పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈపగవానిని చంపితిని. ఇంక నితరులను చంపెదను. నే నీశ్వరుడను, నేను భోగిని, నేను సిద్ధుడను, నేను బలవంతుడను, నేనుసుఖపడుచున్నాను, అని ఇట్లెన్నుచుందురు. 16-14


అనేక చిత్తవిభ్రాంతా మోహజాల సమావృతాః
ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకే౽శుచౌ.


పలువిధములగు చిత్తవిభ్రాంతి నొంది, మోహమను వలలో చిక్కి, కామభోగములలో తగిలి అశుద్ధమైన నరకమున పడుదురు. 16-16


ఆఢ్యో౽భిజనవానస్మి కో౽న్యో౽స్తి సదృశో మయా
యక్ష్యేదాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః.


"నేను పుణ్యవంతుడను. నాకు స్వంతబంధువు లనేకు లున్నారు. నాతో సమానమయినవా డెవడున్నాడు? యజ్ఞములను చేయుదును. దానములు చేయుదును. సుఖముల పడయుదును"అనిఇట్లజ్ఞానముచేమోహమునొందుదురు. 16-15


ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః
యజన్తే నామయజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం.


వారు తమ్ముతామే పొగడుకొందురు; వారు పిడివాదముచేయువారు; ధనము, అభిమానము, మదములతోకూడిన వారు. డంభమునకు విధి నుల్లంఘించి పేరుకు మాత్రము యజ్ఞములను చేయుదురు. 16-17