పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

స్వీయ చరిత్రము.

నట్లుగా వీధులలోనుండి తల లల్లల నాడుచుండఁగాఁ గొనిపోవుటయు, మరణ సమయములయందు బంధువులు తోడుపడి శవములను మోయక ప్రేతపత్నుల నగలఁ దెగనమ్మించి యైన డబ్బిచ్చి పనికిమాలిన యపవిత్రులచేత మోయించిటయు, దహనముగాక ఖననముచేయువారిని తరువాత నక్కలును కుక్కలును పైకీడ్చునట్లుగా కొంచెము లోఁతునఁ బాతి పైని మన్ను వేసి యూరకుండుటయు, బ్రాహ్మణులలోని యవశ్యసంస్కరణీయములైన దురాచారములు. పట్టణములో నెవ్వరియింటనైన మరణాపద తటస్థించినప్పుడు లౌక్యులు వైదికులు నన్న భేదములేక యెల్లవారును వెంటఁబోవుటకును ప్రేతమును రుద్రభూమికిఁ గొనిపోయి తోడ్పడుటకును నియమము చేసికొనుటకయి కొన్ని సభలుచేసితిమి. మొదట సభకు విజయంచేసిన లౌక్యులలోఁ గొందఱు తమ కది గౌరవావహమయినపనికాదని కొంతయాక్షేపించి వ్యాఘాతము కలిగింపఁజూచిరిగాని మా వాదము సావధానముగా విన్న మీఁదట ప్రాతికూల్యమునుమాని యట్లుచేయుట కర్తవ్యమని సిద్ధాంత మొనర్చిరి. ఈపని నాచరణమునకుఁ దెచ్చి కొంతమార్పు చేసియుందుముగాని యింతలో మేము వేఱొక గొప్పసంస్కారములోఁ దిగి యుండుటచేత దీనిని సాధారణముగా వ్యవహారమునకుఁ దెచ్చుట కవకాశము కలుగలేదు. ఈవిషయమయి 1888 వ సంవత్సరములో గవర్రాజుగారి మరణానంతరమున నేను సభలోఁ జెప్పిన యొక చిన్న యంశము నిందుదాహరించు చున్నాను. -

"మనలో శవములను రుద్రభూమికిఁ దీసికొనిపోవు విధమునుగూర్చియు పూడ్చెడు విధమునుగూర్చియు, మాలో మే మనేక పర్యాయములు చర్చించి యావిషయములో నేదైన మంచిమార్పు కలుగఁజేయుట కర్తవ్యమని మే మిద్దఱమును నిశ్చయించుకొన్నాము. ఇట్లు జరగిన కొంతకాలమున కనఁగా 1881 వ సంవత్సరము నవంబరునెలలో, ఆయనకు ప్రథమమునఁ బుట్టిన పురుషశిశువు మూడుమాసములు పెరిగి పోవుట సంభవించెను. అప్పు డందఱును మృతశిశువును వాడుకప్రకారముగా పీనుఁగులను మోచు బ్రాహ్మణునిచేతి కిచ్చిపంపి