పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ఓమ్‌' అను శ్రేష్ఠమైన యేకాక్షరవేదమును జపించుకొని, నన్ను స్మరించువాడయి, దేహమును విడుచువాడు పరమగతిని పొందును. 8-13


అనన్యచేతాస్సతతం యో మాం స్మరతి నిత్యశః
త స్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః


వేరుతలపునువిడిచి, నన్నెల్లదినములందు, నెప్పుడును స్మరించు నిత్యయోగికి నేను సులభముగ దొరుకుదును. 8-14


వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం
అత్యేతి తత్సర్వ మిదం విదిత్వా
యోగీ పరం స్థాన ముపైతి చాద్యమ్.


దీనిని తెలిసినయోగి యజ్ఞములచేతను, తపస్సులచేతను, దానములచేతను, పొందదగినదిగా వేదములందు చెప్పబడు నాదిస్థానమయిన పరమపదమును పొందును. 8-28


చనిపోవునపుడుకూడ మనస్సును స్థిరపరుచుకొని, భగవంతుని ధ్యానించి, ప్రాణమును విడిచినయెడల పరగతిని పొందవచ్చునని పైని 9, 10, 12, 13 శ్లోకములలో చెప్పబడినది. సనాతనమైన తత్త్వము, దీనితత్త్వ మెట్టిదనిన:-


(1) ఎట్టిజీవితము గడపువానికైనను గతియున్నది. ఒకధర్మము నాచరింపకయే, ఒక పుణ్యతీర్థమునందు మునుగ