పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరమాత్మ అంతర్భావమై నిలిచి, యాజీవునికాధారమై వచ్చుచున్నాడని చెప్పవచ్చును.

జీవుడెట్లొకదాని తరువాత నొకటిగ పలుదేహము లను ధరించుచున్నాడో, ఒక్కొక్కరూపమును ధరించి, ఆ రూపమే తానగుచున్నాడో, అదే రీతిగ పరమాత్మ పలు జీవుల రూపముల నేకకాలమున ధరించి నిలుచును. ఒకవస్తువే రాజుగనో బిక్షకుడుగనో ఎద్దుగనో పందిగనో మామిడి చెట్టుగనో పురుగుగనో రూపమును బొందునట్లు, పరబ్రహ్మ మును పలురూపముల ధరించి నిలిచియుండవచ్చును. కాని, ఆత్మయే రాజు కాలేదు. పురుగును కాలేదు. అట్లే పరమాత్మయు మనుష్యుడై యుండలేదు. ప్రత్యేకముగానే నిలిచి యుండును. ఏ దేహములోను, ఏవస్తువులోను పరవస్తువు నిలిచి, దానికాధారమై వచ్చుచున్నదనుట దీనితత్త్వము. అది భాగములగుటకు వీలులేదు. పలువస్తువులలో నిలిచినను దాని యేకత్వము చెదరిపోదు.

పరమాత్మకును జీవునికిని నున్న పరస్పరసంబంధము నికమీద విచారింప నారంభింతమన్న, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అను వాదములలోనికి పోవలసియున్నది. భగవద్గీతలో ద్వైతాద్వైతప్రశ్నను ఎత్తుకొనుటలేదు. మూడుసిద్ధాంతములకును గీతనే ప్రమాణముగా జేసికొని