పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్న యాచారములను తగినకారణము లేక విడువగూడదను మనోభావము అభివృద్ధి కడ్డము రాదు. తత్త్వవిషయమున హిందూమతము మారిమారియేవచ్చుచున్నది. పుస్తకములను మాత్రము మార్ప వీలులేదు కాని, మనుష్యుల భావములును, విశ్వాసములును కలసియే యొక మతమగును. చైతన్యముగల మనుష్యసంఘపు మనస్సులోని తలపు లెట్లు మార్పాటు బొందునో, యట్లే వారిమతమును మారివచ్చు చున్నది. హిందూమతము మనుష్యునివృద్ధికి పూర్ణస్వాతంత్య్ర మిచ్చుచు వచ్చుచున్నది. ఎట్టి యడ్డమును లేక బుద్ధి నుప యోగించి పరిశోధనచేయు స్వాతంత్య్రము నిచ్చుటచే లోకములోని వేరుమత మేదియును హిందూమతముతో ఏవిధమునను పోల్ప వీలులేదు.

హిందువులు శాస్త్రములుగా గ్రహించిన పురాణములు, స్మృతులు మొదలగు తొల్లింటి గ్రంథములం దొక్కొక్క విషయము ప్రధానముగ నున్నది. తత్త్వమునకు పలుమొగము లున్నవి. ఒక్కొక్కముఖము, ఒక్కొక్కధర్మము, నారాధించుచున్నది. హిందూధర్మమును వృద్ధిపొందించుచు వచ్చిన ప్రాజ్ఞు లాయాకాలములందు కనిపెట్టిన సత్యముల నాయా కాలములందు వ్రాసియుంచిరి. పదివేల సంవత్సరములుగ హిందూధర్మము వృద్ధినొందుచు వచ్చినది. అది మిగుల

(ఇచట ఒక వాక్యము పీడీఎఫ్ లో లుప్తమైనది )