పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నదియు, గౌరవింపక యవమానించి చేసినదానము తామస దాన మగును. 17-22


మనము అనుదినమును తినుతిండి మన గుణములను గొప్పవిగను, నీచములుగను మార్చును. సాత్త్వికాహారమేది, శాంతచిత్తత కడ్డమువచ్చు రాజసాహార మేది? బుద్ధినడచు తామసాహార మేది? అనునది గీతలో సూచింప బడినది.


ఆహార స్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః
యజ్ఞ స్తప స్తథా దానం తేషాం భేద మిమం శృణు.


హోమమును, తపస్సును, దానమును, మూడును, మూడువిధములుగ నుండును. వారికివారికి ప్రియమైన భోజనముమూడువిధములుగనుండును. వానిభేదమునువినుము. 17-7


ఆయుస్సత్త్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః
రస్యా స్స్నిగ్ధాస్థ్సిరాహృద్యాఆహారాస్సాత్త్వికప్రియాః.


ఆయుస్సు, శక్తి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి వీనిని వృద్ధిచేయునదియు, రసముతో గూడినవి, జిడ్డు గలవి, స్థిరముగ నుండునవి, శాంతి నిచ్చునవి యైన ఆహారములు సత్త్వగుణముగలవారికి ప్రియము. 17-8


కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః
ఆహారా రాజస స్యేష్టా దుఃఖ శోకామయప్రదాః.


కారము, పులుపు, ఉప్పు, మిక్కిలివేడి, ఎక్కువ