పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యమైన జ్ఞానప్రకాశమునకును ఉన్న భేదము సత్యమైన యద్వైతజ్ఞాన ముదయించినయెడల జీవితము తనంతటనే శుద్ధమైపోవును. విషయలంపటములు తొలగిపోవును. విషయ సంగములు తొలగగా తొలగగా జ్ఞానము మరింత యెక్కువగా ప్రకాశించుచుండును.


దీనిచేతనే భగవద్గీత యనునది, ద్వైత, అద్వైత, విశిష్టా ద్వైతమతములలో చేరినవారికందరకును శాస్త్రముగ నుండి వచ్చుచున్నది. బ్రహ్మమును, జీవుడు నొక్కడా, వేరా యను ప్రశ్న భగవద్గీతలో నుపదేశింపబడిన యనాసక్త యోగమును, జ్ఞానయోగమును, ప్రపత్తిమార్గములను నేవిధమునను బాధింపవు.


(27)

విశ్వరూపదర్శనము


భగవద్గీత పదకొండవ అధ్యాయములో భగవంతు డర్జనునకు, విశ్వరూపము చూపించుట చెప్పబడినది. మేలు, కీడు, సుఖము, దుఃఖము, చీకటి, తేజస్సు, అను ద్వైతములను గడచి నిలుచు భగవంతుడు తన సర్వవ్యాపకమై విశ్వరూపము నర్జనుడు చూచున ట్లతనికి జ్ఞానదృష్టిని అనుగ్రహించి దర్శనము నిచ్చెనని చెప్పబడినది.