పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీని తత్త్వమేమి? అంతఃశ్శుద్ధియు, బాహ్యశుద్ధియు గల శుద్ధజీవనమును నొకడు నడిపి, సకలకర్మములను సంగము లేక భగవంతుని కర్పణముగచేసి బుద్ధిని స్థిరముగ నిలుపుకొని యడుగడుగునకు ధ్యానముచేయుచు వచ్చినయెడల భక్తునికి భగవంతుని విశ్వరూపము కనబడును. అనగా జ్ఞానోదయమై భగవంతు ననుభవించుననునదే. ఆదర్శమును గూర్చి సంజయుడు చెప్పుచున్నాడు :-


ఏవముక్త్వా తతోరాజన్ మహాయోగేశ్వరో హరిః
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం


సంజయుడు చెప్పుచున్నాడు: "రాజా! ఇట్లుచెప్పిన పిదప, మహాయోగేశ్వరుడైన హరి, తన పరమైశ్వర్యరూపమును పార్థునకు చూపెను." 11-9


దివి సూర్యసహస్రస్య భవేద్యుగప దుత్థితా
యదిభా స్సదృశీసాశ్యా ద్భాస స్తస్య మహాత్మనః


ఆకాశమున ఒక్కటే క్షణమున వేయి సూర్యబింబములు కనబడినయెడల నాకాంతిని విశ్వరూపపుకాంతితో పోల్చవచ్చును. 11-12


తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్త మనేకథా
అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా.