పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

మరునాటి యుదయమున శ్రీస్వామివారి నెదుర్కొనుటకు భరతశత్రుఘ్నులు హనుమదాది పరివార సహితులై వెళ్లఁగా నింతలో బుష్పకవిమానమునుఁ డాసి చేరెను. అపుడు భరతుఁ డన్నగారి పాదములు పట్టుకొని నమస్కరించి కుశల ప్రశ్నానంతరము, రాజ్యభోగములవలన సుగ్రీవునివలె శ్రీరామకార్యమును మరచియుండక తనచే నదివరకు భక్తితోఁ బూజింపఁబడుచున్న పాదుకలను దన యన్నగారి పాదములకు సమర్పించెను. అపు డందఱును గలిసికొని నందిగ్రామముఁ జేరిరి. శ్రీరాములవారు రాజలంకారయుక్తులై యచటి నుండి బయలుదేరి పరివారముతో నయోధ్యా పట్టణముఁ జేరి యచట బట్టాభిషిక్తు లయిరి. ఆసమయమున శత్రుఘ్నుఁడు శ్రీస్వామివారికి శ్వేతచ్ఛత్రమును బట్టెను. సుగ్రీవ విభీషణలు చామరములను వీచిరి. ఇచట భరతలక్ష్మణులు చామరములను ధరింపక సుగ్రీవవిభీషణు లేలవీచిరో విచారింపుఁడు. వారిరువురిలో నెవ్వఁడు యువరాజుగ నభిషిక్తుఁ డగనో యది పట్టాభిషేకాత్పూర్వము నిర్ణయింపఁబడుటకు వీలులేక యుండెను.

పట్టాభిషేకానంతరము విభీషణసుగ్రీవాదులకు యథార్హముగ సత్కారములు చేసిరి. అందు సీతాన్వేషణాది కార్యములయందు ముఖ్యుఁ డగుహనుమంతునకు శ్రీసీతాదేవిచే నొకముక్తాహారము నిప్పించి గౌరవించి ఆపిదప నంద