పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

వలసియున్నదని భీముఁడు చెప్పియే యున్నాఁడు. బలరాముల వారికి శ్రీస్వామివా రిచ్చినయుత్తరములో సమయ మెఱిఁగి ప్రతిజ్ఞ నెరవేర్చుకొనె నని యున్నది. కావునఁ బాండవపక్షమున నున్న సర్వేశ్వరునకు మచ్చ దెచ్చుట కీవిషయమును గ్రంథకర్త కల్పించి యుండును.

నాటిరాత్రి పాండవులను శిబిరమున నుండనీయక యోఘవతీనదీతీరమునకు రథములతోఁగూడ శ్రీస్వామివారు పిలుచుకొనిపోయి రనియు, అందుచే బాండవు లశ్వత్థామచేఁ జంపఁబడక తప్పిపోయి రనియు నున్నది. అశ్వత్థామ చేయఁబోవు ఘోరకృత్యము నదీతీరమునకు జేరుటకుముందు శ్రీస్వామివారికిఁ దెలిసియున్న యెడల బాండవసేననంతను రక్షించి యుందురు. సర్వజ్ఞునకు దెలియదా యని యంటిరేని, అశ్వత్థామ రాత్రి మించినపైని దుర్యోధనునియొద్ద కేగి యతని దురవస్థను జూచి యర్థరాత్రా నంతరమున నీదుష్కార్యమును జేసెను. కావున బాండవు లానదీతీరమునకు బోవకముం దీవిషయము శ్రీస్వామివారికిఁ దెలియవచ్చుటకుఁ బ్రసక్తిలేదు. అశ్వత్థామ యీదుష్కార్యమును జేయఁ బూనినప్పుడెకదాహస్తినాపురమున ధృతరాష్ట్రునియొద్దనున్న శ్రీస్వామి కావిషయము హృదయగోచర మైనది ? మరి యేమి యనిన : యుద్ధము సమాప్త మైనపిదప బాడుపడిన యాస్థలమునందు నాటిరాత్రి