పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

159

ఱును శ్రీరాములవారియొద్ద సెలవుఁగైకొని వారివారి స్థానములం జేరిరి. భరతుఁడు యువరాజైయుండఁగ ననేకసంవత్సరములు శ్రీరాములవారు కృతయుగధర్మములను నడపుచు నశ్వమేథాది యాగములం చేయుచు రాజ్యమునుఁ బాలించిరి.

ఇక మనము తీసికొనవలసిన నీతి యేమియనిన:-

పితృవాక్య పరిపాలనమునకును, సత్య ప్రతిజ్ఞతకును, శరణాగత రక్షణమునకును, భర్తృ ప్రవర్తనమునకును, సోదర వాత్సల్యమునకును, రాజ్యపాలనమునకును శ్రీరాములవారు నిదర్శకు లయియున్నారు. పాతివ్రత్యమహిమకు శ్రీసీతాదేవియు, జ్యేష్ఠభ్రాతయొక్క. యనుసరణమునకును శుశ్రూషకును లక్ష్మణస్వామివారును, జ్యేష్ఠభ్రాతయందలి భక్తికిని దద్ద్వారా అప్రయత్నసిద్ధము లగురాజ్యభోగములయందు విముఖతకును భరతుఁడును, జ్యేష్ఠభ్రాత లేనిసమయమున నతనిస్థానమందున్న భరతుని ననువర్తించుటకు శత్రుఘ్నుఁడును బ్రదర్శకు లై యుండిరి.

మఱియు విశిష్టాద్వైతులు రాములవారు పితృవాక్య పరిపాలనాది సామాన్యధర్మములకును, లక్ష్మణస్వామివారు భగవచ్ఛేషత్వమునకును, భరతుఁడు భగవత్పారతంత్ర్యమునకును, శత్రుఘ్నుఁడు భాగవతశేషత్వమునకును నిదర్శకులని చెప్పుదురు.