పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(28)

తుదిపలుకు


ఇంక మనము చదివిన విషయములను సంగ్రహముగ చెప్పవలెననిన పూర్వజన్మమున చేసిన కర్మములచేతను, సంగమములచేతను కొన్నిగుణములతో గూడి దేహప్రకృతులను పొంది పుట్టుదుము. ఈ స్వభావగుణములే జీవుని బంధించుచున్నవి. వానిని సంపూర్ణముగ నిగ్రహించి విడువ వచ్చునని, పక్వము కానికాలమున సన్యసింప ప్రయత్నించి నందువలన ప్రయోజనము లేదు. కాని ఈ స్వభావగుణములను గెలిచి, విడుదలనొంద ప్రయత్నించుటకు, స్వాతంత్య్రమును, శక్తియు, జీవుని కున్నవి. ఈ జన్మమున జీవుడెట్లు నడుచుకొనుచున్నాడో యామార్గము ననుసరించియే యతని తరువాతి చరిత్రము నుండును. ఒకడు పూర్వకర్మమునుండి సంపూర్ణముగనో లేక కొంచము కొంచముగనో విడుదల నొందుటయో లేక పూర్వముండిన బంధమున కింకనుచేర్చి యధికబంధము లేర్పరుచుకొనుటయో, ఈజన్మమున నతడెట్లు నడచుకొనుచున్నాడో దాని ననుసరించియుండును.


భగవంతుని యనుగ్రహమువలన యెట్టి బంధము నుండియు జీవుడు విడుదలను బొందవచ్చును. ఆ యనుగ్రహ