పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మత్తః పరతరం నాన్యత్కించి దస్తి ధనంజయ
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ.


నన్ను మించియున్న వస్తువేదియులేదు. దారమునందు మణిగణములవలె నిదియంతయును నాయందు కూర్పబడి యున్నది. 7-7


రసో ౽ హమప్సు కౌంతేయప్రభా౽స్మి శశిసూర్యయోః
ప్రణవ స్సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు.


నీటిలోని రసము నేను. నేనే సూర్యచంద్రులలోని కాంతిని. అన్ని వేదములలోను నేను ప్రణవము. ఆకాశము లోనిశబ్దము నేను. మనుష్యులలో నేను పౌరుషమును. 7-8


పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావ సౌ
జీవనం సర్వభూ తేషు తపశ్చాస్మి తపస్విషు.


భూమియందలి గంధగుణమును, అగ్నిలోని తేజస్సును, అన్ని ప్రాణులలోని ప్రాణమును నేను, తపస్సుచేయువారి తపస్సు నేను. 7-9


బీజం మాం సర్వ భూతానాం విద్ధిపార్థ సనాతనం,
బుద్ధిర్బుద్ధి మతా మస్మి తేజ స్తే జస్వినామహం.


ఎల్లప్రాణులకును నేను సనాతనమైన బీజమని తెలియుము. బుద్ధిగలవారి బుద్ధిని నేను. కాంతిగలవారి కాంతిని నేను. 7-10