పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును సంపాదింప జీవుడు చేయవలసిన ప్రయత్నములు కర్మ విధిప్రకారము, పూర్వకర్మబంధమును త్రెంచివేయు పుణ్య కర్మములగును. భగవంతుని దివ్యానుగ్రహము బడయుటకు మార్గము గీతయందు చెప్పబడియున్నది. దీనికే యోగమని పేరు.


గీతలో చెప్పబడిన యోగమునందలి యంగము లేవియన:-


(1) ఇంద్రియములను అరికట్టుట, శుద్ధమైన జీవనము, చక్కని యాచారము అనగా ఉపాసన, కర్మము, ఆహారము, విహారము, నిద్ర మొదలగువానియందు నియమము.


(2) స్వభావమువలననో, సంఘమునందు తాను పొందిన స్థానమువలననో, సందర్భమువలననో, తన కేర్పడ్డ పనులను స్వలాభమును కోరక, సంఘమును విడువక యంతయును లోపములేక చేయుట.


(3) జయాపజయములను సమబుద్ధితో ననుభవించుట, కష్టములనుచూచి మనస్సున కలతనొందక, దుఃఖములు, క్లేశములున్నను, ధైర్యమును శాంతినివిడువక మనస్సును సమత్త్వమునకు తెచ్చికొనుట.


(4) మనస్సును ఎడతెగక కాచికొని, కామము, క్రోధము, ఆశ, అను ఉద్రేకములకు ఎడమివ్వకుండుట.


(5) ఇట్లు లోపలను, బయటను శుద్ధముచేసుకొని,