పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీత మనకు బ్రహ్మానందమును కలిగించును. అది జాతి, వర్ణ, లింగ, దేశభేదములను చేయదు. ఇతరమతగ్రంథముల యెడల నది సహనబుద్ధిని కలిగించును. కర్మ, భక్తి, జ్ఞాన యోగములకు దానిలో చక్కని సమన్వయము కలదు. అది సనాతన వైదిక ధర్మవృక్షమున పండిన ఫలమని సులభముగ చెప్పవచ్చును.


ఇది హిందూమతమూల తత్త్వములను స్పష్టముగ బోధించుచున్నది. కాబట్టి హిందూమత ప్రధానలక్షణములను దెలియ నాసక్తిగలవా రీ ఉత్తమోత్తమమును, నద్భుతమునైన గ్రంథమును తప్పక చదువవలెను. నశ్వరము, అనశ్వరము; క్షేత్రము, క్షేత్రజ్ఞుడు; అనువానినిగూర్చి యోగ, సాంఖ్య, న్యాయ, మీమాంసా, వేదాంతశాస్త్రములలో వేదానుసారముగ వివరింపబడియున్నది. ఆజ్ఞానమంతయు గీతలో జ్ఞాన, భక్తి సంవర్ధితమయిన కర్మసిద్ధాంత మను పేర నుపదేశింపబడినది. కాబట్టి, సంస్కృత వాఙ్మయములోకూడ నంత సమగ్రముగను స్పష్టముగను హిందూధర్మ తత్త్వము ప్రతిపాదింపబడిన గ్రంథము లేదని చెప్పవచ్చును.


___________