ముందు మారాకను తంత్రీముఖమున చెంచలరావు పంతులుగారికిఁదెలిపి, విశాఘ రేవులో పొగయోడనెక్కి నాలవదినమున చెన్న పట్టణపు రేవుచేరఁగా చెంచలరావుపంతులుగా రోడమీఁదికే మనుష్యులను బంపి, మమ్ము పడవమీఁద ఒడ్డునకుఁగొనివచ్చి యక్కడినుండి బండ్లమీఁద తీసికొనిపోయి

  1. Mylapore, 26-4-82.


    "My dear friend,

    Raghunadha Rao goes to his village for some upanayanam on 3rd May and will not return till the 20th of that month. I do not know when your vacation terminates. Any how you must arrange to stay here for some time after 20th May, a I can do nothing without him. You can come here however before hand according to your convenience. I am sorry that Raghunadha Rao has to be absent, but his abcence seems to be unavoidable."