పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే
కర్మజాన్ విద్ధితాన్ సర్వానేవమ్ జ్ఞాత్వా విమోక్ష్యసే.


వేదములలో పలువిధములగు యజ్ఞములు వివరముగ చూపబడి యున్నవి. అవి యెల్ల కర్మములను జేయుటవలన నేర్పడినవి. దీనిని దెలిసిన విముక్తి బొందుదువు. 4-32


శ్రేయాన్ ద్రవ్యమయా ద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప
సర్వం కర్మా ఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్య తే.


ద్రవ్యములతో చేయబడిన వేల్మికంటె జ్ఞానముతో జేయబడిసయజ్ఞమే మేలైనది. ఎట్టిపనియైనను జ్ఞానమునందు ముగింపు నొందుచున్నది. 4-33

జ్ఞానయజ్ఞ మనునది జ్ఞానముతో జేయబడిన వేల్మి. నేయి మొదలగు ద్రవ్యములులేకయే జ్ఞానమనుద్రవ్యముతో చేయబడుయజ్ఞము జ్ఞానయజ్ఞము. అనగా లౌకిక వ్యవహార మునకు కావలసినపనులను విధిగ జేయుట. ఏకర్మముజేసినను ఆకర్మము ఫలమును గూర్చి యాశను విడిచి, మనస్సును నిలుకడ పరచునదే జ్ఞానము. దీనిచే రానురాను భేద భావములుపోయి, సకలజీవులందును తనయాత్మ నిలుచుట చూచును. అట్లే యెల్లజీవులును పరమాత్మ యందడగి నిలుచుటయును జూచును. దీనిని చూడచూడ నిష్కామియై కర్మమును చేయుట సులభమగును. కర్మమును చేయునపుడు