పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37

రా జగునా ? అయితే రాజులకు మించినధర్మమును కొన్ని సమయములలో గనఁబరచినందున ధర్మరా జనెడు పేరును బొందెను.

5. భీముఁడు.

ఇతఁడు పాండుమహారాజు రెండవకుమారుఁడు. ఆకాలపువారిలో నధికతమమైన బలము గలవాఁ డగుటచేఁ బంచ భూతములలో మహాబలుఁ డనుపేరుగల వాయువునకు బుత్రుఁడని తలంచిరి. బలవంతుఁ డగుటచేతనే బాల్యమున దుష్ట ప్రవర్తనలు గల కురుకుమారుల నాటలయందు శ్రమపరచుచు నుండెను. అదిమొదలుగ నితనియందు గౌరవులకు, ద్వేష మభివృధి నొందుచు వచ్చెను.

లక్కయిండ్లనుండి తప్పించుకొనిపోవునపు డీభీముఁడు జననీసోదరులను నిండుగ గాపాడెను. రాజసూయయాగమునకు ముందు తనయన్నపనుపున నీతఁడు తూర్పుదిక్కున కేగి యాదేశములను జయించెను.

ద్రౌపదీవస్త్రాపహరణసమయమున భీముఁడు వస్త్రము లొలిచినందుకు రణమున దుశ్శాసనుని యురమునుజీల్చి హృదయరక్తపానమును జేసెద ననియును, ద్రౌపదిని దనతొడ మీఁద గూర్చుండు మని సంజ్ఞ చేసినందుకు దుర్యోధనుని తొడలు విరుగఁ బడవైచెద ననియుఁ, బ్రతిజ్ఞ చేసెను.