పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు "ఈలోకములో సత్యమను పదార్థము లేదు. లోకము ధర్మముతో ప్రతిష్ఠింపబడి యుండలేదు. పరిపాలించు నీశ్వరుడును లేడు," అనిఅందురు. ఒకటితో నొకటి కలియగా ఆకూడికవలన నెల్లసృష్టియు నగుచున్నదనియు, లోకమునకు కామమే హేతువనియు వారందురు. 16-8


ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మనో ౽ ల్పబుద్ధయః
ప్రభవ న్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతో౽హితాః


అల్పబుద్ధిగలిగి యాత్మను నాశనము చేసికొనువా రిట్టి చూపుగలవారయి, క్రూరకార్యములను చేసి, లోకమునకు కీడుచేసి, దానినాశమునకు కారణ మగుదురు. 16-9


కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః
మోహాద్గృహీత్వా౽సద్గ్రాహాన్‌ప్రవర్తన్తే౽శుచివ్రతాః


తృప్తినొందచాలని కామము నాశ్రయించి, డంబమును, గర్వమును, మదమును బొందినవారై, మోహముచే కలుగుతప్పుటభిప్రాయములతో కూడినవారై, యశుద్ధవ్రతములతో నుండువారై వారు ప్రవర్తింతురు. 16-10


చింతా మపరిమేయాం చ ప్రలయాంతా ముపాశ్రితాః
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః


మరణమునకు తీరని మితిలేనిచింతనుపొంది కామోప