పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

దక్షిణగోగ్రహణ సమయమున సుశర్మ విరటరాజును బట్టుకొనిపోవుచుండఁగ నీభీముఁ డరిగి యతనిని విడిపించి సుశర్మను బట్టి కట్టితెచ్చి తనయన్న కొప్పగించెను. ఆధర్మరాజు ఘోషయాత్రయందు దుర్యోధనుని విడిపించినరీతి నీసుశర్మను విడిపించి పంపివేసెను. యుద్ధమునకం టె బూర్వ మప్పుడప్పుడు హిడింబ బక జరాసంధ కిమ్మీర జటాసుర కీచకాది మహావీరుల నీభీముఁడు సంహరించెను.

భారతయుద్ధమునం దీభీముఁడు సైంధవవధనాఁడు ధర్మరాజుపనుపున నర్జునునకు సహాయుఁడుగ నరుగుచు ద్రోణునిచే నడ్డగింపఁబడెను. అప్పు డతనిని లక్ష్యపెట్టక భీముఁడు రథముఁ డిగ్గి ద్రోణునిరథముయొక్క నొగలనుఁ బట్టుకొని తనభుజశక్తిచేఁ ద్రిప్పి పడద్రోసెను. అప్పుడు ద్రోణుఁడు రథమునుండి క్రిందికి దుమికి తప్పించుకొనెను.

కర్ణుని రెండవనాటియుద్ధమున భీముఁ డతనిని మూర్ఛితునిగాఁ జేసి గతప్రాణునిగాఁ దలఁచి సభయందు దులుపమాట లాడినందుకు నాలుక గోయ సమకట్టఁగా సారధియగు శల్యుఁ డిది మూర్ఛకాని చావుకా దనియు, నివుడు నాలుకఁ గోసిన యెడలఁ జచ్చుననియు, నట్లు నీచేఁ జంపఁబడినచో నీకర్ణుని జంపుదు నని చేసియున్న యర్జునుని ప్రతిజ్ఞకు భంగము గలుగుననియుఁ నేర్పుతో జెప్పఁగాఁ గ్రోధావిష్టమానసుఁడై యుండియు