పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః
మా మాత్మపరదేహేషు ప్రద్విషన్తో౽భ్యసూయకాః


అహంకారమును, బలమును, దర్పమును, కామమును క్రోధమునుబొందినవారై, వీరు తమదేహములలోను, ఇతరుల దేహములలోను, పరమాత్మనై యున్న నన్ను పగతో చూతురు. 16-18


మోసమును పశుబలమును ఉపయోగించి సంపాదించిన ధనమును, దాని నాశ్రయించిన నాగరికతయు, ప్రతిష్ఠకొరకు మనస్సును తృప్తిపరచు కొనుటకును చేయు దానములును, సార్వజనికోపయోగము లయిన మంచికార్యములును, నీవేషములకు పునాదులై నిలుచు నధర్మమును ధర్మముగాచేయసమర్థములు కావు. ఇట్టి యనాత్మవాదమును, నాస్తికమును, తుదకు నాశమునకే మార్గము లగును.


పూర్వులు చూచినసత్యముల నెడపెట్టకూడదు. వారు తాము చేసిన చింతచేతను, నభ్యాసముచేతను, తపస్సు చేతను ధ్యానముచేతను చూచిన సత్యమునుమరచి, మనము మొదటి నుండియు ప్రయత్నించి, మనమే చూడ నెంచుట యుచితము కాదు. సంపాదించిన ధనము నుంచుకొని, దానిపై నింకను సంపాదింపకోరుట మనకు కర్తవ్యము. పూర్వులు చూచిన సత్యములకు శాస్త్ర మనిపేరు. ఒక్కొక్కడును మరపునొంది